• Telugu News
  • trending

Latth Maar Diwali : అక్కడ కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకునుడే దీపావళి..

Latth Maar Diwali : కొవిడ్ మహమ్మారి వల్ల గతేడాది దీపావళి పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించుకోలేకపోయారు ప్రజలు. కాగా, ఈ సారి మాత్రం గ్రాండ్‌గానే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వెలుగులు నింపే దీపావళి పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ అందరూ.. హ్యాపీగా క్రాకర్స్ పేల్చారు. పెద్ద ఎత్తున టపాసులు పేల్చి ఆనందంగా దీపావళి సంబురాలు చేసుకున్నారు. అందరు దీపావళి సందర్భంగా టపాసులు పేల్చి.. అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటే.. […].

By: jyothi

Published Date - Sat - 6 November 21

Latth Maar Diwali : అక్కడ కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకునుడే దీపావళి..

Latth Maar Diwali : కొవిడ్ మహమ్మారి వల్ల గతేడాది దీపావళి పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించుకోలేకపోయారు ప్రజలు. కాగా, ఈ సారి మాత్రం గ్రాండ్‌గానే ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వెలుగులు నింపే దీపావళి పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ అందరూ.. హ్యాపీగా క్రాకర్స్ పేల్చారు. పెద్ద ఎత్తున టపాసులు పేల్చి ఆనందంగా దీపావళి సంబురాలు చేసుకున్నారు.

అందరు దీపావళి సందర్భంగా టపాసులు పేల్చి.. అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటే.. ఆ ప్రాంతం వారు వింతగా సెలబ్రేట్ చేసుకున్నారు దీపావళి. కర్రలతో ఒకరిని మరొకరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఒకరిద్దరు కాకుండా గుంపులు గుంపులుగా జనం ఎగబడి మరీ దీపావళి సందర్భంగా కర్రలతో కొట్టుకున్నారు. ఆ ప్రాంతం ఎక్కడుందంటే..

చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళిని భారతీయులు దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు. అగ్రరాజ్యం అమెరికా కూడా దీపావళి సందర్భంగా నేషనల్ హాలీ డే ఇచ్చేందుకుగాను చట్టం కూడా రూపొందించింది. కాగా మనం తెలుసుకోబోయే ఈ ప్రాంతంలో దీపావళి వేడుకలు డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రజలు. ఇందుకు గల కారణాలు ఏంటంటే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ ఖండ్ దగ్గర జలౌన్ అనే గ్రామంలో ఇలా కర్రలతో ఒకరిని మరొకరు కొట్టుకుని దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు ప్రజలు.

Latth Maar Diwali

Latth Maar Diwali

ఇలా కర్రలతో కొట్టుకోవాలనే ఆచారం తమకు తమ పూర్వీకుల నుంచి లభించిందని స్థానికులు చెప్తున్నారు. ఇలా కర్రలతో కొట్టుకునే పండుగను వారు ‘లాత్ మార్ దివాళి’ అని అంటారు. ఇక సెలబ్రేషన్స్‌లో భాగంగా గ్రామంలోని యువకులు, పెద్దలు రెండు గ్రూపులుగా డివైడ్ అయి బహిరంగంగా ఓ చోట చేరుతారు. అనంతరం రెండు గ్రూపులు..ఒక గ్రూపును మరో గ్రూపు కొడుతుంటుంది. అలా గ్రూపులోని యువకులు కొట్టుకూనే ఉంటారు. అలా కర్రలతో కొట్టుకుంటున్న సందర్భంలో ఎవరికైనా ఏదేని దెబ్బ తగిలినా పట్టించుకోరట. ఆనంద సందోహంలో భాగంగా ఇలా కర్రలతో కొట్టుకుంటామని జలౌన్ ప్రాంత ప్రజలు చెప్తున్నారు.

ఈ ‘లాత్ మార్ దివాళి’ గురించి ఇతర ప్రాంత ప్రజలు తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఒకరిని మరొకరు కర్రలతో బలంగా కొట్టుకుంటే ప్రాణాలు ప్రోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇలా జలౌన్ ప్రాంత ప్రజలు కర్రలతో కొట్టుకునే వేడుకకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. ‘లాత్ మార్ దివాళి’ తమకు చాలా కొత్తగా ఉందని ఇతర ప్రాంత ప్రజలు అంటున్నారు. కాగా, ఈ ఆచారం ఎప్పటికీ తాము కొనసాగిస్తామని జలౌన్ గ్రామస్తులు పేర్కొంటున్నారు. అయితే, అలా కర్రలతో కొట్టుకుంటున్న సందర్భంలో తాము కొట్టే దెబ్బ కర్రలపైన మాత్రమే పడేట్లుగా జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు.

Tags

Latest News

Related News