Ponniyin Selvan movie Review : గత కొద్ది కాలంగా పొన్ని యన్ సెల్వన్ మూవీని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తోంది కోలీవుడ్ మీడియా. ఇది తమిళ బాహుబలి అని, మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు అంటూ చాలానే బిల్డప్ ఇచ్చారు. దీన్ని దశాబ్దాలుగా ఆయన మోస్తున్నారని, కమల్ హాసన్ తో తీయాలని అనుకున్న మూవీని చివరకు విక్రమ్ తో తీశాడంటూ చాలానే కట్టుకథలు చెప్పారు. మరి ఇంత బిల్డప్ ఇచ్చిన ఈ మూవీ ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఇది ఎలా ఉందో చూద్దాం.
రాజుల కథలు ఎన్ని వచ్చినా బాహుబలిని ఏవీ అందుకోలేకపోయాయి. అయితే ఇది కూడా ఒక రాజుల కథే. వెయ్యేండ్ల క్రితం పరిపాలించిన చోళ రాజుల గొప్పతనాన్ని వివరిస్తూ తీసిన మూవీ ఇది. చోళ రాజు అయిన ఆదిత్య కరికాలుడు(విక్రమ్) తన రాజ్యాన్ని శత్రువుల నుంచి ఎలా కాపాడుకున్నాడు, ఎలాంటి వ్యూహాలు అమలు చేశాడు, ఇందులో కుందవాయి(త్రిష), నందిని(ఐశ్వర్య రాయ్) పాత్రలు ఎంత వరకు ఉన్నాయనేది ఈ మూవీ కథ.
విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మొదటి నుంచి ఏ పాత్రలో అయినా జీవించేస్తారు. ఇప్పుడు చోళ రాజుగా కూడా అందరినీ ఫిదా చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే మణిరత్నం కరెక్ట్ వ్యక్తినే ఆ పాత్రలో చూపించాడు. ఇక త్రిష అందంతో పాటు అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక ఐశ్వర్య అందం మరింత ప్లస్ అయింది. దాంతో పాటు ఆమె పాత్రి చాలా విభిన్నంగా ఉంది. అయినా సరే తనలోని అన్ని కోణాలను చూపించింది. ఇక కార్తి తన పాత్రలో జీవించేశాడు. జయం రవి ఆకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్, మిగిలిన నటీనటులు తమ పాత్రలతో బాగానే మెప్పించారు.
ఇలాంటి చారిత్రక సినిమా తీయాలంటే చాలానే జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ మణిరత్నం డైరెక్షన్ చూశాక మరో గొప్ప దర్శకుడే అని అనిపించక మానదేమో. కాకపోతే దీన్ని బాహుబలితో పోల్చడం కరెక్టు కాదు. ఆయన మేకింగ్ సూపర్ అనేలాగే ఉంది. ఎన్నో సీన్లలో మణిరత్నం ఈజ్ బ్యాక్ అన్నట్టు ఉంటుంది మూవీ. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కాకపోతే మ్యూజిక్ మాత్రం తమిళ జనాలకు నచ్చే విధంగానే ఉంది. అన్ని భాషల ప్రేక్షకులను ఇది ఆకట్టుకోలేకపోవచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. తప్ప మిగతా వన్నీ ఓకే అని చెప్పుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్..
విక్రమ్, త్రిష, ఐశ్వర్య, కార్తి నటన..
మణిరత్నం దర్శకత్వం,
కథ, కథనం
మైనస్ పాయింట్స్ :
తమిళ ఫ్లేవర్..
కొన్ని పాత్రలకు ప్రాముఖ్యత దక్కలేదు
మొదటి నుంచి ఇది మరో బాహుబలి అన్న రేంజ్‌లో బిల్డప్ ఇచ్చారు. ఆ రేంజ్ సినిమా కాదు గానీ.. ఇది కూడా ఓ మోస్తరుకు మించి ఆడే అవకాశాలు ఉన్నాయి. తమిళంలో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తెలుగులో కూడా ఎలాంటి అంచనాలు పెద్దగా లేవు. కానీ మూవీ బాగుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఈ మూవీకి అదే కలిసి వచ్చేలా ఉంది. మొత్తంగా ఇది బాగానే ఆడే అవకాశాలు ఉన్నాయి.
రేటింగ్ : 2.5/5.0
Read Also : Ashu Reddy : వామ్మో.. అషురెడ్డి ఏందీ డ్రెస్సు.. మొత్తం కనిపిస్తున్నాయ్..!
Read Also : Tamannaah : మొత్తం తెర పెట్టేసిన తమన్నా.. అక్కడ పువ్వు పెట్టుకుని అరాచకం..!