Different Tradition : హిందూ సంప్రదాయాల ప్రకారం భార్య ..భర్త కోసం రకరకాల వ్రతాలు, నోములు చేస్తుంటుంది. తన భర్త ఎప్పుడూ బాగుండాలని, తద్వారా తన మాంగళ్యం నిలబడుతుందని భార్యలు భగవంతుడిని ప్రార్థిస్తుంటారు. అలా వైవాహిక బంధానికి హిందూ మతంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. భర్త ఆయుష్షు పెరగాలని భార్య దేవుడికి పూజలు చేస్తుంటుంది.
ఇకపోతే భర్త బతికున్నపుడు మాత్రమే భార్య పూలు, బొట్టు పెట్టుకోవడం సంప్రదాయం. కాగా, ఆ ప్రాంతంలో మాత్రం భర్త బతికుండగానే భార్యలు వితంతవులుగా మారిపోతారు. వినడానికే వింతగా ఉంది కదా.. అవును మరీ.. ఆ ప్రాంతం ఏంటో అక్కడ అమలవుతున్న వింత ఆచారం ఏంటో తెలుసుకుందాం.
భర్త ఆయుష్షు కోసం ఈ ప్రాంత గృహిణులు భర్త బతికుండగానే వితంతువులుగా మారిపోతారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో నివసించే గచ్వాహా తెగకు చెందిన ప్రజలు ఈ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. ఈ తెగకు చెందిన మహిళలు తమ భర్తల కోసం ఐదు నెలల పాటు వితంతువులగా జీవిస్తారు. ఈ విషయం తెలుసుకుని ఇతర ప్రాంతాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. కానీ, అక్కడి ప్రజానీకానికి అది కామన్ విషయమే.
different tradition gachwaha
ఐదు నెలల పాటు సదరు తెగకు చెందిన మహిళలు అలంకారాలకు దూరంగా ఉంటారు. తాళిబొట్టు, పూలు, గాజులు వేసుకోకుండా తెల్ల చీర కట్టుకుని వితంతువు మాదిరిగానే వింత సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇలా చేస్తే తమ భర్తల ఆయుష్షు పెరుగుతుందని మహిళల ప్రగాఢ విశ్వాసం. ఈ సంప్రదాయం ఇక్కడ చాలా కాలంగా ఆచరణలో ఉంది. ప్రతీ సంవత్సరం ఐదు నెలల పాటు మహిళలు ఈ ఆచారాన్ని అనుసరిస్తారు. అయితే, వేరే ప్రాంతాలకు చెందిన వారు ఈ మహిళలను చూసి ఆశ్చర్యపోతుంటారు. భర్త బతికుండగానే ఇలా చేస్తున్నారేంటని అనుకుంటారు.
గచ్వాహా కమ్యూనిటీలో మాత్రమే ఈ వింత సంప్రదాయం అమలులో ఉంది. ఈ ఐదు నెలల పాటు మహిళల భర్తలు చెట్ల మీద నుంచి కల్లు తీయడానికి వెళ్లొస్తారు. అలా వారొచ్చేంత వరకు మహిళలు సాదాసీదా లైఫ్ గడిపేస్తారు. ఈ కమ్యూనిటీ ప్రజలకు తార్కులహాదేవి కులదైవం. కాగా, వీరి జీవనోపాధి కల్లుగీయడం. గీత కార్మికులు అని చెప్పొచ్చు. వింత ఆచారంలో భాగంగా ఈ కమ్యూనిటీకి చెందిన మహిళలు ఐదు నెలల పాటు తమ ఆభరణాలు, పూలు, తాళిబొట్టు, గాజులు తార్కులహా దేవి వద్ద ఉంచుతారు. అలా చేయడం వలన తమ కులదైవం వారి భర్తల లైఫ్ టైం పెంచుతుందని వారి బిలీఫ్.