Jobs: CISFలో ఉద్యోగాల జాతర.. అప్లికేష‌న్ కు లాస్ట్ డేట్ డిసెంబ‌ర్ 21

Jobs: యూనియర్ పబ్లిక్ సర్వీస్ బుధవారం నాడు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ భర్తీ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలనుకునే వారు ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులకు డిసెంబర్ 21 చివరి తేదీ అని ప్రకటించింది. CISFలో ఇది వరకే అనుభవం ఉన్న అభ్యర్థులకు మాత్రమే […].

By: jyothi

Published Date - Sat - 4 December 21

Jobs: CISFలో ఉద్యోగాల జాతర.. అప్లికేష‌న్ కు లాస్ట్ డేట్ డిసెంబ‌ర్ 21

Jobs: యూనియర్ పబ్లిక్ సర్వీస్ బుధవారం నాడు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ భర్తీ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలనుకునే వారు ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులకు డిసెంబర్ 21 చివరి తేదీ అని ప్రకటించింది. CISFలో ఇది వరకే అనుభవం ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈ పోస్టులను కేటాయించారు. ఈ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అసలు వయో పరిమితి, అర్హత ఎలా ఉంటుందనే విషయాలను గనుక ఒక్కసారి గమనిస్తే..

CISFలో 19 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూస్తోంది. ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా ఈ జాబులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 2022 జనవరి 1 నాటికి CISF సబ్ ర్యాంకులో కనీసం నాలుగు సంవత్సరాల రెగ్యులర్ సర్వీసును పూర్తి చేసి ఉండాలి. మరియు అపాయింట్ మెంట్ లెటర్ వచ్చే వరకు సర్వీసులో క్లీన్ రికార్డును కలిగి ఉండాలి. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని చూసే వారు గమనించాల్సిన మరో విషయం ఏజ్ లిమిట్. ప్రతి ఉద్యోగానికి ఏజ్ లిమిట్ అనేది చాలా ముఖ్యం. ఇక ఈ ఉద్యోగం విషయానికి వస్తే ఆగస్టు 1 నాటికి 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అంటే ఆగస్టు 2 1987 తర్వాతే జన్మించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కోసం ఐదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపును ఇచ్చారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఎలా అప్లై చేయాలనే విషయాలను గమనిస్తే…

యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. మీకు హోమ్ పేజిలోనే CISF AC రిక్రూట్ మెంట్ 2021 అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఆ లింక్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక ఆ పేజీలో వారు అడిగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అలా దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లిస్తే సరిపోతుంది. ఫ్యూచర్ అవసరాల కోసం దరఖాస్తు ఫామ్ ను డౌన్ లోడ్ చేసి భద్రపర్చుకోవాలి. అవసరమయితే ప్రింటవుట్ కూడా తీయించుకోండి. ఇలా విజయవంతగా మీ దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత ప్రింటవుట్ లెటర్ లేదా హార్డ్ కాపీని సీఐఎస్ఎఫ్ అధికారులకు పంపాలి.

Tags

Latest News

Related News