Lakshmi Devi: హిందూ సంప్రదాయంలో మనకు పన్నెండు మాసాలు ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యంత పవిత్రమైనవిగా పేర్కొంటారు. వాటిలో వైశాఖమాసం (వైశాఖమాసం మే 12 నుంచి ప్రారంభం) చాలా ముఖ్యమైనది. ఈమాసంలో చేసే ఆయా కార్యాలవల్ల మనకు విశేషఫలితాలు వస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం…
Lakshmi Devi Vaishaka Masam Dhana Prapthi
వైశాఖమాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో పేర్కొనబడింది. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును, లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం అని శాస్త్రాలలో పేర్కొన్నారు. వైశాఖ మాసం యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దానధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి కోరికలను తీరుస్తుంది. వైశాఖ మాసంలో ముఖ్యంగా కొన్ని దానాలు చేయాలి ఇవి చేయడం వల్ల అనంత పుణ్యం వస్తుంది. ముఖ్యంగా మంచినీళ్లను ఈ నెలలో పంపిణీ అంటే చలివేంద్రాలు పెడితే విశేష ధనం లభిస్తుంది. అయితే కోరికతో కాకుండా భక్తితో మాధవుని సేవగా భావించి ఈ సేవ చేయాలి. తప్పక మంచి ఫలితం కన్పిస్తుంది. అదేవిధంగా ఈ మాసంలో గొడుగు, పాదరక్షలు, మామిడిపండ్లను దేవాలయాలు, పేదలకు, పండితులకు దానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయి.