Lovers Safe Place : జనరల్‌గా ప్రేమికులు ఏదేని విషయాలు మాట్లాడుకునేందుకుగాను పబ్లిక్ ప్లేసెస్‌ను సెలక్ట్ చేసుకుంటుంటారు. అయితే, ఆ సమయంలో అమ్మాయి కాని అబ్బాయి కాని తెగ భయపడిపోతుంటారు. అక్కడికి పోలీసులు కాని ఇంకెవరైనా తెలిసిన వారు కాని వస్తారని సందేహిస్తుంటారు.
ముఖ్యంగా పోలీసులు ఆ ఏరియాకు రాకుంటే ఎంత బాగుండు అనుకుంటారు. ప్రేమికుల కోసమే సెపరేట్‌గా అటువంటి ప్లేస్ ఉంటే బాగుండని అనుకుంటుంటారు. అటువంటి ప్లేస్ ఒకటి ఉందండోయ్.. ఆ ప్లేస్‌లోకి ప్రేమికులు, జంటలు ఎంచక్కా వెళ్లొచ్చు. ఇక అక్కడకు పోలీసులు పొరపాటున కూడా రారు. ఎందుకంటే ఆ ప్లేస్‌లోకి పోలీసులకు నో ఎంట్రీ.. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడుంది.. ఆ ప్లేస్ విశేషాలేంటి.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మనం సినిమాలతో పాటు నిజజీవితంలోనూ చూస్తుంటాం.. ప్రేమికులు పారిపోతున్నారనే సంగతి తెలియగానే ఆ సందర్భంలో పోలీసులు ఎంటర్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అయితే, అటువంటి పరిస్థితి ఈ ప్రదేశంలో అయితే ఉండబోదు. ఎందుకంటే ఈ ప్రదేశానికి పోలీసుల రాక నిషేధం. ఈ ప్లేస్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్‌లోని కులు డిస్ట్రిక్ట్.. షాంగ్చల్ మహదేవుడి టెంపుల్ ఉన్న ప్లేస్.. ఈ ప్లేస్ షాన్‌ఘర్ విలేజ్‌లో ఉంటుంది. ఈ ప్రదేశం ప్రేమికుల స్వర్గధామంగా పిలువబడుతోంది. ఇక్కడ జంటలు, ప్రేమికులు ఎంచక్కా హాయిగా గడిపేయొచ్చు. ఇక్కడకు పోలీసులు అస్సలు రారు.
shasngchul temple
ప్రకృతి అందాలు పుష్కలంగా ఉండే హిమాచల్ ప్రదేశ్‌లో మంచు ఎప్పుడూ కురుస్తుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలోని షాన్ ఘర్ విలేజ్‌లోని సైంజ్ అనే లోయలో ఉండే మహాదేవుడి ఆలయం సమీపంలో ప్రేమికులు చక్కగా ఉండిపోవచ్చు. ఈ మహాదేవుడు ప్రేమికులు, జంటలకు రక్షణగా ఉంటాడని స్థానికులు చెప్తున్నారు. ఈ ఏరియాను లవర్స్ అడ్డా అని కూడా పిలుస్తుంటారు. సొసైటీలో లవ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పట్ల వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వారు ఇక్కడకు వస్తే వారికి దేవుడే రక్షణగా ఉండి వారి పెళ్లిళ్లు చేస్తాడని ప్రేమికులు నమ్ముతారట.
ఈ మహాదేవుడి టెంపుల్‌కు వచ్చిన ప్రేమికులు, జంటలకు నిర్వాహకులు ఆశ్రయమిస్తారు. కొన్ని రోజుల పాటు షెల్టర్ ఇస్తారు. వీరికి రక్షణగా దేవుడు ఉంటాడని నిర్వాహకులు చెప్తారట. ఇకపోతే వీరిని ఎవరూ అస్సలు టచ్ చేయబోరు. ఎందుకంటే ఆ ప్రాంత సమీపంలోనికి పోలీసులు కాని ఇతరులు కాని అస్సలు రారట. ఈ టెంపుల్‌కు వచ్చిన జంటలు, ప్రేమికులను స్థానికంగా ఉండే గ్రామస్తులు కూడా అతిథులుగా భావించి, వారికి కొన్ని రోజుల పాటు షెల్టర్ ఇస్తారు. ప్రేమికులను కాపాడితే దేవుడి అనుగ్రహం వారికి లభిస్తుందని స్థానికులు నమ్ముతారు.