Baldness Solution : బట్టతల సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం.. ఆ ప్రోటీన్ తీసుకుంటే చాలు..

Baldness Solution : చాలా మంది అద్దం ముందు నిలబడి తమ బట్టతల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే నాథుడే లేడా అని బాధపడిపోయిన సందర్భాలు బోలెడున్నాయి. ఇక ఈ బట్టతలను కథాంశంగా పెట్టుకుని సినిమాలు కూడా తీశారు మేకర్స్. సినిమాలో హీరో బట్టతలను కవర్ చేయడానికి విగ్గులు పెట్టుకుని ఇబ్బందులు పడ్డారు. నిజజీవితంలోనూ దాదాపుగా అందరూ బట్టతల ఉన్నవారు తమ బట్టతలను చూసుకుని తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతుంటారు. కాగా, వారందరికీ శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ […].

By: jyothi

Published Date - Wed - 10 November 21

Baldness Solution : బట్టతల సమస్యకు ఇక శాశ్వత పరిష్కారం.. ఆ ప్రోటీన్ తీసుకుంటే చాలు..

Baldness Solution : చాలా మంది అద్దం ముందు నిలబడి తమ బట్టతల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే నాథుడే లేడా అని బాధపడిపోయిన సందర్భాలు బోలెడున్నాయి. ఇక ఈ బట్టతలను కథాంశంగా పెట్టుకుని సినిమాలు కూడా తీశారు మేకర్స్. సినిమాలో హీరో బట్టతలను కవర్ చేయడానికి విగ్గులు పెట్టుకుని ఇబ్బందులు పడ్డారు.

నిజజీవితంలోనూ దాదాపుగా అందరూ బట్టతల ఉన్నవారు తమ బట్టతలను చూసుకుని తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతుంటారు. కాగా, వారందరికీ శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. శరీరంలోని ఓ ప్రోటీన్ స్థాయిని పెంచడం ద్వారా బట్టతల ఉన్న వారికి ఆటోమేటిక్‌గా వెంట్రుకలు పెరుగతాయట. ఇందుకు సంబంధించిన అంశాలపై శాస్త్రవేత్తలు శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నారు. అంటే.. ఇక బట్టతల ఉన్నవారు ఈ ప్రోటీన్ తీసుకుంటే వెంట్రుకలు పెరుగుతాయి. ఫలితంగా వారు ఇక బట్టతల సమస్యకు గుడ్ బై చెప్పేయొచ్చు.

తలపై ఎప్పుడూ నిగనిగలాడే జుట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. మరీ ముఖ్యంగా మగవారు జుట్టు ఒత్తుగా ఉండాలనుకుంటారు. ఒకవేళ యంగ్ ఏజ్‌లోనూ జుట్టు రాలిపోయి బట్టతల వచ్చిందంటే ఇక వారి బాధలు వర్ణనాతీతం అని చెప్పొచ్చు. జాబ్ ఇంటర్వ్యూలు, పెళ్లి సంబంధాల గురించి తెగ టెన్షన్ పడిపోతుంటారు.అయితే, కోపం, ఆందోళన, యాంగ్జైటీ ఇతర స్ట్రెస్‌లు కూడా బట్టతలకు కారణమవుతున్నాయని పరిశోధకులు నిర్ధారిస్తున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. శాస్త్రవేత్తలు బట్టతలకు శాస్త్రీయమైన పరిష్కారం చూపారు. ఆధునిక వైద్యం ద్వారా బట్టతలపైన వెంట్రుకలు మొలపించేందుకుగాను పరిశోధనలు చేస్తున్నారు.

Baldness

Baldness

బట్టతలకు శాశ్వతమైన సొల్యూషన్ కనుగొన్నారు. నేచర్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం..హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ జీఏఎస్6 అనే ప్రోటీన్ జట్టు పెరుగుదలను ప్రోత్సహించి, బట్టతలపై వెంట్రుకల పునరుత్తత్తికి సాయపడుతుంది. కుదుళ్ల నుంచి కొత్త హెయిర్ పెరిగేందుకుగాను సదరు ప్రోటీన్ తోడ్పాటు అందిస్తుంది. ఈ మేరకు కథనంలో ప్రచురించారు. హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్స్ అధ్యయనం ప్రకారం.. జీఏఎస్6 ప్రోటీన్ హెయర్ రీ ప్రొడక్షన్‌కు సాయపడుతుందని తేలింది. ఇకపోతే జుట్టు రాలడానికి గల కారణాలను కూడా శాస్త్రీయంగా వీరు ధ్రువీకరించారు. అడ్రినల్ గ్రంథులు విడుదల చేసే కార్టికోస్టెరాన్ అనే ఒత్తిడి హార్మోన్ వలన హెయిర్ లాస్ అవుతున్నదని తేల్చారు.

healthy-hair Baldness

healthy-hair Baldness

ఈ క్రమంలోనే ఆ హార్మోన్‌ను నిరోధించి హెయిర్ పెరుగుదలకు సాయపడే హెయిర్ ఫోలిసెల్ స్టెమ్ సెల్ యాక్టివేట్ ఎలా చేయాలో పరిశోధించారు. అలా బట్టతల ఉన్న వ్యక్తుల్లో హెయిర్ పెంచేందుకు దోహద పడే హెయిర్ ఫోలికల్ మూలకణాలను యాక్టివేట్ చేసేందుకుగాను జీఏఎస్6 అనే ప్రోటీన్‌ను ఉపయోగించారు. ఈ ప్రోటీన్‌ను ఇప్పటికే ఎలుకలపై ప్రయోగించి పరిశోధించారు. ఎలుకలపై ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చింది. అయినప్పటికీ మనుషులపై అప్లై చేయడానికి కొంచెం టైం పట్టేలా కనబడుతుంది. ఇందుకు సంబంధించి మరిన్ని శాస్త్రీయ అధ్యయనాలు చేయాల్సి ఉంటుంది. ఆ అధ్యయనాలు సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ అయితే ఇక బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లే..

Read Today's Latest Trending News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News