Nude Videos : అత్తమామల నగ్న వీడియోలు తీసి భర్తను బెదిరించిన భార్య

Nude Videos: ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీనగర్ లో జరిగింది. ఓ వ్యక్తి ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. అతనికి తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు..

By: jyothi

Published Date - Wed - 21 September 22

Nude Videos : అత్తమామల నగ్న వీడియోలు తీసి భర్తను బెదిరించిన భార్య

Nude Videos: మానవత్వం మంటగలుస్తోంది. సభ్య సమాజం తలదించుకునే ఘటనలను చూడాల్సి వస్తోంది. వావీ వరసలు మర్చిపోయి వివాహేతర సంబంధాలకు తెగబడుతున్నారు. పుట్టింటి, అత్తింటి పరువు పోతుందేమోనని ఆలోచన కూడా లేదు. సుఖాలకు అడ్డొచ్చే వారు ఎవరైనా సరే.. ఎంతకైనా దిగజారి అడ్డు తొలగించుకుంటున్నారు.

ఇప్పుడు మనం చెప్పుకునే ఘటన అయితే ఓ కోడలు బరితెగించిన ఉదంతమిది. ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసిందని ప్రియుడితో కలిసి ఇంట్లోని నగలు, నగదు దోచుకుని పారిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అత్తమామల నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది.

అసలేం జరిగిందంటే..

ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీనగర్ లో జరిగింది. ఓ వ్యక్తి ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. అతనికి తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త ఇటీవల గుర్తించాడు. బండారం బయటపడటంతో ఇంట్లో ఉన్న రూ. కోటికి పైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకొని ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

భర్తకు ఫోన్ చేసిన భార్య.. బెదిరించింది. తమ ఇంట్లో అత్తమామల గదిలో రహస్య కెమెరాలు పెట్టి.. వారి నగ్న వీడియోలు తీసిన విషయాన్ని బయట పెట్టింది. తనపై కేసును వెనక్కి తీసుకోకపోతే.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ భర్తను బెదిరించింది.

 

Also Read : Viral Video : చెట్టుపై రెండు చిరుతలు ఘర్షణ పడుతున్న వీడియో

Also Read : Narendra Modi : ఫ్యాక్ట్ చెక్.. మోదీ లెన్స్ కవర్ చేసి కెమెరాతో ఫోటోలు తీశారా?..ఇందులో నిజమెంత?

Related News