Railways Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఇండియన రైల్వే జాబ్స్..

Railways Notification : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే భారతీయ రైల్వేశాఖ వారికి శుభవార్త చెప్పింది. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ రైల్వే శాఖ వారు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు సౌత్ ఈస్టర్న్ రైల్వేస్‌లో భర్తీ కానున్నాయి. అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. […].

By: jyothi

Updated On - Fri - 3 December 21

Railways Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో ఇండియన రైల్వే జాబ్స్..

Railways Notification : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే భారతీయ రైల్వేశాఖ వారికి శుభవార్త చెప్పింది. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో పలు ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల చేసింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


భారతీయ రైల్వే శాఖ వారు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలు సౌత్ ఈస్టర్న్ రైల్వేస్‌లో భర్తీ కానున్నాయి. అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. గూడ్స్ గార్డ్ విభాగంలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అప్లికేషన్ ప్రాసెస్ నవంబర్ 24న స్టార్ట్ కాగా, డిసెంబర్ 23 లాస్ట్ డేట్. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 520 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


ఈ 520 ఖాళీల్లో జనరల్ కేటగిరీలో 277, ఓబీసీ విభాగంలో 87, ఎస్సీ విభాగంలో 126, ఎస్టీ విభాగంలో 30 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు. రికగ్నైజ్‌డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఈ పోస్టుల కోసం అప్లై చేసుకునే అభ్యర్థుల ఏజ్ 42 ఇయర్స్ లోపు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.

Railways Notification -1

Railways Notification -1

అభ్యర్థులకు హండ్రెడ్ మార్క్స్‌కు ఎగ్జామ్ కండక్ట్ చేయనున్నారు. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్‌లో అర్థమెటిక్, జనరల్ అవేర్‌నెస్, ఇంటెలిజెన్స్, రీజనింగ్‌కు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతీ రాంగ్ ఆన్సర్‌కు వన్ బై థర్డ్ మార్క్స్ కట్ అవుతాయి.


అప్లికేషన్ ప్రాసెస్ వెరీ సింపుల్.. అఫీషియల్ వెబ్‌సైట్ ‘ఆర్ఆర్‌సీఎస్ఈఆర్‌’లోకి వెళ్లాలి. అందులో ఆన్‌లైన్ లింక్ ఫర్ జీడీసీఈ 2021 ఫర్ గూడ్స్ గార్డ్‌పైన క్లిక్ చేసి న్యూ పేజీ ఓపెన్ చేయాలి. అందులో అప్లై నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేయాలి. అయితే, అభ్యర్థులు ఈ అప్లికేషన్ చేసే ముందర అఫీషియల్ నోటిఫికేషన్‌ను క్లియర్‌గా పూర్తిగా చదివితే మంచిది.


నోటిఫికేషన్ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి వివరాలను క్షుణ్ణంగా చదవాలి. ఉద్యోగార్థులు నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదివిన తర్వాత అప్లై చేసుకుంటేనే మంచిదని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవల్ ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలను అధికారులు అభ్యర్థులకు తెలుపుతారు. ఈ నెల 23 అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ కాగా, అర్హులైన వారు ఆ లోపు అప్లై చేసుకుకోవచ్చు.

Tags

Latest News

Related News