Different News : ఈ ప్రాంతంలో అన్ని పనులూ ఆడవారే చేస్తరట.. వారిదే పెత్తనం..

Different News : మహిళలు వంటింటికే పరిమితం కారని ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు నిరూపించారు. అగ్రికల్చర్ నుంచి అంతరిక్షం దాకా అంతటా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అయితే, ఇంకా ఎక్కడో చోట పితృస్వామ్య భావజాలం బలంగా నాటుకుపోయి ఉంది. అయితే, మనం తెలుసుకోబోయే ఈ ప్లేస్‌లో మాత్రం మహిళలు పురుషులతో సమానం అన్న విషయం మాటల్లోనే కాదు చేతల్లోనూ నిరూపిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు చేసేటువంటి […].

By: jyothi

Published Date - Sun - 21 November 21

Different News : ఈ ప్రాంతంలో అన్ని పనులూ ఆడవారే చేస్తరట.. వారిదే పెత్తనం..

Different News : మహిళలు వంటింటికే పరిమితం కారని ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు నిరూపించారు. అగ్రికల్చర్ నుంచి అంతరిక్షం దాకా అంతటా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అయితే, ఇంకా ఎక్కడో చోట పితృస్వామ్య భావజాలం బలంగా నాటుకుపోయి ఉంది. అయితే, మనం తెలుసుకోబోయే ఈ ప్లేస్‌లో మాత్రం మహిళలు పురుషులతో సమానం అన్న విషయం మాటల్లోనే కాదు చేతల్లోనూ నిరూపిస్తున్నారు.

Different News women 1

Different News women 1

ఈ ప్రాంతంలో ప్రజలు చేసేటువంటి ప్రతీ పనిలో పెళ్లిళ్ల దగ్గరి నుంచి దహన సంస్కారాల వరకు అన్నిటా మహిళలే కీలక పాత్ర పోషిస్తారు. ఈ విషయం తెలుసుకుని మీరు ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. కానీ, అక్కడ అది కామన్ విషయమే. ప్రతీ ఒక్క మహిళ తాము పురుషుడితో సమానమని భావిస్తుంటుంది. ఆ ప్రాంతం ఎక్కడో వివరాలు తెలుసుకుందాం.

యూరప్‌లోని ఎస్తోనియా అనే కంట్రీలో సుమారు రెండొందలకు పైగా దీవులుంటాయి. అందులో ఒక దీవి .. ఆ దీవి పేరు ‘కిన్హూ దీవి’. ఇందులో నివసించే ఆడవాళ్ల అలవాట్లు పద్ధతులు చాలా విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ మహిళల్లో ఫాలో అయ్యే పద్ధతుల్లో నిర్మాణత్మక మార్పులు కనబడుతుంటాయి.

Different News women

Different News women


నిజానికి ఈ ప్రాంతంలో అనగా ఈ దీవి లోపల ఉండేటు వంటి ప్రజల్లో మహిళలే మెజారిటీ స్థానంలో ఉంటారు. వయసు పైబడిన పురుషులు, పిల్లలే తప్ప ఎక్కువ మంది మహిళలే ఉంటారు. ఇక్కడ యంగ్ ఏజ్‌లో ఉండేటువంటి మేల్ పర్సన్స్ అస్సలు కనిపించరు.


ఈ విషయం మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ, అది నిజం. ఇక్కడ ఉండే మహిళలకు అన్ని విషయాల్లో హక్కులుంటాయి. అన్ని పనులను వారే చేస్తుంటారు. అగ్రికల్చర్ నుంచి పిల్లల పనులు, ఇంటి పనులు, మ్యారేజ్, పురుడు, దహన సంస్కారాలు ఇతర పనులు అన్నిటినీ ఆడవాళ్లే చేస్తుండటం గమనార్హం.

ఇక్కడ వయసులో ఉండే మగవారు చేపల వేటకు వెళ్లి చాలా కాలం పాటు సముద్ర తీరాల్లోనే జీవిస్తారట. అది వారి జీవన వృత్తి. కాగా, కిన్హూ దీవిలో ఉండేటువంటి సదరు మగవారి భార్యలు అన్ని పనులను చక్కబెట్టుకుంటారు. పిల్లల పెంపకం, ఇతర పనులు అన్నిటినీ మహిళలే చూసుకుంటారు.

 

అలా పితృస్వామ్య భావజాలం అనేది కొంత మేరకు కిన్హూ దీవిలో ఉండబోదు. మహిళలు అన్ని విషయాల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ప్రతీ విషయంలో మహిళల నిర్ణయమే ఫైనల్‌గా ఉంటుంది. కిన్హూ దీవిలో ఉండేటువంటి మహిళలు ఈ వింత ఆచారాలను పాటిస్తుంటారు. మహిళలు ఇలా అన్ని విషయాలను డీల్ చేయడం గురించి తెలుసుకుని మిగతా ప్రాంతాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. కానీ, అక్కడ వారికి అది కామన్ విషయం.

 

Tags

Latest News

Related News