Fact: ఇండియాలో కొన్ని నమ్మకాలను ప్రజలు బలంగా విశ్వసిస్తుంటారు. వీటిలో కొన్ని నమ్మకాలు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని మిస్టరీగా ఉంటాయి. ఎందుకో కారణం తెలియకుండానే ఇప్పటికీ కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అంతేకాదు పెద్దవాళ్లు చెప్పిన విషయాలు కావడంతో పాటించకపోతే ఏమవుతుందో అన్న భయంతో వాటిని ఫాలో అయిపోతుంటారు. వీటిలో గుమ్మానికి నిమ్మకాయలు కట్టే విషయం కూడా ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఇప్పటికీ గుమ్మాలకు నిమ్మకాయలు, మిర్చి కనిపిస్తుంటాయి.
నిమ్మకాయలు, పచ్చి మిరపకాయలను కలిపి ఒక దారంతో కట్టి ఇంటి ముందర, షాప్ ముందర గుమ్మానికి వేలాడతీయడం మనం చాలా చోట్ల చూసే ఉంటాం ఎక్కువగా గ్రామాలలో ఈ సీన్ కనిపిస్తుంటుంది. అయితే గుమ్మాలకు నిమ్మకాయలు, మిర్చి కట్టడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. నిమ్మకాయలు, మిరపకాయలు కట్టడం వల్ల ఇంటికి ఎలాంటి చెడు దృష్టి తగలదట. అంతేకాకుండా ఎలాంటి ఆత్మలు, ప్రేతాత్మలు ఇంట్లోకి చేరే అవకాశం ఉండదట.
Fact Behind Hanging Lemon Chill on Entrance
అయితే నిజానికి గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలు కట్టడానికి అసలు కారణాలు ఇవి కాదట. పూర్వం మన పెద్దవాళ్లు మట్టి నేలలపై నివసించేవాళ్లు. రాత్రి సమయంలో కరెంటు లేకపోవటం వల్ల ఎన్నో క్రిమికీటకాలు ఇంటిలోకి వచ్చేవి. అయితే ఈ క్రిమికీటకాల నుంచి రక్షణ పొందడానికి నిమ్మకాయలు, మిరపకాయలను సూదితో గుచ్చడం వల్ల అందులో ఉన్న విటమిన్స్, నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ వాసనలు బయటకు వెదజల్లడం వల్ల ఎలాంటి క్రిమికీటకాలు దరిచేరేవి కాదట. అందుకే పూర్వకాలంలో ఇంటి గుమ్మానికి పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలను దారంతో వ్రేలాడ తీసేవారు. అది ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది.