Statement : సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయితే కాల్ చేయొద్దు..ఆకట్టుకుంటున్న పెళ్లి ప్రకటన

Statement: ధనిక వ్యాపార కుటుంబంలోని ఎంబీఏ పూర్తి చేసిన వధువుకు ఐఏఎస్/ఐపీఎస్, వైద్యుడు, పారిశ్రామికవేత్త , వ్యాపారవేత్త అయిన వరుడు కావాలి అని ప్రకటిస్తూనే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కాల్ చేయొద్దు అంటూ స్పష్టం చేశారు..

By: jyothi

Updated On - Thu - 22 September 22

Statement : సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయితే కాల్ చేయొద్దు..ఆకట్టుకుంటున్న పెళ్లి ప్రకటన

Statement: యువతులు చాలా భిన్నంగా ఆలోచిస్తున్నారు. తమకు నచ్చని వాటిని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. పెళ్లికి ఒకప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగం చేసే వారికి ప్రాధాన్యత ఇచ్చిన యువతులు .. ఇప్పుడు టేస్ట్ మార్చుకున్నారు. ఇప్పుడు వారిని ససేమిరా అంటున్నారు.

కొన్ని మ్యాట్రిమోనియల్ ప్రకటనలు

ఈ మధ్య పాపులర్ అవుతున్నాయి. ఇలాంటి అర్హతలు, ఈ గుణాలు ఉన్నవారు మాత్రమే కావాలంటూ చేసిన పలు ప్రకటనలు వైరల్ గా మారుతున్నాయి. తాజాగా వరుడు కావాలంటూ యువతి తరపు వారు చేసిన ఓ ప్రకటన సైతం ఆశ్చర్యపరిచేలా ఉంది. అయితే అందులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయితే మాకొద్దు అంటూ అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు.

ధనిక వ్యాపార కుటుంబంలోని ఎంబీఏ పూర్తి చేసిన వధువుకు ఐఏఎస్/ఐపీఎస్, వైద్యుడు, పారిశ్రామికవేత్త , వ్యాపారవేత్త అయిన వరుడు కావాలి అని ప్రకటిస్తూనే.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కాల్ చేయొద్దు అంటూ స్పష్టం చేశారు.

ఈ ప్రకటనకు సంబంధించిన క్లిప్పింగ్ ను వ్యాపారవేత్త సమీర్ అరోరా ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఐటీ భవిష్యత్తు సజావుగా కనిపించడం లేదు అనే క్యాప్షన్ ఇచ్చారు. కాగా ఈ పోస్ట్ వైరల్ అయింది. అయితే దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందించారు.

దేశ ప్రజల భవిష్యత్తే సజావుగా లేదంటూ ఓ నెటిజన్ కమెంట్ చేశాడు. ఐటీ లేకపోతే దేశ భవిష్యత్తు సరిగా ఉందంటూ మరో యూజర్ పేర్కొన్నాడు. మేం అంత చెడ్డవాళ్లమా అంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన ఆవేదన వెళ్లగక్కాడు.

 

 

Also Read: Health Tips : మెదడు ఆరోగ్యానికి పాటించాల్సిన జాగ్రత్తలు

Also Read : TV Offers : ఆ టీవీ మీద ఏకంగా రూ.37వేల డిస్కౌంట్.. ఇంతకీ ఏ టీవీ అంటే..?

Related News