Swathi Muthyam movie Review : దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదిన స్వాతిముత్యం మూవీ విడుదల కానుంది. చిన్న సినిమా అయినా పెద్ద అంచనాలతో థియేటర్ల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పిస్తుందనడంతో ఎటువంటి సందేహం లేదు. బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు బెల్లంకొండ గణేశ్ ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన వర్ష బొల్లమ హీరోయిన్‌గా నటిస్తోంది.
స్వాతిముత్యం సినిమాను దర్శకుడు లక్ష్మణ్ కృష్ణ తెరకెక్కించగా.. సితార ఎంటర్‌టైన్మెంట్‌మై సూర్యదేవర, నాగవంశీ నిర్మించారు. ఇక ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. ఇక కాస్ట్ విషయానికొస్తే రావురమేశ్, వెన్నెలకిషోర్, ప్రగతి, సురేఖవాణి, రఘుబాబు వంటి వారు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
స్వాతిముత్యం స్టోరీ విషయానికొస్తే లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెలుస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య సీన్స్, కామెడీ, లవ్ సీన్స్ ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఈ సినిమా విడుదల రోజే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ విడుదల కానున్నాయి. బడా హీరోల సినిమాతో స్వాతిముత్యం పోటీ పడుతుందా? అని ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. అయితే, స్వాతిముత్యం మూవీకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ తప్పకుండా థియేటర్లకు క్యూ కడతారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ నలబై లక్షలకు పైగా వ్యూస్‌తో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.
Read Also : Krishna: కూతురు మంజులను టార్చర్ పెట్టిన కృష్ణ.. అతనితో ప్రేమే కారణమా..?
Read Also : Raasi: ఆ సీన్ లో మోహన్ బాబు ముందు నగ్నంగా నటించిన రాశి.. బట్టలు విప్పేసి..