Tea: మ‌నం రోజూ తాగే టీ ని ఎవ‌రు క‌నిపెట్టారో మీకు తెలుసా..

Tea: టీ. కేవలం ఒకే అక్షరం మాత్రమే ఉన్న ఈ పదానికి చాలా శక్తి ఉంది. టీని తాగడం వలన చాలా మందిలో కొత్తగా ఉత్సాహం ఉరకలేస్తుంది. మనలో కొంత మందయితే అసలు టీ తాగనిదే ఏ పనినీ ముట్టుకోరు. ఈ దేశం, ఆ దేశం అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీకి అనేక మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచినీళ్ల తర్వాత ఎక్కువ తీసుకునేది టీనేనట. అందుకోసమే టీ మామూలుది కాదు. ఈ టీ మన దేశం […].

By: jyothi

Published Date - Sat - 4 December 21

Tea: మ‌నం రోజూ తాగే టీ ని ఎవ‌రు క‌నిపెట్టారో మీకు తెలుసా..

Tea: టీ. కేవలం ఒకే అక్షరం మాత్రమే ఉన్న ఈ పదానికి చాలా శక్తి ఉంది. టీని తాగడం వలన చాలా మందిలో కొత్తగా ఉత్సాహం ఉరకలేస్తుంది. మనలో కొంత మందయితే అసలు టీ తాగనిదే ఏ పనినీ ముట్టుకోరు. ఈ దేశం, ఆ దేశం అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీకి అనేక మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మంచినీళ్ల తర్వాత ఎక్కువ తీసుకునేది టీనేనట. అందుకోసమే టీ మామూలుది కాదు. ఈ టీ మన దేశం నుంచి చాలా దేశాలకు ఎగుమతి అవుతోంది. అలా మన దేశానికి కోట్లలలో విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తుంది. మన దేశంలోని అసోం, డార్జిలింగ్ ప్రాంతాల్లో పండే టీ ఆకులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వివిధ దేశాలల్లోని టీ కంపెనీలు ప్రత్యేకంగా తమ ప్రతినిధులను ఇండియాకు పంపించి ఇక్కడి టీ ఎస్టేట్ ఓనర్లతో ప్రత్యేకంగా డీల్స్ కుదుర్చుకుంటాయి.

కోటీశ్వరుడు, పేదవాడు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టీని ఎంజాయ్ చేస్తున్నారు. పాత రోజుల్లో కేవలం టీ, కాఫీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కేవలం టీలోనే ఎన్నో రకాల ఫ్లేవర్లు మనకు దర్శనమిస్తున్నాయి. ఏ ఫ్లేవర్ రుచి దానికే హైలెట్. ఇలా టీలో ఉన్న రకరకాల ఫ్లేవర్ల గురించి ఒక్క సారి తెలుసుకుంటే..

అసలు టీని మొదటగా ఎప్పుడు కనుక్కున్నారని చాలా మంది ఆసక్తి ఉంటుంది. కానీ ఈ విషయం ఎవరికీ ఎక్కువ మందికి తెలియదు. కావున లైట్ తీసుకుంటూ ఉంటారు. టీని మొట్టమొదటి సారిగా చైనా చక్రవర్తి షెన్ నంగ్ క్రీస్తుపూర్వం 2737లో కనుక్కొన్నారు. ఒకరోజు షెన్ వేడి నీటిని తాగుతుండగా.. అనుకోకుండా ఒక తేయాకు అందులో పడింది. దాని నుంచి వచ్చిన టేస్ట్ షెన్ కు విపరీతంగా నచ్చింది. అలా టీని మొట్టమొదటి సారి షెన్ నంగ్ రుచి చూశారు. కానీ అప్పటికప్పుడే టీకి గుర్తింపు రాలేదు. రెగ్యులర్ గా టీని తాగేందుకు దాదాపు మూడు వేల సంవత్సరాలు పట్టింది. శతాబ్దాల కాలం పాటు టీని జౌషధంగా వాడే వారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం నాలుగు రకాల టీలు ఉన్నాయి. అవి బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, ఉలాంగ్ టీ. ఇలా వివిధ రకాల పేర్లతో వీటిని పిలుస్తున్నా కానీ ఇవ్వన్నీ తేయాకు మొక్కతోనే తయారవుతాయి. తేయాకు మొక్కని కామెల్లియా సినెన్సిస్ అని పిలుస్తారు. ఆకులను కోసిన సమయం, మరియు ఎండబెట్టి, ప్రాసెస్ చేసిన విధానం బట్టి టీలను అనేక రకాలుగా పిలుస్తారు.

ఇలా ఏప్రిల్ మే నెలల మధ్యన పెరిగిన తేయాకులతో గ్రీన్ టీని తయారు చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ టీకి చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇదే వరల్డ్ బెస్ట్ టీ అన ప్రతీతి. ఇండియాలో టీని పాలు, తేనెతో పాటు యాలకులు, అల్లం, లవంగాలు కూడా వేసి తయారు చేస్తారు. 1908వ సంవత్సరంలో టీ బ్యాగుల తయారీ అమెరికాలో మొదలైంది. మొట్టమొదట థామస్ సల్లివాన్ అనే టీ కంపెనీ తన టీ పౌడర్ ను బ్యాగులలో ప్యాక్ చేసి ప్రజలకు ఇచ్చారు. అలా ప్రజలు ఆ చిన్న టీ బ్యాగులను వేడి నీటిలో ముంచుకుని తాగారు. అలా ఇప్పుడు మనం వాడుతున్న టీ బ్యాగ్స్ పుట్టుకొచ్చాయి.

Tags

Latest News

Related News