Naragosha: నరఘోష.. తరచూ మనం వింటూ ఉంటాం. నరులు అంటే మానవుల ఘోష ఇది సముద్రఘోష కంటే తీవ్రమైనది. చెడుఫలితాలను ఇస్తుంది. ఇటువంటి ఈ నరదృష్టి లేదా ఘోష వల్ల చెడుఫలితాలు వస్తాయి. మంచి మంచి వారు కూడా దుస్థితికి చేరుకోవాల్సి వస్తుంది. దీని బాధల నుంచి తప్పించుకోవడానికి చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం…
How to Avoid NaraGosha
ప్రతిరోజు మీ గృహంలో ప్రాతఃకాలంలో స్నానం ఆచరించిన తర్వాత దేవుడి గదిలో ఘంటానాదం చేయడంవల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఆ గృహంలో ఉన్న చెడు అంతా బయటికి పోయి మంచి అనేది ఉంటుంది. నరఘోష నివారణకు ఈ ఘంటానాదం విరుగుడుగా ఉంటుంది.
ఎనిమిది చిన్న తెల్ల గవ్వలను దేవుడి గదిలో చిన్న రాగి పాత్రలోగాని ఇత్తడి పాత్రలోగాని పెట్టుకోండి. ఆ ఎనిమిది గవ్వలకు గంధం, కుంకుమ పెట్టండి. ఆ గవ్వలకి రోజు భగవంతునితో పాటు దీపం వెలిగించి చూపిండి. అగరవత్తులు చూపించండి. హారతి చూపించండి. దేవుడి గదిలో దేవుడితో పాటు ఆ గవ్వలకు కూడా పుష్పాలంకరణ, మారేడు దళం, తులసి దళం పెట్టండి. ఆయన మీది గవ్వలు మీ ఇంటి మీదికి వచ్చే నరఘోష తగ్గిస్తాయి. వీటితో పాటు ఒక గోమతి చక్రం తెచ్చుకొని పూజ చేసుకొని, పూజ గదిలో పెట్టుకోండి. ఈ గోమతి చక్రం మీ నరఘోష మొత్తాన్ని అణచివేస్తుంది, తొలగిస్తుంది.
ఇవే కాక ప్రతిరోజు గృహంలో ప్రాత కాలంలో, సాయంసంధ్యలో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నరఘోష దూరమవుతుంది. అసుర శక్తులు బయటకు వెళ్లిపోతాయి. ప్రతిరోజు గృహంలో ఉదయం, సాయంత్రం స్వచ్ఛమైన నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. దీనివల్ల ఇట్లా చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారు మీ గృహాన్ని అనుగ్రహిస్తుంది. అసురీ కళ తొలగిపోతుంది. పూజ గదిలో రోజు పూజకు వాడే సామాగ్రి స్వచ్ఛమైనవిగా ఉండాలి. అవి శుభ్రంగా లేకపోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంటే దరిద్ర దేవత ఆ వాహనం అవుతుంది. ఈ అశుభ్రమైన వాటిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం రాదు.
కాబట్టి పూజగదిలో అన్ని శుభ్రమైన విగా ఉండాలి. అప్పుడే లక్ష్మీ అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇంతేకాక ఒక ఆవు పేడ పిడకలు పూజ గది లో పెట్టుకోండి. పూజా షాపులో కొనుక్కొచ్చే పిడక కాకుండా ప్రత్యక్షంగా ఆవు నుంచి వచ్చే పేడను తెచ్చి ఒక పిడకలను చేసి మీ పూజగదిలో పెట్టుకోండి. ప్రతిరోజు దానికి పసుపు కుంకుమ వేసి ఉంచండి. దీనివల్ల నరఘోష నివారణ జరుగుతుంది. ఈ నాలుగు సులభమైన పనులు నమ్మకంతో విశ్వాసంతో చేయడంవల్ల మీ గృహ సమీపంలో ఉన్న గృహంలో ఉన్న నరఘోష అనేది దూరమైపోతుంది. లక్ష్మీకటాక్షం కలుగుతుంది.