“పెళ్లి కాకుండానే పిల్లలు’.. జమానా అలానే ఉంది మరి..!

  ఇస్మార్ట్ శంకర్ లో ఓ సన్నివేశంలో హీరో రామ్.. హీరోయిన్ నభా నటేశ్ తో.. ‘ఈమధ్య ముందు హనీమూన్లే అయితున్నయే.. ఆ తర్వాత పెళ్లి అయితే అయితుంది.. లేకుంటే లేదు.. జమానా అలా ఉంది మళ్ల.. ఏం చేస్తాం.. ఫాలో అయితం’ అంటాడు. బయట లోకంలో జరిగేదే పూరి జగన్నాధ్ ఆ సినిమాలో చూపించాడు. వెస్ట్రన్ కల్చర్ లో భాగంగా ఆడా, మగా.. ఇద్దరూ ముందే ఒక్కటవ్వడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఇందులో పెళ్లికి […].

By: jyothi

Published Date - Fri - 20 August 21

“పెళ్లి కాకుండానే పిల్లలు’.. జమానా అలానే ఉంది మరి..!

 

ఇస్మార్ట్ శంకర్ లో ఓ సన్నివేశంలో హీరో రామ్.. హీరోయిన్ నభా నటేశ్ తో.. ‘ఈమధ్య ముందు హనీమూన్లే అయితున్నయే.. ఆ తర్వాత పెళ్లి అయితే అయితుంది.. లేకుంటే లేదు.. జమానా అలా ఉంది మళ్ల.. ఏం చేస్తాం.. ఫాలో అయితం’ అంటాడు. బయట లోకంలో జరిగేదే పూరి జగన్నాధ్ ఆ సినిమాలో చూపించాడు. వెస్ట్రన్ కల్చర్ లో భాగంగా ఆడా, మగా.. ఇద్దరూ ముందే ఒక్కటవ్వడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు.

ఇందులో పెళ్లికి ముందే పిల్లల్ని కని.. ఆతర్వాత పెళ్లికి వెళ్లడం, పిల్లల్ని కని పెళ్లి చేసుకోకపోవడం, పెళ్లి కాకుండా పిల్లల్ని కని.. తర్వాత పెళ్లి చేసుకుని విడిపోవడం.. ఇలా పలు పోకడలు నేటి రోజుల్లో జరుగుతోంది. సంప్రదాయాలు ఎక్కువగా పాటించే భారత్ లో ప్రస్తుతం ఈ ఆధునిక పోకడలు సాధారణ విషయాలయ్యాయి. సినీనటులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు.. ఈ జాబితాలో ఉంటున్నారు. దీంతో సహజంగానే సమాజంపై ఎఫెక్ట్ పడుతోంది.

కమల్ హాసన్-సారిక:

1980ల్లోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కన్నారు. హీరోయిన్లు శృతి హాసన్, అక్షర హాసన్ వీరి పిల్లలే. వీరిద్దరూ పుట్టాక 1988లో పెళ్లి చేసుకున్నారు. 16 ఏళ్ల కాపురం తర్వాత 2004లో విడిపోయారు.

నా గుప్తా-వివ్ రిచర్డ్స్:

1980ల్లో క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్. క్రికెట్ పేరు చెప్తే వెస్టిండీస్ పేరే.. రిచర్డ్స్ పేరు వింటే ప్రత్యర్ధులకు హడలే. అటువంటి క్రికెటర్ హిందీ నటి నీనా గుప్తాతో ప్రేమాయణం సాగాంచి పెళ్లికి ముందే పాప మసాబా గుప్తాకు జన్మనిచ్చారు.

పవన్ కల్యాణ్-రేణు దేశాయి:

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్-రేణు దేశాయి పెళ్లి చేసుకోకుండానే దాదాపు 12 ఏళ్లు కలిసున్నారు. వీరి కొడుకు అకిరానందన్ పుట్టిన ఆరేడేళ్ల తర్వాత వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విడిపోయారు.

నేహా కక్కర్-రోహన్ ప్రీత్ సింగ్:

బాలీవుడ్ టాప్ సింగర్ నేహా-రోహన్ 2020 అక్టోబర్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లయిన రెండు నెలలకే ఆమె గర్భవతి అయిందనే వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. వీరిద్దరూ రెండేళ్లపాటు డేటింగ్ లో ఉన్నారు.

హార్ధిక్ పాండ్యా-నటాషా:

ఈ స్టార్ క్రికెటర్ పెళ్లికి ముందే తండ్రయ్యాడు. నటాషా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయాన్ని సోషల్ మీడియోలో పోస్ట్ చేశాడు కూడా. బిడ్డను కన్నాకే వీరు పెళ్లి చేసుకున్నారు.

కల్కి కొచ్చిన్-హర్షా బద్:

వీరిద్దరూ కొన్నేళ్లు డేటింగ్ లో ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాకుండా.. అనే ప్రశ్న వస్తే.. పెళ్లికి, బిడ్డను కనడానికి సంబంధం ఏంటీ అంటోంది.

సెలీనా జెట్లీ-పీటర్ హాగ్:

చాన్నాళ్లు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ 2011లో పెళ్లి చేసుకున్నారు. కానీ.. పెళ్లై 9 నెలలు కాకముందే కవలలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం వీరు ఆస్ట్రియాలో ఉంటున్నారు.

అమీ జాక్సన్-జార్జి:

ఎవడు, ఐ.. వంటి సినిమాల్లో నటించిన అమీ జాక్సన్ లండన్ మూలాలున్న అమ్మాయి. స్వతహాగా అక్కడి కల్చరే ఉండటంతో బాయ్ ఫ్రెండ్ జార్జితో డేటింగ్ లో ఉండి పెళ్లికాక ముందే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆతర్వాతే జార్జిని వివాహం చేసుకుంది.

Tags

Latest News

Related News