Phones : ఆ ఫోన్ ధర మీద ఏకంగా రూ.21,000 తగ్గింపు.. బంపర్ ఆఫర్!!

Phones : మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ మోడల్స్ వస్తూనే ఉంటాయి. మంచి ఫీచర్లతో అతి తక్కువ ధరలతో ప్రస్తుతం అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. .

By: jyothi

Published Date - Wed - 21 September 22

Phones : ఆ ఫోన్ ధర మీద ఏకంగా రూ.21,000 తగ్గింపు.. బంపర్ ఆఫర్!!

Phones : మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్ మోడల్స్ వస్తూనే ఉంటాయి. మంచి ఫీచర్లతో అతి తక్కువ ధరలతో ప్రస్తుతం అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా దేశంలో ఈ-కామర్స్ వెబ్ సైట్లు పలు ఆ సేల్స్ ని, ఆఫ్ లైన్ స్టోర్స్ కూడా భారీ డిస్కౌంట్లతో సేల్ నిర్వహిస్తున్నాయి. దీంతో చాలా మొబైల్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో వస్తున్నాయి.

బ్యాంకు కార్డుల‌తో..

ఇదే నేపథ్యంలో ఈ మధ్యనే విడుదలైన వివో కంపెనీకి చెందిన ఓ లేటెస్ట్ మోడల్ మొబైల్ మీద భారీ డిస్కౌంట్ లభిస్తోంది. వివో కంపెనీ నుండి వచ్చిన వివో వి25 5జీ స్మార్ట్ ఫోన్ మీద భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర మామూలుగా రూ.32,999గా ఉంగా దీనిపై డిస్కౌంట్ కు తోడు పలు బ్యాంక్ కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

వివో వీ25 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు పొందొచ్చు. ఈ ఫోన్ గత వారంలోనే మార్కెట్‌లోకి వచ్చింది. దీని సేల్ నిన్నటి నుంచి ప్రారంభం అయ్యింది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.27,999గా ఉంది. ఈ ఫోన్ ధర మీద ప్రస్తుతం 15శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో దీనిని రూ.25,499కే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఈ ఫోన్ మీద ఎక్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీంతో మీ పాత పని చేసే కండీషన్ లో ఉన్న ఫోన్ ని ఎక్ఛేంజ్ చేస్తే ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.18,900 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులోనే రూ.2వేల స్పెషల్ డిస్కౌంట్ కలిసి వస్తుంది. అలాగే HDFC, ICIC బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడటం వల్ల మరో రూ.2500 వరకు తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా ఈ ఫోన్ అసలు ధర మీద రూ.21వేల వరకు డిస్కౌంట్ ని పొందవచ్చు.

Read Also : Narendra Modi : ఫ్యాక్ట్ చెక్.. మోదీ లెన్స్ కవర్ చేసి కెమెరాతో ఫోటోలు తీశారా?..ఇందులో నిజమెంత?

Read Also :  Nude Videos : అత్తమామల నగ్న వీడియోలు తీసి భర్తను బెదిరించిన భార్య

Related News