Devatha 26 Oct Today Episode : ఆఫీసర్ సారుకు రాధ ఫోన్.. రావొద్దంటూ రిక్వెస్ట్.. చివ‌ర‌కు

Devatha 26 Oct Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న దేవత సీరియల్‌కు ఆడియన్స్ ఎక్కువే ఉన్నారు. చాలా మందికి ఇది ఫేవరెట్ సీరియల్‌గా మారింది. సుహాసిని ఇందులో లీడ్ రోల్‌లో యాక్ట్ చేస్తుంది. ఇక ఈ సీరియల్ కు సంబంధించి ఈ రోజు (అక్టోబర్ 26)న ఏం టెలికాస్ట్ అవుతుందో చూసేద్దామా.. దేవిని, చిన్మయిని తీసుకుని మాధవ్ వద్దకు వెళ్తుంది రాధ.. పిల్లలకు స్కూల్‌లో సైకిల్ పోటీలు పెడుతున్నారు. నేను.. మీరు ఇద్దరం […].

By: jyothi

Published Date - Tue - 26 October 21

Devatha 26 Oct Today Episode : ఆఫీసర్ సారుకు రాధ ఫోన్.. రావొద్దంటూ రిక్వెస్ట్.. చివ‌ర‌కు

Devatha 26 Oct Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న దేవత సీరియల్‌కు ఆడియన్స్ ఎక్కువే ఉన్నారు. చాలా మందికి ఇది ఫేవరెట్ సీరియల్‌గా మారింది. సుహాసిని ఇందులో లీడ్ రోల్‌లో యాక్ట్ చేస్తుంది. ఇక ఈ సీరియల్ కు సంబంధించి ఈ రోజు (అక్టోబర్ 26)న ఏం టెలికాస్ట్ అవుతుందో చూసేద్దామా..

దేవిని, చిన్మయిని తీసుకుని మాధవ్ వద్దకు వెళ్తుంది రాధ.. పిల్లలకు స్కూల్‌లో సైకిల్ పోటీలు పెడుతున్నారు. నేను.. మీరు ఇద్దరం కలిసి స్కూల్ కి పోవాలంటూ చెబుతుంది రాధ.. ఆఫీసర్.. సారును పిలిచారా అంటూ మాధవ్ అడుగుతాడు. పిలిచాము.. వస్తానని సార్ మాటిచ్చారు అని దేవి ఆన్సర్ ఇస్తుంది. వారికి కావాల్సిన ఆఫీసర్ వస్తున్నారు కదా.. మరి నాతో ఇంకేం పని అని మాధవ్ అనడంతో.. అందరి ఫ్రెండ్స్ వాళ్ల అమ్మా నాన్నలు వస్తారు.

నువ్వు, నాయన కూడా రావాలని రాధను దేవి కోరుతుంది. అనంతరం మాధవ్ దగ్గరకు వెళ్లిన రాధ.. ఆఫీసర్ సార్‌ను పిలిచారని నాకు తెలియదు. అయినా ఆ సార్ వస్తుండని మీరు రాకుంటే ఎలా.. అది మంచిగ ఉండదు అని అని రాధ చెబుతుంది. ఆయన వస్తే నేను రాను అంటూ కాస్త సీరియస్ గానే చెబుతాడు మాధవ్. సరే ఆ ఆఫీసర్ రాడు.. కొంచెం మీ ఫోన్ ఇయ్యండి అంటూ రాధ ఫోన్ తీసుకుని ఆదిత్యకు కాల్ చేస్తుంది.

Devatha 26 Oct Today Episode

Devatha 26 Oct Today Episode

అప్పుడే బట్టలు సర్దుతున్న సత్య.. వెనకున్న ఆదిత్య మీద పడిపోతుంది. సత్య చేయి ఫోన్‌కు తాగి కాల్ లిఫ్ట్ అవుతుంది. ఇక రాధ ఫోన్ లోనే ఆఫీసర్ సారు.. హలో.. హలో.. అని అంటూనే ఉంటుంది. తర్వాత ఆదిత్య పక్కకి తప్పుకుంటాడు. ఏంటిది.. నేను నీ భార్యను.. కనీసం నన్ను టచ్ చేయడానికి కూడా ఒప్పుకోవా.. ఎందుకలా చేస్తున్నావు? అంటూ ప్రశ్నిస్తుంది.

మా అక్క అంటే నీను ప్రాణం అని అంటావ్.. మరి నన్ను నీకిచ్చి పెళ్లి చేసింది మా అక్కేగా.. అయిన ఎందుకు దూరంగా పెడుతున్నావంటూ ఆదిత్యను సత్య ప్రశ్నిస్తుంది. మీ అక్క నిన్ను కాను ఇచ్చి.. నా మనసును తనతోనే తీసుకెళ్లింది. నా మనసులో నీకెలా చోటివ్వాలి అని బదిలివ్వగానే సత్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే టైంలో ఫోన్ చూసిన ఆదిత్య.. హలో అంటాడు. నేను రాధను సార్… స్కూల్‌కి వస్తున్నారా.. ప్లీజ్ రాకండి అంటూ ఫోన్ పెట్టేస్తుంది.

సీన్ కట్ చేస్తే.. ఆదిత్య నన్ను పట్టించుకోవడం లేదంటూ తన ఆంటికి ఏడుస్తూ చెబుతుంది సత్య. ఇక వారంతా ఆదిత్యకు ఎదో నచ్చజెప్పేందుకు ట్రై చేస్తారు. అందరూ పట్టుబట్టడంతో ఆదిత్య.. సత్యకు భోజనం తినిపిస్తాడు.

Tags

Related News