Skippings : అధిక బరువున్న వారు బరువు తగ్గించుకునేందుకుగాను రకరకాల ఎక్సర్‌సైజెస్ చేస్తుంటారు. అందులో ఒకటి స్కిప్పింగ్.. స్కిప్పింగ్ చేయడం ద్వారా ఫిజికల్ ఫిట్‌నెస్ లభించడంతో పాటు వెయిట్ కూడా లాస్ కావొచ్చు. కాగా, ఈ స్కిప్పింగ్ వలన మోకాళ్లు నొప్పులు, బ్యాక్ పెయిన్ వచ్చే చాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి పరిమితంగానే స్కిప్పింగ్ చేయాల్సి ఉంటుంది.
skipping 1
అయితే, నార్మల్ వెయిట్ ఉన్న వారు రోజుకు వంద స్కిప్‌లు చేస్తే ఇక అంతే సంగతులు అని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని సార్లు స్కిప్పింగ్ చేయడం అస్సలు సాధ్యం కాదు. ఒకవేళ అలా చేస్తే.. అలసిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదకం కూడా ఉంటుంది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ఓ తల్లి తన కూతురి బరువు తగ్గించేందుకుగాను దారుణమైన పని చేసింది. తన కూతురి చేత ప్రతీ రోజు మూడు వేల స్కిప్పింగ్స్ చేయించింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..
చైనా మీడియాలో ప్రచారమవుతున్న స్టోరిస్ ప్రకారం..చైనా దేశంలోని జెన్‌జియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ తన 13 ఏళ్ల కూతురు బాగా హైట్ పెరగాలని భావించింది. దాంతో పాటు తన కూతురు అధిక బరువు తగ్గించాలనుకుంది. సదరు బాలిక హైట్ 1.58 మీటర్స్ కాగా వెయిట్ 120 కేజీలు. ఈ క్రమంలో బరువు తగ్గించేందుకుగాను నిపుణులను కాని వైద్యులను కాని ఎవరిని సంప్రదించకుండానే ప్రతీ రోజు తన కూతురితో స్కిప్పింగ్ చేయించాలని తల్లి నిర్ణయించింది. ఇందుకుగాను సదరు తల్లి షెడ్యూల్ కూడా ఖరారు చేసింది.
Skipping
ఈ క్రమంలోనే స్టార్టింగ్‌లో రోజుకు వెయ్యి స్కిప్పింగ్స్ చేయించిన తల్లి ఆ తర్వాత కాలంలో మూడు వేల స్కిప్పింగ్స్ చేయించిందట. అలా మూడు నెలల పాటు స్కిప్పింగ్స్ చేయిస్తున్న క్రమంలో బాలిక తన తల్లికి మోకాళ్లు నొప్పి లేస్తున్నాయని చెప్పిందట. అయినప్పటికీ తల్లి అవేవీ పట్టించుకోకుండా నువ్వు బద్ధకిస్తున్నావని బాలికకు చెప్పి స్కిప్పింగ్స్ చేయించింది.
ఇటీవల ఆ బాలికకు మొకాళ్ల నొప్పి తీవ్రతరం అయి, తీవ్ర అస్వస్థతకు గురైంది. దాంతో బాలికను డాక్టర్స్ వద్దకు తీసుకెళ్లారు. బాలికను పరిశీలించిన తర్వాత డాక్టర్స్ బాలికకు ‘ట్రాక్షన్ అపొఫిసైటిస్’ అనే కీళ్ల సమస్య వచ్చిందని వివరించారు. బాలిక పరిస్థితి విషమ స్థితికి చేరిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పిల్లలకు అధిక వ్యాయామం ప్రమాదకరమని డాక్టర్స్ చెప్తున్నారు. వెయిట్ లాస్ కోసం ఇతర మార్గాలున్నాయని సూచిస్తున్నారు. పిల్లలకు వ్యాయామం అనేది అవసరమైనంత వరకే చేయించాలని పేరెంట్స్‌కు వైద్యులు సూచిస్తున్నారు.