Big Boss-5 69 Episode : బిగ్ బాస్ హౌస్‌లో పదో వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ యమ రంజుగా సాగింది. టాస్క్ ఎవరు కంప్లీట్ చేశారు, ఎవరు ఫెయిల్ అయ్యారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీబీ హోటల్ టాస్క్‌లో భాగంగా ఈరోజు ఎపిసోడ్‌లో సిరి బొక్కల పాయింట్, స్లీవ్ లెస్ టాప్ వేసుకుని బొడ్డు చూపిస్తూ నానా రచ్చ చేసింది. షణ్ముక్ తన సేవకుడు కావడంతో తన వెంటే తిరగాలని రూల్ పెట్టింది. ఈ టాస్క్‌లో సిరి డాన్ కూతుర కావడంతో ఆమె చేసిన ఎక్స్ ట్రాలు మాములుగా లేవు. నడక స్టైల్ కూడా మార్చేసింది సిరమ్మా.. ఇక సన్నీ ఏమో ఆనీ మాస్టర్ పై గుర్రం ఎక్కి ఓ ఆట ఆడాడు.
కాజల్ ప పేడ కవిత చెప్పిన షణ్ముక్..
కాజల్‌పై ఫన్నీ కవిత చెప్పి అందరినీ నవ్విస్తాడు షణ్ముక్.. కానీ కాజల్ అతని గాలి తీసేస్తుంది. ఆ తర్వాత రవి చెప్పిన కథకు ఫిదా అయి అతనికి వంద రూపాయలు ఇస్తుంది కాజల్. దీంతో బీబీ హోటల్ టాస్క్ అయిపోయిందని బిగ్ బాస్ ప్రకటిస్తాడు.
మొదటి కెప్టెన్సీ పోటీదారుగా రవి..
ఈ టాస్క్‌లో గెస్ట్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడంలో హోటల్ స్టాఫ్ ఫెయిల్ కావడంతో గెస్ట్స్ గెలిచినట్టు ప్రకటిస్తారు బిగ్‌బాస్. గెస్ట్స్ టాస్క్‌లో సన్నీ, మానస్, కాజల్, ప్రియాంక, సిరిలు ఉన్నారు. యాంకర్ రవి తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ పూర్తి చేయడంతో తొలి కెప్టెన్సీ పోటీదారుడిగా నిలుస్తాడు. అయితే, టాస్క్‌లో ఓడిపోయిన హోటల్ సిబ్బందిని బిగ్ బాస్ అభినందిస్తారు.
Big Boss-5 69 Episode-1
స్టాఫ్ అంతా ఏకాభిప్రాయంతో గెస్ట్స్ సభ్యుల నుంచి ఇద్దరినీ కెప్టెన్సీ పోటీదారులుగా అనర్హులుగా ప్రకటించే అవకాశమిచ్చారు బిగ్ బాస్. చివరగా కెప్టెన్ ఆనీ మాస్టర్ ప్రియాంక, మానస్‌లను అనర్హులుగా తేల్చగా.. మిగిలిన సభ్యులు రవి, సిరి, సన్నీ, కాజల్‌లు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు.
ఈ వారం వంటగది ఛాంపియన్‌గా ఎవరైనా ఒకరిని ఎంపిక చేయాలని బిగ్‌బాస్ ఆనీ మాస్టర్‌కు చెప్పగా.. షణ్ముఖ్‌ను ఆమె ఎంపిక చేస్తుంది. దీంతో ప్రెస్టేజ్ తరపున రూ.25 వేల గిఫ్ట్ వోచర్‌ను అందించింది. చివరగా ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారికి ఇటుకలతో టవర్స్ కట్టే టాస్క్ ఇచ్చారు. టవర్‌ను కట్టడమే కాకుండా అది కూలిపోకుండా చూసుకోవాలి. మిగతా సభ్యులు బాటిల్లతో వాటిని కూల్చేందుకు యత్నిస్తారు. ఫైనల్‌గా ఎవరి టవర్ కూలకుండా ఉంటుందో అతనే ఈ వీక్ కెప్టెన్ అని ప్రకటిస్తారు బిగ్ బాస్..