Strange News : ఈ కుర్రాడు అంగారక గ్రహంలో పుట్టాడట.. భవిష్యత్ గురించి అతను చెప్పిన మాటలివే..

Strange News : అందరికంటే భిన్నంగా ఉండేందుకు కొందరు ప్రయత్నిస్తుండటం మనం చూడొచ్చు. అలా చేసి తమను తాము స్పెషల్ పర్సన్స్‌గా నిరూపించుకునేందుకుగాను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. కాగా ఈ కుర్రాడు అందికంటే భిన్నమని చెప్పడమే కాదు..తనకు అంతా తెలుసని అంటున్నాడు. అతడెవరో తెలుసుకుందాం.. జనరల్‌గా అందరూ భూమిపైన పుడుతుంటారు. అయితే, ఈ కుర్రాడు మాత్రం అంగారక గ్రహంపైన పుట్టాడు. ఆ అరుణ గ్రహం నుంచి భూమ్మీదకు వచ్చాడట. తనకు భూలోకంలో జరగబోయే భవిష్యత్తు గురించి తెలుసు. ఈ […].

By: jyothi

Published Date - Sat - 13 November 21

Strange News : ఈ కుర్రాడు అంగారక గ్రహంలో పుట్టాడట.. భవిష్యత్ గురించి అతను చెప్పిన మాటలివే..

Strange News : అందరికంటే భిన్నంగా ఉండేందుకు కొందరు ప్రయత్నిస్తుండటం మనం చూడొచ్చు. అలా చేసి తమను తాము స్పెషల్ పర్సన్స్‌గా నిరూపించుకునేందుకుగాను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. కాగా ఈ కుర్రాడు అందికంటే భిన్నమని చెప్పడమే కాదు..తనకు అంతా తెలుసని అంటున్నాడు. అతడెవరో తెలుసుకుందాం..

జనరల్‌గా అందరూ భూమిపైన పుడుతుంటారు. అయితే, ఈ కుర్రాడు మాత్రం అంగారక గ్రహంపైన పుట్టాడు. ఆ అరుణ గ్రహం నుంచి భూమ్మీదకు వచ్చాడట. తనకు భూలోకంలో జరగబోయే భవిష్యత్తు గురించి తెలుసు. ఈ కుర్రాడు పలు విషయాలపైన తన అభిప్రాయాలు చెప్తున్నాడు. ఇతడికి ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ కూడా ఉండటం విశేషం. ఈ కుర్రాడు ఏడాది వయసున్నపుడే పేపర్ చదివాడట. రష్యాలోని ఓ మారుమూల విలేజ్‌లో పుట్టిన ఇతడిని రష్యాలోని వ్లాదిమర్ సర్కారు కస్టడీలోకి తీసుకుందనే ప్రచారం ఉంది. అలా అతడు ప్రభుత్వం కంట్రోల్‌లోనే రూరల్ విలేజ్‌లో ఉన్నాడని తెలుస్తోంది. అతడి పేరు బొరిస్కా.

Strange News bb mars

Strange News bb mars

ఇకపోతే ఇతడు గతంలో ఓ ఇంటర్వ్యూలో భవిష్యత్ గురించి నమ్మలేని విషయాలు తెలిపాడు. భూమిపైన ఉండేటువంటి అయస్కాంత క్షేత్రాలు రివర్స్ అవుతాయన్నాడు. అతడు చెప్పినట్లు రివర్స్ అయినట్లయితే భూమిపైన విపరీతమైన మార్పులొస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. 42 వేల ఏళ్ల కిందట ఓసారి ఇలా జరిగినట్లు పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. అలా జరిగిన ఘటనకు ‘లాచాంప్ ఘటన’ అని పేరు కూడా పెట్టారు శాస్త్రవేత్తలు.

Strange News bb

Strange News bb

ఇలా లాచాంప్ ఘటన మరోసారి జరిగినట్లయితే భూమ్మీద ఉన్నటువంటి ప్రాణకోటికి ప్రమాదం పొంచి ఉన్నట్లే. వాతావరణం పూర్తిగా వేడెక్కి తుపాను వచ్చే చాన్సెస్ కూడా ఉంటాయి. ఇకపోతే తాను మార్స్ (అరుణగ్రహం)పైన పైలట్ అని పేర్కొన్నాడు బొరిస్కా. ఆ విషయం విని అందరూ షాక్ అయ్యారు. అసలు అది నమ్మశక్యంగా లేదని అన్నారు. అందుకు బొరిస్కా ఇచ్చిన రిప్లయి కూడా ఇంట్రెస్టింగ్‌గా అండ్ వింతగా ఉండటం గమనార్హం. కుజ గ్రహంపై జరిగిన యుద్ధంలో ఆ గ్రహం సర్వనాశనం కాగా తాను భూమ్మీదకు వచ్చానని బొరిస్కా తెలిపాడు.

బొరిస్కా చెప్పిన విషయాల ప్రకారం..కుజ గ్రహంపై ఉన్న వారికి 35 ఏళ్ల వరకే వయసు ఉంటుందని, ఆ తర్వాత వారికి వయసు పెరగబోదని బొరిస్కా వివరించాడు. మార్స్ అట్మాస్పియరిక్ కండీషన్స్ ప్రకారం..వారు అక్కడ కార్బన్ డైయాక్సైడ్ పీలుస్తారని, వారు ఒక వేళ భూమ్మీదకు వస్తే ఆక్సిజన్ పీల్చరని, తమతో పాటు కార్బన్ డైయాక్సైడ్ తీసుకొచ్చుకుంటాని పేర్కొన్నాడు. అయితే, బొరిస్కా చెప్పిన విషయాలు ఏవీ కూడా నమ్మశక్యంగా లేకపోవడం గమనార్హం.

Tags

Latest News

Related News