Twins.. కవ‌లల్లో కొంద‌రు మాత్ర‌మే ఎందుకు ఒకే విధంగా ఉంటారు.. మిస్ట‌రీ వీడింది..

Twins.. ఒకే తల్లి కడుపులో ఒకే సమయంలో లేదా సెకన్ల తేడాతో పుట్టే పిల్లలను కవలలు అంటారు. ఈ కవలలు మగ బిడ్డలు కావచ్చు లేదా ఆడ పిల్లలు కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఓ మగ బిడ్డ, ఓ ఆడ బిడ్డ కూడా పుట్టొచ్చు. ఈ కవల పిల్లలు చూడ్డానికి ఒకే రకంగా ఉండటంతో పాటు ఒకే రకంగా ప్రవర్తిస్తే వారిని ఐడెంటికల్ ట్విన్స్ (Identical Twins) అంటారు. వేర్వేరు రూపాలతో జన్మిస్తే వారిని ‘డైజైగోటిక్ ట్విన్స్’ […].

By: jyothi

Updated On - Fri - 3 December 21

Twins.. కవ‌లల్లో కొంద‌రు మాత్ర‌మే ఎందుకు ఒకే విధంగా ఉంటారు.. మిస్ట‌రీ వీడింది..

Twins.. ఒకే తల్లి కడుపులో ఒకే సమయంలో లేదా సెకన్ల తేడాతో పుట్టే పిల్లలను కవలలు అంటారు. ఈ కవలలు మగ బిడ్డలు కావచ్చు లేదా ఆడ పిల్లలు కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఓ మగ బిడ్డ, ఓ ఆడ బిడ్డ కూడా పుట్టొచ్చు. ఈ కవల పిల్లలు చూడ్డానికి ఒకే రకంగా ఉండటంతో పాటు ఒకే రకంగా ప్రవర్తిస్తే వారిని ఐడెంటికల్ ట్విన్స్ (Identical Twins) అంటారు. వేర్వేరు రూపాలతో జన్మిస్తే వారిని ‘డైజైగోటిక్ ట్విన్స్’ అని పిలుస్తారు. కొందరు కవలలే ఎందుకు అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారనే వైద్య రహస్యాన్ని నెదర్లాండ్స్ పరిశోధకులు కనిపెట్టారు.


పరిశోధకులు తొలిసారిగా ఒకే రకమైన కవలల (identical twins) లో స్థిరమైన డీఎన్ఏ మిథైలేషన్ సిగ్నేచర్ (methylation signature) కనుగొన్నారు. ఇది గర్భధారణ సమయంలో శిశువుల పెరుగుదలను మారుస్తుంది. ఫలదీకరణం చెందిన అండం ఒకే జన్యువులను పంచుకుంటూ రెండు పిండాలుగా విడిపోతుంది. దీన్నే జైగోట్(zygote) అంటారు.

Twins-1

Twins-1

ఈ జైగోట్ ఏర్పడితే.. ఒకే రకమైన కవలలు పుడతారు .
కుటుంబ సభ్యుల జన్యుపరమైన ప్రభావాల వల్ల వేర్వేరు కవలలు పుడతారని చెప్పవచ్చు. కానీ ఒకేరకమైన కవలలు ఎలా జన్మిస్తారనేది జీవశాస్త్రంలో ఎప్పటినుంచో ఒక పరిష్కరించలేని రహస్యంగా ఉండిపోయింది.


అయితే నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించిన తాజా పరిశోధన ఫలితాలు.. ఒకే రకమైన కవలలు జీవితకాల మాలిక్యులర్ సిగ్నేచర్(జన్యువులు, ప్రోటీన్లు, జన్యువైవిధ్యాలు) కలిగి ఉంటారని.. కాబట్టి చనిపోయిన మోనోజైగోటిక్(mono zygotic) కవలపై నిర్ధారణ పరీక్షలు చేయొచ్చని సూచించాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 1000 జననాల్లో నలుగురు ఐడెంటికల్ ట్విన్స్ పుడతారని పరిశోధకులు తెలిపారు. కానీ ఇప్పటివరకు కవలలు ఎలా జన్మిస్తారనేది జన్యు సిద్ధత విశ్లేషణలు గానీ పర్యావరణ ప్రభావిత అధ్యయనాలు గానీ కనిపెట్టలేకపోయాయి.


Double ovulation.. అంటే రెండు అండాశయాల నుంచి రెండు అండాలు విడుదలైతే వేర్వేరు పోలికలున్న కవలలు పుడతారు. కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా పొందే జన్యువులు డబుల్ ఓవలేషన్ లో కీలక పాత్ర పోషిస్తాయి. మిస్టరీ : గర్భధారణ ప్రారంభ దశలలో ఒకే పిండం రెండుగా విడిపోతే ఒకేరకమైన కవలలు పుడతారు. వారి జన్యువుల కూడా ఒకే రకంగా ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ తెలియరాలేదు. ఐడెంటికల్ కవలల్లోని క్రోమోజోమ్‌లలోని సమాచారం తేడాగా ఉంటుందని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ ఈ వ్యత్యాసాలు డీఎన్ఏ కోడ్‌లో లేవు.

Tags

Related News