TV Offers : ఆ టీవీ మీద ఏకంగా రూ.37వేల డిస్కౌంట్.. ఇంతకీ ఏ టీవీ అంటే..?

TV Offers : దేశంలో ఇప్పుడు అంతా డిస్కౌంట్ సేల్స్ హడావిడి నడుస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్లు అయిన ఫ్లిప్ కార్ట్ మరియు అమేజాన్ భారీ డిస్కౌంట్ సేల్స్ ని రేపటి నుండి ప్రారంభించనున్నాయి. .

By: jyothi

Updated On - Thu - 22 September 22

TV Offers : ఆ టీవీ మీద ఏకంగా రూ.37వేల డిస్కౌంట్.. ఇంతకీ ఏ టీవీ అంటే..?

TV Offers : దేశంలో ఇప్పుడు అంతా డిస్కౌంట్ సేల్స్ హడావిడి నడుస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్లు అయిన ఫ్లిప్ కార్ట్ మరియు అమేజాన్ భారీ డిస్కౌంట్ సేల్స్ ని రేపటి నుండి ప్రారంభించనున్నాయి. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో అమేజాన్, బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తుండగా.. టీవీల మీద భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

ఒకవేళ మీరు కూడా టీవీ కొనడానికి చూస్తుంటే ఇప్పుడు నడుస్తున్న సేల్ లో కొనవచ్చు. అయితే ఈ సేల్ లో ఓ టీవీ మీద ఏకంగా రూ.37వేల డిస్కౌంట్ లభిస్తోంది. 50, 55, 65, 75 ఇంచులలో లభిస్తున్న ఆ టీవీలు గతంలో కన్నా అతి తక్కువ ధరలకు అందుబాటులో వస్తున్నాయి. ఇంతకీ ఆ ఏ బ్రాండ్ టీవీలు, వాటి ఫీచర్లు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

ఏ టీవీ బ్రాండ్లు అంటే..

బ్లాపుంక్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీల మీద ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో అతి భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. బ్లాపుంక్ట్ 50, 55, 65, 75 ఇంచుల మోడల్స్ ను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ టీవీల్లో ఎల్ఈడీ డిస్‌ప్లే, 4కే రెజల్యూషన్, 550 నిట్స్ బ్రైట్‌నెస్, ఎంఈఎంసీ టెక్నాలజీ, డాల్బే విజన్ సపోర్ట్, హెచ్‌డీర్ 10 ప్లస్, హెచ్ఎల్‌జీ ఫార్మాట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 1.5 గిగాహెర్ట్జ్ క్వార్ కోర్ మీడియా టెక్ ఏ53 ప్రాసెసర్ తో వస్తుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ 10 ఓఎస్‌పై పని చేస్తుంది. వైఫ్, బ్లూటూత్ సహా చాలా యాప్స్ ఉపయోగించొచ్చు.

ధర ఎంత అంటే..

బ్లాపుంక్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీల ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్లు అందుతున్నాయి. ఇందులో భాగంగా 65 ఇంచుల బ్లాపుంక్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీ ధర రెగ్యులర్ గా రూ.84,999గా ఉండగా.. ఫ్లిప్ కార్ట్ సేల్ లో దీని ధర రూ.60,999గా ఉండబోతోంది. అంటే ఈ స్మార్ట్ టీవీ అసలు ధర మీద రూ.37వేల భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

Read Also : Allu Arjun : ఒకే నెల‌లో రూ.140 కోట్లు సంపాదించిన బ‌న్నీ.. ఏంది సామీ ఇది..!

Read Also : Bigg Boss Season 6 : బూతులకు బ్రాండ్ అంబాసిడర్‌లా మారిన గలాటా గీతూ.. ఏందీ రచ్చ

Related News