Viral Video : చెట్టుపై రెండు చిరుతలు ఘర్షణ పడుతున్న వీడియో

Viral Video : కొన్ని సందర్భాల్లో ఇతర జంతువులపై దాడి చేసి చంపేసిన వీడియోలు కూడా వస్తుంటాయి. అయితే తాజాగా రెండు చిరుత పులులు ఫైటింగ్ చేసుకున్నాయి..

By: jyothi

Updated On - Wed - 21 September 22

Viral Video : చెట్టుపై రెండు చిరుతలు ఘర్షణ పడుతున్న వీడియో

Viral Video : టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇంట్లోనే కూర్చుని ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం పెరిగింది. మనుషులతో పాటు జంతువులు చేసే చిలిపి పనులు సైతం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యి అందరిని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పులులు, ఎలుగుబంట్లు జనవాసాల్లోకి వచ్చి హల్ చల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము.

కొన్ని సందర్భాల్లో ఇతర జంతువులపై దాడి చేసి చంపేసిన వీడియోలు కూడా వస్తుంటాయి. అయితే తాజాగా రెండు చిరుత పులులు ఫైటింగ్ చేసుకున్నాయి. అది కూడా కొబ్బరి చెట్టు ఎక్కి మరీ కొట్టుకున్నాయి. విన్నడానికి ఆశ్చర్యంగా ఉన్న కరెంట్ స్తంభం లాంటి కొబ్బరి చెట్టును చిరుతలు రెండూ అవలీలగా ఎక్కేసి ఫైటింగ్ చేసుకున్నాయి. వీటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండు చిరుతల ఫైటింగ్..

మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లా సిన్నార్ తాలుక స్వాంగ్వీ గ్రామంలో ఘుమారే అనే రైతు కుటుంబం నివాసం ఉంటుంది. వారి ఇంటి వెనుక మొక్క జొన్న పొలం ఉంది. అక్కడ గట్టుపై రెండు చిరుతలు కనిపించాయి. మొదట ఒక చిరుత కొబ్బరి చెట్టు ఎక్కుతూ కనిపించింది. కొద్దిసేపటికి అది కిందికి దిగడానికి పయత్నిచింది. అయితే అదే సమయంలోనే మరో చిరుత కూడా అదే చెట్టుపైకి ఎక్కింది. ఈక్రమంలో రెండు చిరుతలు కొద్ది సమయం చెట్టుపై ఘర్షణ పడ్డాయి.

అనంతరం రెండు చిరుత పులులు కొబ్బరి చెట్టు నుంచి దిగి సమీపంలోని అడవిలోకి పారిపోయాయి. చిరుతపులులు ఇలా నిట్టనిలువుగా చెట్టు ఎక్కుతూ కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. చిరుత పులుల గురించి ఘమరే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులుల కోసం బోన్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ రెండు చిరుతలు స్థలం కోసం పోరాడుకున్నాయని స్థానికులు భావిస్తున్నారు.

 

 

Also Read : Vastu Shastra : ఇంట్లో మట్టి వస్తువులను ఇలా పెట్టుకుంటే అంతా శుభమే

Also Read : Credit Score : క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?.. వచ్చే ప్రయోజనాలేంటి?

Related News