Neem Tree : వేప చెట్లు ఎండిపోతున్నాయ్.. ఆందోళనలో ప్రజలు.. అసలేం జరుగుతోంది?

Neem Tree : వేప చెట్టు.. దీని ప్రాముఖ్యత ఎంతటే దానిని నిర్వచించడం అసాధ్యం. చాలా మెడిసిన్స్‌లో దీనిని ఉపయోగిస్తారు. దీని వల్ల ఉండే యూజెస్ ఎన్నంటే చెప్పలేనంత. ఉదయం పళ్లు తోముకునేందుకు సైతం గ్రామాల్లో వేప పుల్లలనే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మరీ అలాంటి వేప చెట్టు అంతరించిపోతే పరిస్థితి ఏంటి? అవును ప్రస్తుతం వేప చెట్లు ఉన్నట్టుండి ఎండిపోతున్నాయి. ఆకులు, కొమ్మలు, చిగుర్లు తమ రంగును, గుణాన్ని కోల్పోయి ఎండిపోయి రాలిపోతున్నాయి. దీంతో అసలు […].

By: jyothi

Published Date - Sat - 30 October 21

Neem Tree : వేప చెట్లు ఎండిపోతున్నాయ్.. ఆందోళనలో ప్రజలు.. అసలేం జరుగుతోంది?

Neem Tree : వేప చెట్టు.. దీని ప్రాముఖ్యత ఎంతటే దానిని నిర్వచించడం అసాధ్యం. చాలా మెడిసిన్స్‌లో దీనిని ఉపయోగిస్తారు. దీని వల్ల ఉండే యూజెస్ ఎన్నంటే చెప్పలేనంత. ఉదయం పళ్లు తోముకునేందుకు సైతం గ్రామాల్లో వేప పుల్లలనే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మరీ అలాంటి వేప చెట్టు అంతరించిపోతే పరిస్థితి ఏంటి? అవును ప్రస్తుతం వేప చెట్లు ఉన్నట్టుండి ఎండిపోతున్నాయి. ఆకులు, కొమ్మలు, చిగుర్లు తమ రంగును, గుణాన్ని కోల్పోయి ఎండిపోయి రాలిపోతున్నాయి. దీంతో అసలు చెట్లకు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంలో వేరే రాష్ట్రాల్లో ఇలా ఎండిపోతున్న చెట్టు క్రమంగా తెలుగు రాష్ర్టాల్లోనూ ఎండిపోతున్నాయి.

ఇందుకు కారణం డాయాబ్యాక్ట్ డిసీజ్ అని కొందరు అంటుంటే.. టీ మస్కిటో బగ్ వల్ల అంటూ పరిశోధకులు చెబుతున్నారు. టీ మస్కిటో బగ్ అనే కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందని, ఈ కీటకాలు రాత్రి పూట ఎక్కువగా సంచరిస్తూ కొమ్మ చివరి భాగాల్లో రసాన్ని పీల్చడం వల్ల చివరి భాగాలు ఎండిపోతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇందులో రెండు రకాల శిలింద్రాలు ఉంటాయని అందులో హోమాప్తిస్ అజాడిరక్టా అనే శిలీంద్రం వల్ల ఈ డిసీజ్ సోకుతున్నట్టు పరిశోధనల్లో తేలింది.

ఈ శిలీంద్రం గాలి ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇందులో ఆల్ఫా స్టోస్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. వర్షకాలంలో మొదలై వింటర్ చివరి వరకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అయితే నాలుగైదు సంవత్సరాలకు ఒక సారి ఇలా జరుగుతుందని చెబుతున్నారు విశ్లేషకులు.

Neem Tree

Neem Tree

చెట్టు కణాల్లో లిగ్నిన్ ఉంటుంది. ఈ లిగ్నిన్ ఎక్కువగా ఉన్న చెట్లు ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇలాంటి వాటికి వ్యాధి రావడం చాలా కష్టం. అందులోనూ వేప చెట్టుకు రావడం మరింత కష్టం. ఎందుకంటే ఈ చెట్టులో చాలా ఔషద గుణాలుంటాయి. వీటితో పాటు యాంటీ మైక్రోబినల్, యాంటీ ఫంగర్, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి.

చెట్టు‌పై పొరకు రంద్రం చేసుకుని అందులోంచి ఫంగల్ చెట్టులోకి చేరి ఎటాక్ చేస్తుంది. దీని వల్ల చెట్టు ఎండిపోతుంది. కొన్ని రసాయనాలతో దీనిని ఆరికట్ట వచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి ఇంట్లో లేక మీ దగ్గర్లో ఉన్న చెట్లకు సైతం ఇలాంటి డిసీజ్ సోకిందేమో ఒక్కసారి చెక్ చేయండి. సోకినట్టు లక్షణాలు కనిపిస్తే నిపుణుల సలహాలు తీసుకోండి. దీని ద్వారా చెట్టు పూర్తిగా ఎండిపోకుండా జాగ్రత్త పడవచ్చు. మరిన్ని చెట్లకు ఇది వ్యాపించకుండా నివారణ చర్యలు చేపట్టవచ్చు.

Tags

Related News