Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ Border Security Force (BSF) ఇందులో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఆర్మీకి వెళ్దామని వెళ్లలేకపోయిన వారికి బీఎస్ఎఫ్ లో ఉద్యోగం చేయడం మంచి ఫీల్ ను ఇస్తుంది. ఇప్పుడు బీఎస్ఎఫ్ లో జాబ్స్ పడ్డాయి. అర్హత కూడా 10 వ తరతగతిగానే నిర్ణయించారు. దీంతో చాలా మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఒక వేళ ఈ ఉద్యోగానికి ఎంపికైతే మీ దశ మారుతుంది. మానసిక తృప్తితో పాటు జీతభత్యాలు కూడా మంచిగానే ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 21, 700 రూపాయల నుంచి 69, 100 రూపాయల వరకు జీతం ఇస్తారు. అంతే కాకుండా ఇందులో ఉన్న ఏఎస్ఐ పోస్టుకు గనుక ఎంపికైతే నెలకు 29, 200 రూపాయల నుంచి 92, 300 రూపాయల వరకు అందించనున్నారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును డిసెంబర్ 29 గా నిర్ణయించారు. ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు మరిన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది.
సీవర్ మ్యాన్ కానిస్టేబుల్ పోస్టులు 2, జనరేటర్ ఆపరేటర్ కానిస్టేబుల్ పోస్టులు 24, జనరేటర్ మెకానిక్ కానిస్టేబుల్ పోస్టులు 28, లైన్ మెన్ కానిస్టేబుల్ 11, ఏఎస్ఐ 1, హెచ్ సీ పోస్టులు 6 ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదటగా రాత పరీక్ష ఉంటుంది. తర్వాత మన కేటగిరీని బట్టి అర్హత మార్కులను నిర్ణయిస్తారు. అందులో మనం ఎంపికైతే మన సర్టిఫికెట్లను వెరిఫై చేస్తారు. అనంతరం ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు పాస్ కావాల్సి ఉంటుంది. మనం ఈ అన్ని విషయాల్లో గనుక గట్టెక్కితే మనల్ని ఎంపిక చేస్తారు.
ఇందుకు సంబంధించిన పూర్తి దరఖాస్తు ప్రక్రియ అనేది ఆన్ లైన్ విధానంలో ఉంటుంది. ముందుగా మనం బీఎస్ఎఫ్ వారి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి నోటిఫికేషన్ వివరాలు చదివి.. మనకు సరిపోతుందనకుంటే అందులో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఇందుకోసం అక్కడే ఉన్న అప్లై హియర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. ఆ ఫాంలో అవసరమైన అన్ని డిటేయిల్స్ ను కరెక్ట్ గా ఫిల్ చేయాలి. ఈ పోస్టులకు డిసెంబర్ 29 దాకా దరఖాస్తులను స్వీకరించనున్నారు.