Ravana : అప్పట్లోనే ఎరోప్లేన్.. అందులోనే ఇండియాకు రావణుడు.. రీసెర్చ్ స్టార్ట్..

Ravana : ప్రస్తుత సాంకేతిక యగంలో రోజుకో కొత్త అధునాతనమైన ఆవిష్కరణ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కాగా, చాలా ఏళ్ల కిందటనే అనగా ఇతిహాసగాధల ప్రకారం.. రావణుడి టైంలోనే ఎరోప్లేన్స్ ఉన్నాయని కొందరు చెప్తుంటారు. లంకాధీశుడు అయిన రావణుడు అప్పట్లోనే విమానాలు ఉపయోగించినట్లు వివరిస్తుంటారు. అయితే, అది కేవలం కల్పితగాధని కొట్టి పారేసే వాళ్లూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలీ విషయంలో నిజం ఎంత అనేది తెలుసుకునేందుకుగాను శ్రీలంక పరిశోధన బృందం ప్రయత్నింస్తోంది. వరల్డ్‌లోనే మొట్టమొదట విమానాన్ని వినియోగిచింది […].

By: jyothi

Published Date - Wed - 17 November 21

Ravana : అప్పట్లోనే ఎరోప్లేన్.. అందులోనే ఇండియాకు రావణుడు.. రీసెర్చ్ స్టార్ట్..

Ravana : ప్రస్తుత సాంకేతిక యగంలో రోజుకో కొత్త అధునాతనమైన ఆవిష్కరణ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. కాగా, చాలా ఏళ్ల కిందటనే అనగా ఇతిహాసగాధల ప్రకారం.. రావణుడి టైంలోనే ఎరోప్లేన్స్ ఉన్నాయని కొందరు చెప్తుంటారు. లంకాధీశుడు అయిన రావణుడు అప్పట్లోనే విమానాలు ఉపయోగించినట్లు వివరిస్తుంటారు. అయితే, అది కేవలం కల్పితగాధని కొట్టి పారేసే వాళ్లూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలీ విషయంలో నిజం ఎంత అనేది తెలుసుకునేందుకుగాను శ్రీలంక పరిశోధన బృందం ప్రయత్నింస్తోంది.

వరల్డ్‌లోనే మొట్టమొదట విమానాన్ని వినియోగిచింది రావణుడని శ్రీలంక ప్రజలు విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలోనే అందులో నిజమెంత అనేది తెలుసుకునేందుకుగాను శ్రీలంక దేశానికి చెందిన పౌరవిమానయాణ నిపుణులు, శాస్త్రవేత్తలు, పురావాస్తు శాఖ వారు రీసెర్చ్ చేసేందుకుగాను పూనుకున్నారు.

నిజానికి ఈ రీసెర్చ్ గతేడాది చేయాల్సింది. కానీ, కరోనా మహమ్మారి వలన ఆలస్యమవుతూ వచ్చింది. అందుకు సంబంధించిన నిధులు విడుదల అయినప్పటికీ రీసెర్చ్ చేసే పరిస్థితులు లేవు. కాగా, ఇప్పుడిప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. ఈ క్రమంలోనే శ్రీలంక ప్రభుత్వం రీసెర్చ్ రీ ఇటరేట్ చేసింది.

Lord Ravana

Lord Ravana

కొవిడ్ కారణంగా ఆగిపోయిన రీసెర్చ్‌ను తిరిగి స్టార్ట్ చేయాలని శ్రీలంక గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ కీలక పరిశోధనలో భారత్ భాగస్వామి కావాలని శ్రీలంక పరిశోధన బృందం కోరుతోంది. ఇందుకుగాను భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.. భారత ప్రభుత్వం కూడా ఈ పరిశోధనలో కనుక పాల్గొంటే మంచి ఫలితాలుంటాయని పలువురు శ్రీలంకన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారట.

 

శ్రీలంక ప్రభుత్వం ‘రావణుడి విమానం’ విషయమై పరిశోధన చేసేందుకుగాను 5 మిలియన్ శ్రీలంకన్ రూపీస్ విడుదల చేసింది. అయితే, ఈ విషయమై చాలా సార్లు నిపుణులు, మేధావులు చర్చలు కూడా జరిపారు. అసలు రావణుడు ఆ టైంలో విమానం ఎలా ఉపయోగించగలిగాడు అనేది శాస్త్రీయంగా తేలాలని చాలా మంది పట్టుబట్టారట. ఈ నేపథ్యంలోనే అసలు రావణుడు నిజంగానే విమానం ఉపయోగించాడా? అనే అంశంపై శాస్త్రీయంగా పరిశోధించేందకుగాను శ్రీలంకన్ గవర్నమెంట్ పరిశోధకుల బృందాన్ని నియమించింది. ఆ బృందంలోని సభ్యులు రావణుడు విమానం ఉపయోగించడా? అనే విషయమై రీసెర్చ్ స్టార్ట్ చేయనున్నారు.

ఈ రీసెర్చ్ వచ్చే ఏడాది ప్రారంభంలో పర్ఫెక్ట్‌గా స్టార్ట్ కానుందని తెలుస్తోంది. శాస్త్ర పరిజ్ఞానం అప్పట్లోనే ఉందనే విషయం రావణుడి విమానం అంశం పరిశీలించాక అర్థమవుతుందని చాలా మంది పేర్కొంటున్నారు. అయితే, సాంకేతికత ఇప్పట్లో ఉన్నట్లు అప్పట్లోనే ఉందనే వాదించే వారు చాలా మందే ఉన్నారు. కానీ, అందుకు సంబంధించిన శాస్త్రీయమైన ఆధారాలనైతే సమర్పించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఈ పరిశోధన చాలా కీలకం కానుంది.

 

Tags

Latest News

Related News