Different Tradition : సాంకేతికత బాగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ప్రస్తుతం మూఢనమ్మకాలు అనేవి లేవు అని కొందరు అంటుంటారు. కానీ, సాంకేతికతో పాటు మూఢ నమ్మకాలు బాగా పెరిగిపోయాయని మరి కొందరు చెప్తున్నారు. గ్రామీణ ప్రజలే కాదు సిటీలో ఉంటున్న వారు కూడా కొందరు మూఢనమ్మకాలను బలంగా నమ్ముతున్నారని, ఈ క్రమంలోనే మూఢ నమ్మకాల నెపంతో హత్యలు కూడా జరుగుతున్నాయి. ఈ సంగతులు పక్కనబెడితే.. ఓ ప్రాంతంలో వానలు సమృద్ధిగా పడాలని కోరుతూ ప్రజలు వింత పని చేశారు. అదేంటంటే..
జనరల్‌గా వర్షాలు బాగా పడాలని ప్రజలు వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తుండటం మనం చూడొచ్చు.ఈ క్రమంలోనే కొన్ని చోట్ల మూగజీవులను బలి ఇస్తుంటారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని ప్రజలు వింత ఆచారం ఫాలో అయ్యారు. వానలు బాగా పడాలని కోరుతూ అక్కడి ప్రజలు గాడిదలకు ఘనంగా మ్యారేజ్ చేశారు.ఈ ఘటన కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం హోసూరులో జరిగింది.
ఇకపోతే ఈ గాడిదల పెళ్లి మనుషుల పెళ్లిలాగా అంగరంగ వైభవంగా జరగడం గమనార్హం. ఏపీ రాష్ట్రమంతటా వర్షాలు సమృద్ధిగా కురవాలని, స్టేట్ సుభిక్షంగా ఉండాలని కోరుతూ తాము గాడిదలకు మ్యారేజ్ చేశామని హోసూరు గ్రామ ప్రజలు అంటున్నారు. ఇకపోతే ఈ కల్యాణానికి వాసుదేవ కల్యాణ మహోత్సవం అని పేరు పెట్టడంతో పాటు భక్తి శ్రద్ధలతో సంప్రదాయ బద్ధంగా మ్యారేజ్ చేశారు. అనంతరం ఊరేగింపు కూడా చేశారు. మనుషుల మ్యారేజ్ తర్వాత ఎలాగైతే బరాత్ నిర్వహిస్తారో.. ఆ మాదిరిగానే గాడిదల పెళ్లి తర్వాత ఊరేగింపు కూడా ఘనంగా నిర్వహించారు.
Different Tradition
చాలా మంది గాడిదల పెళ్లి అనగానే ఏదో తూ తూ మంత్రంగా కానిచ్చేస్తారని అనుకుంటారు. కానీ, హోసూరు గ్రామస్తులు మాత్రం గాడిదల పెళ్లిని సైతం ఘనంగా, మనుషుల పెళ్లి మాదిరిగానే నిర్వహించారు. ఇలా గాడిదలకు పెళ్లి చేస్తే వానలు బాగా పడుతాయని గ్రామస్తుల నమ్మకం. గతంలో ఇలా చేసిన తర్వాత తమ గ్రామంలో వర్షాలు పడ్డాయని, అందుకే తాము ఇప్పుడు ఇలా చేస్తున్నామని హోసూరు గ్రామస్తులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది కూడా గాడిదలకు ఘనంగా పెళ్లి చేశామని, ఇక వర్షాలు విస్తారంగా పడతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హోసురు గ్రామస్తులు ఇలా గాడిదలకు పెళ్లి చేసిన వార్త సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ వార్త తెలుసుకుని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజికల్ వరల్డ్‌లో ఈ వింత పనులేంటని కొందరు ప్రశ్నలు వేస్తున్నారు.