job Notification.. ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా ఉద్యోగ భర్తీలు జరుగు తున్నాయి. తాజాగా అంగన్ వాడీ పోలీస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అంగన్ వాడీ కార్యకర్త, మినీ అంగన్ వాడీ కార్య కర్తల, అంగన్ వాడీ సహాయకురాలు పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పోస్టుల ఖాలీలను భర్తీ చేయనున్నారు ఏపీ గవర్నమెంట్.
ఈ పోస్టులకు దరకాస్తు ప్రక్రియ ఆన్ లైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక అయినా అభ్యర్థుల పోస్టుల ఆధారంగా నెలవారీ వేతనం చెల్లించ నున్నారు. వీరి వేతనం పోస్టులను బట్టి రూ. 7000 నుండి రూ. 11, 500 నిర్ణయిస్తారు. ఇక ఈ జాబ్ దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ జాబ్ ను దరఖాస్తు చేసుకోవడం కోసం https://ananthapuramu.ap.gov.in/ ను సంప్రదించాలి.
job Notification-1
ఈ పోస్టుల దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది. ఇక పోస్టుల సంఖ్య, మిగతా వివరాలను క్రింద తెలుసుకుందాం..మొత్తం పోస్టుల సంఖ్య 365.
ఉండాల్సిన అర్హతలు : అంగన్ వాడీ కార్యకర్త, మినీ అంగన్ వాడీ కార్యకర్త, అంగన్ వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా 10వ తరగతి పాసై ఉండాలి. ఇంకా వివాహిత అయి ఉండాలి. అంతేకాకుండా ఆ అభ్యర్థి స్థానిక అభ్యర్థి అయి ఉండాలి. ఇక వయసు జులై 1, 2021 నాటికీ అభ్యర్థి వయసు 21 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇక అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు వేతనం రూ. 11, 500, మినీ అంగన్ వాడీ కార్యకర్తకి నెలకు వేతనం రూ. 7,000, అంగన్ వాడీ సహాయకురాలికి నెలకు వేతనం రూ. 7,000 అని అధికారికంగా ప్రకటించారు.