Shakini Dakini Movie Review : చాలా రోజుల తర్వాత ఇద్దరు హీరోయిన్లు కలిసి ఓ మూవీని చేశారు. అది కూడా మొన్నటి వరకు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారే. లేడీ ఓరియెంటెడ్ కథలు గతంలో బాగానే వచ్చాయి. కానీ ఇద్దరు హీరోయిన్లు అది కూడా కామెడీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ట్రై చేయడం ఇదే కొత్త కాబోలు. రెజీనా, నివేదా థామస్ కలిసి జంటగా నటించిన మూవీ శాకిని, డాకిని. ప్రమోషన్ల ద్వారా హైప్ తెచ్చుకున్న ఈ మూవీ నేడు థియేటర్లలోకి వచ్చింది. మరి ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఈ కథ మొత్తం ఓ కామెడీ, సస్పెన్స్ చుట్టూ నడిచేలా ఉంటుంది. పోలీస్ ట్రైనింగ్ కోసం అకాడెమీలో జాయిన్ అవుతారు దామిని(రెజీనా), షాలిని(నివేదా థామస్) లు. ఇద్దరికీ మొదటి నుంచి అస్సలు పడదు. నివేదా ఇందులో మొదటి నుంచి తెలంగాణ భాషలోనే మాట్లాడుతుంది. ఇద్దరి నడుమ చిన్న చిన్న కారణాలతో గొడవలు పెరిగి పెద్దగా మారుతాయి. ఈ క్రమంలోనే వారు ఓ అమ్మాయి కిడ్నాప్ ను చూస్తారు. ఈ విషయం పోలీసులకు చెబితే వారు ఇంకేదో పెద్ద వాళ్ల కేసులతో బిజీగా ఉంటారు. దాంతో చేసేది లేక ట్రైనీ పోలీసులు అయిన తామే ఆ కేసును డీల్ చేయాలని అనుకుంటారు. ఆ కిడ్నాప్ చుట్టూ పెద్ద క్రైమ్ ఉంటుందని గుర్తిస్తారు. మరి దాన్ని వాళ్లు ఎలా ఛేదించారు, ఇద్దరూ ఎలా కలిసిపోయారన్నది థియేటర్లలో చూడాల్సిందే.
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ఇద్దరూ కూడా తమ పాత్రలకు పూర్తి స్థాయి న్యాయం చేశారు. నువ్వా నేనా అన్నట్టు నటించి మెప్పించారు. ఇద్దరూ కూడా ఇలాంటి కామెడీ జోనర్ పాత్రల్లో నటించడం ఇదే మొదటిసారి. అయినా కూడా ప్రేక్షకులను నవ్వించేందుకు బాగానే కష్టపడ్డారు. ఇందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది నివేదా థామస్. ఆమె ఫేస్ ఎక్స్ ప్రెషన్లు, డైలాగ్ డెలివరీ అదుర్స్. ఇక రెజీనా కూడా పర్వాలేదు. మిగతా క్యారెక్టర్లలో సుధాకర్ రెడ్డి, రఘు బాబు, పృథ్వీలు కామెడీని పండించారు.
ఈ సినిమా గతంలో వచ్చిన కొరియన్ మూవీ అయిన మిడ్ నైట్ రన్నర్స్ కు రీమేక్ మూవీ. కాకపోతే పూర్తిగా తెలుగు నేటివిటీకీ తగ్గట్టుగా దీన్ని తీర్చి దిద్దారు డైరెక్టర్. ఒక సీరియస్ కథను ఇలా కామెడీ ఎంటర్ టైన్ గా అలాగే సస్పెన్స్ గా మార్చడం చాలా కష్టమైన పనే. కానీ ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే చాలా సీన్లలో అసలు లాజిక్ లేకుండా చూపించాడు. ఇది పెద్ద మైనస్. ఇక మ్యూజిక్ గురించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఏ కొంచెం కూడా ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ కూడా పెద్దగా బాగాలేదు. సినిమాటోగ్రపీ కూడా అంతంతే. కాకపోతే నిర్మాణ విలువలు పర్వాలేదు.
నివేదా, రెజీనా నటన
కామెడీ సీన్లు
డైలాగ్స్
మైనస్ పాయింట్స్..
ఎమోషనల్ సన్నివేశాలు
సెకండ్ హాఫ్
లాజిక్ లేని స్క్రీన్ ప్లే
చివరగా..
ఇద్దరు అమ్మాయిల నడుమ వచ్చే అసూయ ఎలాంటి గొడవలకు దారి తీసిందనే విషయాన్ని చాలా ఎంటర్ టైనింగ్ గా చూపించారు. ఇది పర్వాలేదు. కానీ చాలా సీన్లలో అసలు లాజిక్ లేకుండా పోయింది. ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారో చూపించలేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లు అయితే తేలిపోయాయి. సెకండ్ హాఫ్ ను ఇంకా సస్పెన్సివ్ గా తీర్చి దిద్దినట్టు అయితే ఈ మూవీ ఓ రేంజ్ లో హిట్ అయ్యేది కాబోలు. మొత్తంగా సినిమా ను ఒక మంచి ప్రయత్నంగా సమయం ఉంటే చూడొచ్చు.
రేటింగ్ : 2.5/5.0
Read Also : Suma Kanakala : క్యాష్ ప్రోగ్రామ్ ఒక్కో ఎపిసోడ్ కు సుమ ఎంత తీసుకుంటుందో తెలుసా..?
Read Also : Poonam Bajwa : పలుచని డ్రెస్సులో పాలపొంగులాంటి అందాల విందు చేస్తున్న పూనమ్ బజ్వా..!