The Ghost movie Review : అక్కినేని నాగార్జున చాలా కాలం తర్వాత ఘోస్ట్ రూపేనా తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు వస్తున్నారు. నాగ్ లేటెస్ట్ మూవీ ఘోస్ట్ దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ముందుకు రానుంది. మొన్నటివరకు నాగ్ బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా దృష్టి సారించారు. రీసెంట్‌గా బ్రహ్మస్త్ర మూవీతో పాన్ ఇండియా సినిమాతో వచ్చారు.తాజాగా తెలుగులో స్ట్రైట్ మూవీతో మరోసారి వస్తున్నారు.
ఇక ఘోస్ట్ సినిమాను అప్పట్లో చిన్నచిత్రాలకే పరిమైతమైన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. ఇది శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై సునిల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు. కాస్ట్ విషయానికొస్తే సోనహ్ చౌహన్ హీరోయిన్ రోల్ చేస్తుండగా.. గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనిష్ చౌదరి, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హోసెన్ కీలక పాత్రలు పోషించారు.ఈ మూవీలో తెలుగు స్టార్స్ కంటే ఇతర భాషలకు చెందిన వారే అధికంగా ఉన్నారు.
చివరగా ఘోస్ట్ సినిమా ట్రైలర్ మంచి టాక్ సొంతం చేసుకుంది. మాఫియా బాగ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కగా..‘డబ్బు సంతోషం, సక్సెస్ కంటే శత్రువులను ఎక్కువగా పరిచయం చేస్తుందని నాగార్జున చెప్పిన డైలాగ్’ఈ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. సెంటిమెంట్ కూడా కీలకంగా మారనున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమా మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సినిమా విజయం సాధిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Read Also : Tulsi Tea: తులసి టీ తాగితే డిప్రెషన్, ఒత్తిడి మాయం.. ఇలా చేసుకోండి..
Read Also : Megastar Chiranjeevi : పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి.. మంచి పరిపాలన అందించాలి.. మెగాస్టార్