Weird News : వింత విషయం.. అక్కడ స్కూల్స్‌లో అబ్బాయిలూ స్కర్ట్స్ వేసుకోవాల్సిందే..

Weird News : జనరల్‌గా స్కూల్‌కు అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకుని వెళ్తుంటారు. అబ్బాయిలు అయితే ప్యాంట్స్ లేదా నిక్కర్స్ వేసుకుని వెళ్తుంటారు. కానీ, ఆ స్కూల్ లో మాత్రం టీచర్స్‌తో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ స్కర్ట్స్ వేసుకుని వెళ్లాలి. ఏ స్కూల్‌లోనూ ఇటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉండబోదు. కానీ, ఈ స్కూల్ మాత్రం చాలా ప్రత్యేకం. అసలు స్కర్ట్స్ ధరించాలనే నిబంధన ఎందుకొచ్చింది? ఆ స్కూల్ విశేషాలేంటో తెలుసుకుందాం.. ఎడిన్ బర్గ్‌లోని క్యాసిల్ వ్యూ ప్రైమరీ […].

By: jyothi

Published Date - Thu - 11 November 21

Weird News : వింత విషయం.. అక్కడ స్కూల్స్‌లో అబ్బాయిలూ స్కర్ట్స్ వేసుకోవాల్సిందే..

Weird News : జనరల్‌గా స్కూల్‌కు అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకుని వెళ్తుంటారు. అబ్బాయిలు అయితే ప్యాంట్స్ లేదా నిక్కర్స్ వేసుకుని వెళ్తుంటారు. కానీ, ఆ స్కూల్ లో మాత్రం టీచర్స్‌తో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ స్కర్ట్స్ వేసుకుని వెళ్లాలి. ఏ స్కూల్‌లోనూ ఇటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉండబోదు. కానీ, ఈ స్కూల్ మాత్రం చాలా ప్రత్యేకం. అసలు స్కర్ట్స్ ధరించాలనే నిబంధన ఎందుకొచ్చింది? ఆ స్కూల్ విశేషాలేంటో తెలుసుకుందాం..

ఎడిన్ బర్గ్‌లోని క్యాసిల్ వ్యూ ప్రైమరీ స్కూల్‌ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు, మేల్ టీచర్స్ కూడా స్కర్ట్స్ ధరించాలి. ఈ మేరకు రూల్ పెట్టింది స్కూల్ యాజమాన్యం. ఈ విషయమై స్టూడెంట్స్ పేరెంట్స్‌కు మెయిల్ సెండ్ చేసింది. అయితే, ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. అబ్బాయిలు ప్రతీ రోజు స్కర్ట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండోయ్.. సంవత్సరంలో ఏదో ఒక్క రోజు మాత్రమే అమ్మాయిల దుస్తుల్లో రావాల్సి ఉంటుంది. పాఠశాల నుంచే లింగసమానత్వం గురించి బోధించాలని యాజమాన్యం ఇటువంటి నిర్ణయం తీసుకుందట.

పురుష టీచర్లు కూడా స్కూల్‌కు ఏదో ఒక రోజు స్కర్ట్ ధరించి రావాల్సి ఉంటుంది. క్యాసిల్ వ్యూ ప్రైమరీ స్కూల్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై కొంత మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లింగ సమానత్వ స్లోగన్‌తో తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం మంచిదే అయినప్పటికీ పిల్లలపై ఒత్తిడి చేయొద్దని, అలా చేయడం వలన వారు మానసిక సమస్యల్లో ఇరుక్కుంటారని హెచ్చరిస్తున్నారు. పిల్లలను పిల్లలుగానే పరిగణించాలని, అలా బలవంతం చేసి స్కర్ట్స్ ధరించాలని ఫోర్స్ చేయొద్దని కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సదరు స్కూల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపైన కొందరు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Weird News 1

Weird News 1

స్కర్ట్ నిబంధనను ఆల్రెడీ స్పెయిన్ కంట్రీలో అమలు చేస్తున్నారు. ఏటా నవంబర్ 4న ‘వియర్ ఏ స్కర్ట్ టు స్కూల్ డే’ను పాటిస్తున్నారు కూడా. ఆ రోజున అబ్బాయిలందరూ స్కర్ట్ ధరించి స్కూల్‌కు రావాలి. ఇందుకు ఓ కారణముంది. స్పెయిన్‌లోని ఓ స్కూల్‌కు ఓ స్టూడెంట్ అనుకోకుండా స్కర్ట్ ధరించి వచ్చాడు. అతడి వేషధారణ చూసి టీచర్స్ ఫైర్ అయ్యారు. గర్ల్స్ డ్రెస్ వేసుకోచ్చవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కూల్ నుంచి ఏకంగా సస్పెండ్ చేశారు. ఈ విషయమై 2020లో సోషల్ మీడియా వేదికగా లింగ సమానత్వం గురించి పెద్ద చర్చ జరిగింది. ‘క్లోత్స్ హావ్ నో జెండర్’ అనగా దుస్తులకు లింగ భేదం ఉండదు అనే క్యాంపెయిన్ చేసేందుకు వారు పూనుకున్నారు. సోషల్ మీడియా వేదికగా చేపట్టిన క్యాంపెయిన్‌కు భారీ మద్దతు లభించింది. ఈ క్రమంలోనే నవంబర్ 4న అమ్మాయిలతో పాటు అబ్బాయిలూ స్కర్ట్స్ ధరించి పాఠశాలకు వస్తారు. ఇప్పుడి రూల్ స్కాట్ లాండ్ స్కూల్స్ కూడా అమలు చేస్తున్నాయి.

Tags

Latest News

Related News