Different Village : ఈ విచిత్ర గ్రామం మీకు తెలుసా.. ఇక్కడ అందరూ మరుగుజ్జులే..

Different Village : జనరల్‌గా ఎవరినైనా ఉండాల్సిన హైట్ కంటే కొంచెం తక్కువున్నా పొట్టి వాళ్లను అంటుంటారు. అలా తోటి స్నేహితులు మాత్రమే కాకుండా బంధువులు ఇతరులు వెక్కిరిస్తుంటారు. అయితే, మరుగుజ్జుల విషయంలో అలా ఉండబోదు. ఎందుకంటే వారు ఉండటమే అలా ఉంటారు. జీన్స్ ప్రభావం వలన వారు ఇక హైట్ ఎక్కువగా పెరగబోరు. అయితే, మనం మరుగుజ్జులను రియల్ లైఫ్‌లో రేర్‌గా చూస్తుంటాం. మరుగుజ్జులను చూడగానే కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. కానీ, అలా పొట్టిగా […].

By: jyothi

Published Date - Sat - 20 November 21

Different Village : ఈ విచిత్ర గ్రామం మీకు తెలుసా.. ఇక్కడ అందరూ మరుగుజ్జులే..

Different Village : జనరల్‌గా ఎవరినైనా ఉండాల్సిన హైట్ కంటే కొంచెం తక్కువున్నా పొట్టి వాళ్లను అంటుంటారు. అలా తోటి స్నేహితులు మాత్రమే కాకుండా బంధువులు ఇతరులు వెక్కిరిస్తుంటారు. అయితే, మరుగుజ్జుల విషయంలో అలా ఉండబోదు. ఎందుకంటే వారు ఉండటమే అలా ఉంటారు. జీన్స్ ప్రభావం వలన వారు ఇక హైట్ ఎక్కువగా పెరగబోరు. అయితే, మనం మరుగుజ్జులను రియల్ లైఫ్‌లో రేర్‌గా చూస్తుంటాం.


మరుగుజ్జులను చూడగానే కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. కానీ, అలా పొట్టిగా ఉండటం వారికి కామన్. జీన్స్ ప్రభావం వలన వారు అలానే ఉండిపోతుంటారు. అయితే, ఒక విలేజ్ మొత్తంగా మరుగుజ్జులే ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ఆశ్చర్యం కదా.. అవునండీ.. మీరు చదివింది నిజమే ఆ విలేజ్‌లో మొత్తం జనం మరుగుజ్జులే.. ఆ గ్రామం ఎక్కడుంది. దాని విశేషాలేంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం.


అక్కడి ప్రాంతం అనగా ఆ విలేజ్‌లోని ఏరియా అంతటా మరుగుజ్జులే సంచరిస్తుంటారు. ఆ ఊరు ఎక్కడుందంటే.. చైనా కంట్రీలో ఉంది. చైనా కంట్రీలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఆ విలేజ్ ఉంది. అయితే, ఆ గ్రామంలో దాదాపుగా సగం కంటే ఎక్కువ మంది మరుగుజ్జులే ఉన్నారు. ఆ విలేజ్ పేరు యాంగ్సి..

Dwarf village

Dwarf village

ఈ యాంగ్సి గ్రామంలో ఉన్న ప్రజలందరూ మరుగుజ్జులే కావడం గమనార్హం. అయితే, అలా మరుగుజ్జులుగా ఉండటానికి గల కారణాలు ఏంటనేది శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇంత వరకు కనిపెట్టలేకపోయారు.

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్నటువంటి ఈ విలేజ్ పీపుల్‌పైన చాలా మంది రీసెర్చ్‌లు చేశారు. కానీ, ఏమి తేల్చలేకపోయారు. ఇప్పటికీ రీసెర్చ్‌లు కొనసాగుతుండటం గమనార్హం. అయితే, అలా జనం అంతా మరుగుజ్జులుగా ఉండటానికి వారి పూర్వీకుల జీన్స్ అని కొందరు వాదిస్తున్నారు. అయితే, అలాంటప్పుడు కొందరు మరుగుజ్జులు ఎందుకు కావడం లేదని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మరుగుజ్జుల గ్రామం గురించి రీసెర్చ్ ఇంకా కొనసాగు..తూనే ఉంది.

 

స్థానిక ప్రజలు చెప్తున్న దాని ప్రకారం. ఓ రోజు మిడ్ నైట్ మహమ్మారి ఐదు నుంచి ఏడేళ్ల పిల్లలకు సోకిందని, అలా అప్పటి నుంచి అందరూ మరుగుజ్జులుగా మారిపోయారని పేర్కొంటున్నారు. ఇక ఇంకొందరు యాంగ్సి గ్రామస్తులు చెప్తున్న దాని ప్రకారం.. కొందరు జపాన్ దేశానికి చెందిన తమ విలేజ్‌లో గ్యాస్ రిలీజ్ చేశారని, దాని ప్రభావం వలన అందరూ అలా మరుగుజ్జులు అయిపోయారని అంటున్నారు. మొత్తంగా యాంగ్సి గ్రామ ప్రజలు ఇలా మరుగుజ్జులుగా ఉండటానికి గల కారణాలు అయితే ఇప్పటి వరకు శాస్త్రీయంగా ఎవరూ ధ్రువీకరించలేకపోయారు.

Tags

Latest News

Related News