Ranga Ranga Vaibhavamga movie Review : రంగ రంగ వైభవంగా మూవీ రివ్యూ..

Ranga Ranga Vaibhavamga Review: మెగా మేన‌ల్లుడు పంజా వైష్ణ‌వ్ తేజ్ మొద‌టి రెండు సినిమాలు ఉప్పెన‌, కొండ‌పొలం లాంటి డిఫ‌రెంట్ సినిమాల‌తో ఎంట‌ర్ టైన్ చేశాడు. కానీ ఈ సారి మాత్రం ఒక ఫ్యామిలీ, రొమాంటిక్ ల‌వ్ స్టోరీతో వ‌చ్చాడు. ఇంత‌కు ముందు రొమాంటిక్ ల‌వ్ స్టోరీల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శ‌ర్మ ఇందులో న‌టించింది. ఇప్ప‌టికే ఇలాంటి క‌థ‌ల‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. మ‌రి గిరీశాయ తెర‌కెక్కించిన ఈ మూవీ కొత్త‌ద‌నం ఏముందో తెలుసుకునే […].

By: jyothi

Updated On - Fri - 2 September 22

Ranga Ranga Vaibhavamga movie Review : రంగ రంగ వైభవంగా మూవీ రివ్యూ..

Ranga Ranga Vaibhavamga Review: మెగా మేన‌ల్లుడు పంజా వైష్ణ‌వ్ తేజ్ మొద‌టి రెండు సినిమాలు ఉప్పెన‌, కొండ‌పొలం లాంటి డిఫ‌రెంట్ సినిమాల‌తో ఎంట‌ర్ టైన్ చేశాడు. కానీ ఈ సారి మాత్రం ఒక ఫ్యామిలీ, రొమాంటిక్ ల‌వ్ స్టోరీతో వ‌చ్చాడు. ఇంత‌కు ముందు రొమాంటిక్ ల‌వ్ స్టోరీల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శ‌ర్మ ఇందులో న‌టించింది. ఇప్ప‌టికే ఇలాంటి క‌థ‌ల‌తో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. మ‌రి గిరీశాయ తెర‌కెక్కించిన ఈ మూవీ కొత్త‌ద‌నం ఏముందో తెలుసుకునే ప్ర‌య‌త్నం అయితే చేయాల్సింది. మొద‌టి నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్‌, యూత్‌ను టార్గెట్ చేస్తూ ప్ర‌మోట్ చేసిన ఈ మూవీ నేడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌రి అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

క‌థ ఎలా ఉందంటే..

మ‌నం గ‌తంలో చాలా క‌థ‌ల‌ను చూశాం. పెద్ద ఫ్యామిలీలో పెరిగిన హీరో, హీరోయిన్ల‌కు చిన్న‌ప్ప‌టి నుంచే గొడ‌వ‌ల ఉండ‌టం, పెద్ద‌య్యాక అనుకోకుండా ప్రేమ‌లో ప‌డ‌టం, ఆ త‌ర్వాత ఫ్యామిలీని ఒప్పించి ఒక్క‌ట‌వ్వ‌డం. ఇప్పుడు రంగ రంగ వైభ‌వంగా మూవీ కూడా ఇలాంటి కోవ‌కే చెందింది. రిషి (వైష్ణవ్), రాధ (కేతిక) మధ్య చిన్న‌ప్ప‌టి నుంచే గిల్లికజ్జాలుంటాయ్. పెద్ద‌య్యాక కూడా ఇలాగే చిన్న చిన్న కార‌ణాల‌తో గొడ‌వ‌లు ప‌డుతారు. కాగా ఇద్ద‌రూ మెడిసిన్ తీసుకుంటారు. అక్క‌డ అనుకోకుండా ప్రేమ‌లో ప‌డుతారు. ఇదే ఈ క‌థ‌. అంటే ఒక‌రంటే ఒక‌రికి అస్స‌లు ప‌డ‌ని వీరి న‌డుమ ప్రేమ ఎలా చిగురించింది అన్న‌దే మెయిన్ స్టోరీ. త‌ర్వాత వారి కుటుంబం వారి ప్రేమ‌కు ఎలా ఇప్పుకుంద‌నేది థియేట‌ర్ల‌లో చూడాల్సిందే.

ఎవ‌రెలా చేశారంటే..

యంగ్ అండ్ బ్యూటిఫుల్ జంట అయిన వైష్ణవ్, కేతిక మధ్య కెమిస్ట్రీ సూప‌ర్ అనిపిస్తుంది. ఇద్ద‌రికీ ఇది మూడో సినిమానే కావ‌డం, పైగా ఇద్ద‌రూ లుక్స్ ప‌రంగా సూప‌ర్ పెయిర్ అనిపించుకున్నారు. వైష్ణ‌వ్ సరదా సన్నివేశాల్లో వావ్ అనిపిస్తాడు. కానీ ఎమోషనల్ సీన్స్ లో అంత‌గా ఎక్స్ ప్రెష‌న్లు చూపించ‌క‌లేక‌పోయాడు. కేతిక కూడా త‌న గ్లామ‌ర్ తో బాగానే ఆక‌ట్టుకుంది. డైలాగ్ డెలివ‌రీ వైష్ణ‌వ్ ఇంకా బెట‌ర్ అవ్వాల్సింది. నవీన్ చంద్ర త‌న పాత్ర‌ను పండించాడు. ఇక మొద‌టి భాగంలో అలీ, రెండో భాగంలో స‌త్య కామెడీ పండించారు. సీనియ‌ర్ న‌టులకు ఇందులో పెద్ద‌గా స్కోప్ లేకుండా పోయింది. నరేష్, ప్రభు లాంటి వారిని వారిని దర్శకుడు ఇంకా బాగా వాడుకోవాల్సింది.

టెక్నిక‌ల్ గా ఎలా ఉందంటే..

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ యావ‌రేజ్ గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా.. మెయిన్ సాంగ్స్ మొత్తం గాలికి వ‌దిలేశాడు. షామ్‌దత్ సైనుదీన్ సినిమాటోగ్రఫీ చాలా కలర్‌ఫుల్‌గా వుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయ‌ని చెప్పుకోవాలి. కానీ మెయిన్ కెప్టెన్ అయిన డైరెక్ట‌ర్ గిరీశాయ రొటీన్ క‌థ‌తో సినిమాను తీశాడు. కొత్త‌ద‌నం లేక‌పోతే ఇప్ప‌టి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డం చాలా క‌ష్టం. ఆ విష‌యాన్ని ఆయ‌న మ‌ర్చిపోయాడు. ఇందులోని చాలా సీన్లు మ‌న‌కు గ‌త సినిమాలను గుర్తు చేస్తుంటాయి.

ప్లస్ పాయింట్స్..
పంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ మ‌ధ్య కెమిస్ట్రీ
కామెడీ, మ్యూజిక్‌
ఫస్టాఫ్ లోని కొన్ని సీన్లు

మైనస్ పాయింట్స్..
తేలిగ్గా ఊహించగలిగే సీన్లు..
బ‌ల‌మైన క‌థ‌, ట్విస్టులు లేక‌పోవ‌డం
ఎమోషనల్ సీన్స్ పండ‌క‌పోవ‌డం

చివ‌ర‌గా..

ఎలాంటి కొత్త ద‌నం లేకుండా వ‌చ్చిన మూవీ ఇది. ఒక ప‌ది ఫ్యామిలీ ఎంట‌ర్ టైన్ మెంట్ సినిమాల‌ను మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్లు పెట్టుకోవ‌ద్దు. కేవ‌లం ఏదో చూడాలి అనుకుంటే త‌ప్ప దీనికి వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. బలమైన ఎమోషన్స్, ట్విస్టులు ఉంటే ఈ మూవీ ఇంకా బాగుండేద‌ని చెప్పుకోవాలి.

రేటింగ్‌

2

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News