5G Mobiles : 10వేల లోపే బోలెడన్ని 5జీ మొబైల్స్.. ఆఫర్స్ అదుర్స్!

5G Mobiles : ఈ-కామర్స్ వెబ్ సైట్ అయిన అమేజాన్ లో రేపటి నుండి గ్రేట్ ఇండియన్ సేల్ మొదలుకానుంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుండగా.. .

By: jyothi

Published Date - Thu - 22 September 22

5G Mobiles : 10వేల లోపే బోలెడన్ని 5జీ మొబైల్స్.. ఆఫర్స్ అదుర్స్!

5G Mobiles : ఈ-కామర్స్ వెబ్ సైట్ అయిన అమేజాన్ లో రేపటి నుండి గ్రేట్ ఇండియన్ సేల్ మొదలుకానుంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుండగా.. ఈ సేల్ లో మొబైల్ ధరలు అత్యంత డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి. 5జీ మొబైల్ కొనాలని మీరు ఎదురుచూస్తే ఉంటే మీరు ఈ భారీ సేల్ లో అతి తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు. అతి తక్కువ ధరలకు లభిస్తున్న 5జీ మొబైల్స్ ఇవే..

రియల్మీ నార్జో 50i:
అతి తక్కువ ధరలో ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి రియల్మీ నార్జో 50i అద్భుతమైన ఆప్షన్ అని చెప్పాలి. గ్రేట్ ఇండియన్ సేల్ లో ఈ ఫోన్ ను కేవలం రూ.5799కే సొంతం చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేసి మరో 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ తో 6.5-ఇంచుల HD+ డిస్‌ప్లే, 8MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో మరియు 5000mAh బ్యాటరీతో వస్తుంది.

రియల్మీ 10A:
కాస్త బెటర్ మోడల్ ని రూ.10వేల లోపే పొందాలని అనుకుంటే రియల్మీ 10A ని చూడవచ్చు. ఇది సేల్ లో రూ.7469కే లభిస్తోంది. ఈ ఫోన్ 13MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాతో మీడియాటెక్ హీలియో G25 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో, 5000mAh బ్యాటరీతో వస్తుంది.

రియల్మీ నార్జో 50A:
బ్యాటరీ కాస్త పెద్దది కావాలని ఆశపడే వారికి రియల్మీ నార్జో 50A మోడల్ ని చూడవచ్చు. ఇది ఆఫర్ లో రూ.8499కే లభిస్తుంది. దీనిలో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ కెమెరా, మీడియాటెక్ హీలియో G85 చిప్‌సెట్‌తో, 6000mAh బ్యాటరీతో వస్తుంది.

ఒప్పో A15s:
ఒప్పో A15s స్మార్ట్ ఫోన్ ఈ సేల్ లో రూ.8991కే లభిస్తుంది. ఇది 6.52 ఇంచుల స్క్రీన్ తో, మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్‌తో, 13MP ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌తో, 8MP ఫ్రంట్ కెమెరాతో, 4230mAH బ్యాటరీతో వస్తుంది.

Read Also :  Samantha: సమంత ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన మేనేజర్..కానీ ఓ ప్రశ్న మిగిలిపోయింది

Read Also : Chandini Chowdary : అక్క‌డ చేతులు పెట్టి అది కావాల‌న్నాడు.. చాందిని చౌద‌రి కామెంట్లు..!

Related News