• Telugu News
  • trending

Wedding Card : ఆ బిజినెస్‌మ్యాన్ తనయుడి వెడ్డింగ్ కార్డుకు అయిన ఖర్చు తెలిస్తే మీకు షాక్..

Wedding Card : ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే అత్యద్భుతమైన ఘట్టం ‘పెళ్లి’. కాగా ఈ వేడుకలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇతరులు అందరూ ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే పెళ్లికి అందరికీ శుభలేఖ ఇచ్చి ఇన్వైట్ చేస్తుంటాం. కాగా, ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ ఆర్థిక స్థోమతను బట్టి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును డిజైన్ చేయిస్తుంటారు. కాగా, గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన తనయుడి మ్యారేజ్‌కు సంబంధించిన పెళ్లికార్డును వినూత్నంగా డిజైన్ […].

By: jyothi

Published Date - Mon - 15 November 21

Wedding Card : ఆ బిజినెస్‌మ్యాన్ తనయుడి వెడ్డింగ్ కార్డుకు అయిన ఖర్చు తెలిస్తే మీకు షాక్..

Wedding Card : ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే అత్యద్భుతమైన ఘట్టం ‘పెళ్లి’. కాగా ఈ వేడుకలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇతరులు అందరూ ఉండాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే పెళ్లికి అందరికీ శుభలేఖ ఇచ్చి ఇన్వైట్ చేస్తుంటాం. కాగా, ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ ఆర్థిక స్థోమతను బట్టి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును డిజైన్ చేయిస్తుంటారు. కాగా, గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన తనయుడి మ్యారేజ్‌కు సంబంధించిన పెళ్లికార్డును వినూత్నంగా డిజైన్ చేయించాడు. వివరాల్లోకెళితే..

గుజరాత్‌కు చెందిన సదరు బిజినెస్‌మ్యాన్ తన తనయుడి మ్యారేజ్ గురించి ప్రతీ ఒక్కరు నాలుగు కాలాల పాటు చర్చించుకునేంతలా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే మ్యారేజ్‌కు ఒకరకంగా ఫస్ట్ స్టెప్ అయినటువంటి ఇన్విటేషన్ కార్డును వినూత్నంగా డిజైన్ చేయించాడు. ఆయన ఎవరంటే.. రాజ్‌కోట్-సౌరాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త మౌలేష్‌భాయ్ ఉకానీ.

weddiing card 1

weddiing card 1

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్ పూర్ ఉమేద్ భవన్ ప్యాలెస్‌లో మ్యారేజ్ ఈ నెల 14, 15, 16 తేదీల్లో జరగనుంది. అనగా ఈ మూడు రోజుల పెళ్లి ఎవరిదంటే..మౌలేష్‌భాయ్ ఉకానీ, సోనాల్‌బెన్ల కుమారుడైన జై ఉకానీది. ఈయన పెళ్లి ఆహ్వాన పత్రికను రాయల్‌గా రాచరికపు శైలిలో తయారు చేయించారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు బరువు 4 కిలోల 280 గ్రాములు ఉండటం గమనార్హం. ఆహ్వాన పత్రికలో ఏడు పేజీలకుగాను రూ.7 వేలు ఖర్చు చేశారు. మూడు రోజుల వివాహ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను కార్డులో పేర్కొన్నారు. ఇకపోతే ఆహ్వాన పత్రికలో బాదం, జీడిపప్పు, చాక్లెట్‌, ఎండుద్రాక్షలను కూడా పెట్టారు.

weddiing card

weddiing card

ఈ వెడ్డింగ్ కార్డుపైన ఫస్ట్ పేజీలో ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడు. మౌలేష్ భాయ్ ద్వారకా ఆలయ ధర్మకర్త అయిన నేపథ్యంలో ఇలా కృష్ణుడి ఫొటోను ముద్రించాడు. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో మ్యారేజ్ జరగనుంది. ఇందులో గెస్టులకు అందించే ప్లేట్ ఫుడ్ ధర రూ.18 వేలు ఉంటుంది. ఇకపోతే మౌలేష్ భాయ్ కుమారుడి మ్యారేజ్ గుర్తు గాను మూడు రోజుల పాటు ప్యాలెస్‌లో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఐశ్వర్య మజుందార్, సచిన్ జిగర్‌తో మ్యూజిక్ నైట్స్ అరేంజ్ చేశారు.

wediing card hindu-marriage

wediing card hindu-marriage

ఈ ప్యాలెస్‌లో హనీమూన్ సూట్ అద్దెకు ఒక్క రాత్రికి ఏడున్నర లక్షల రూపాయలు కావడం గమనార్హం. భారతదేశంలోనే అత్యంత లగ్జరియస్ హోటల్స్‌లో ఒకటైన ఉమైద్ భవన్‌లో గుజరాత్‌కు చెందిన వ్యాపారి మౌలేష్ భాయ్ తనయుడి వివాహం జరుగుతోంది. మౌలేష్ భాయ్ తన తనయుడి వివాహ ఆహ్వాన పత్రిక గురించి పెట్టిన ఖర్చు గురించి ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. అంత డబ్బు కేవలం ఇన్విటేషన్ కార్డు కోసం పెట్టారా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News