Secunderabad Gymkhana Ground: హెచ్‌సీఏ ఘోర వైఫల్యం..జింఖానా గ్రౌండ్స్‌ దగ్గర తొక్కిసలాట

Secunderabad Gymkhana Ground : కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్‌ అభిమానులు జింఖానా గ్రౌండ్స్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున చేరుకోవడంతో క్యూ లైన్లలో పడిగాపులు కాశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టికెట్లు ఇస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించడంతో ఉదయం నుంచే భారీగా తరలివచ్చారు క్రికెట్ అభిమానులు..

By: jyothi

Published Date - Thu - 22 September 22

Secunderabad Gymkhana Ground: హెచ్‌సీఏ ఘోర వైఫల్యం..జింఖానా గ్రౌండ్స్‌ దగ్గర తొక్కిసలాట

Secunderabad Gymkhana Ground: క్రికెట్‌ పై అభిమానం వారి ప్రాణాల మీదకు తెస్తుంది. మ్యాచ్‌ చూడాలనే తాపత్రయం క్రికెట్‌ అభిమానులను గాయాల పాలు చేసింది. హెచ్‌సీఏ ఘోర వైఫల్యం కారణంగా సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌ లో పలువురు క్రికెట్‌ అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా మారింది.

భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్‌ టికెట్ల

కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్‌ అభిమానులు జింఖానా గ్రౌండ్స్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున చేరుకోవడంతో క్యూ లైన్లలో పడిగాపులు కాశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టికెట్లు ఇస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించడంతో ఉదయం నుంచే భారీగా తరలివచ్చారు క్రికెట్ అభిమానులు. జింఖానా గేటు నుంచి ప్యారడైజ్ సిగ్నల్ వరకూ బారులు తీరారు. వేలాది మంది ఒక్క చోటుకు చేరడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. కానీ, 11.30 దాటినా కూడా కౌంటర్లు ప్రారంభించకపోవడంతో యువకులు అసహనం వ్యక్తం చేశారు.

అదే సమయంలో కేవలం మూడు వేల టికెట్లు మాత్రమే ఇస్తామని సమాచారం రావడంతో అభిమానులు ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు చేరుకునేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. గేట్లు తోసుకొని, గోడలు దూకి గ్రౌండ్లోకి దూకేందుకు కొందరు ప్రయత్నించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల లాఠీఛార్జ్ లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.అటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

జింఖానా గ్రౌండ్ దగ్గర పరిస్థితి దారుణంగా మారింది. క్రికెట్‌ అభిమానుల చెప్పులు, బ్యాగ్‌ లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హెచ్‌సీఐ ఘోరంగా వైఫల్యం చెందడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపణలు వచ్చాయి. 3 వేల టికెట్ల కోసం మొత్తం 30 వేల మంది రావడం కూడా పరిస్థితికి కారణమైంది.

 

Also Read : Chiranjeevi: చిరంజీవికి కాంగ్రెస్ ఐడెంటిటీ కార్డ్ జారీ

Also Read: Pan India Number One Hero : పాన్ ఇండియా నెంబ‌ర్ వ‌న్ హీరో అత‌నే.. తెలుగు హీరోల‌కు షాక్‌..!

Related News