Different Tradition : మన దేశంలో భిన్న ఆచార వ్యవహరాలు అమలులో ఉన్న సంగతి అందరికీ విదితమే. ప్రతీ వంద కిలోమీటర్ల జనం భాష, వేషధారణ ఉంటుంది. ఈ క్రమంలోనే సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పద్ధతులు, కట్టుబాట్లు మారిపోతుంటాయి. అయితే ఒక ప్రాంతం వారి ఆచారాలు మరొక ప్రాంతం వారికి కొత్తగా అనిపిస్తాయి. అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం భారత వారసత్వంగా కొనసాగుతోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆ ప్రాంతంలో అమలయ్యే వింత ఆచారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
Different Tradition 1
జనరల్‌గా పెళ్లి సందర్భంగా జరిగే హడావిడి అంతా ఇంతా కాదు.. ఇంటిల్లిపాది పనుల్లో ఫుల్ బిజీ అయిపోతారు. కాగా, పెళ్లి సందర్భంగా ఈ ప్రాంతంలో పెళ్లి కుమారుడిని పెళ్లి కూతురు మాదిరిగా ట్రీట్ చేస్తారు. ఇంతకీ ఆ వింత ఆచారం ఎక్కడ అమలులో ఉందంటే…
తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని పెందిళ్లమర్రి మండలం మాచనూరు గ్రామంలో ఈ వింత ఆచారం అమలులో ఉంది. ఈ ఆచారం ఎప్పటి నుంచో అమలులో ఉందట. దాని ప్రకారం.. ఇక్కడ పెళ్లి కుమారుడిని అనగా వరుడిని పెళ్లి కూతురి గెటప్‌లో తయారుచేస్తారు. అలా వరుడు వధువుగా మారిపోతాడు. ఆ తర్వాత వరుడిని అనగా పెళ్లి కూతురి గెటప్‌లో ఉన్న వరుడిని వధువుగా భావించి ఊరేగింపు చేస్తారు. అలా వరుడిని వధువు ఇంటి వద్దకు తీసుకెళ్తారు. అలా వధువు ఇంటి వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లి వధువుకు సారెను అందజేస్తారు.
Different Tradition
ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారట. మాచనూరు విలేజ్‌లోని ప్రతీ ఇంట్లో పెళ్లి సందర్భంగా ఈ ఆచారాన్ని ఫాలో అవుతారు. ప్రతీ ఇంట్లోని పెద్ద కుమారుడిని ఇలా సంప్రదాయం ప్రకారం వధువుగా మార్చి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఇలా చేయడంలో సదుద్దేశమే ఉందని మాచనూరు గ్రామ పెద్దలు వివరిస్తున్నారు. ప్రతీ ఇంట్లోని పెద్ద కొడుకును ఇలా వధువుగా మార్చి ఊరేగింపు చేయడం ద్వారా మహిళలు కూడా తమ లాంటి వారేనని వరుడు గుర్తించాలని, వారిని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత వరుడిపైన ఉంటుందని తెలిపేందుకు ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఆచారం వెనుక ఈ కథ ఉందని చెప్తున్నారు. ఇకపోతే పెళ్లి కుమారుడిని ఇలా అమ్మాయిగా అలంకరిస్తున్న క్రమంలో ఆ గ్రామ పెద్దలు అందరూ ఆనందం వ్యక్తం చేస్తారని అంటున్నారు. ఊరంతా కూడా సందడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఊరంతా కలిసి వధువు రూపంలో ఉన్న వరుడిని వధువు ఇంటి వద్దకు ఆనందంగా తీసుకెళ్లారు. ఆ ఊరేగింపులో చక్కగా డ్యాన్స్ చేస్తూ హ్యాపీగా వెళ్తుంటారని మాచనూరు గ్రామస్తులు చెప్తున్నారు.