• Telugu News
  • health

Fasting-Weight Loss : ఉపవాసాలు ఎన్ని రకాలు?.. బరువు తగ్గటానికి ఏది బెస్ట్?..

Fasting-Weight Loss : ఒళ్లు బరువు తగ్గించుకోవాలనుకుంటున్నవారు రకరకాల పద్ధతులను ఫాలో అవుతుంటారు. ఎక్కువ మంది అనుసరించేది మాత్రం ‘నామ మాత్రపు ఉపవాసం’. ఈ పద్ధతి.. పేరుకు తగ్గట్లే ఉంటుంది. అసలు ఫాస్టింగ్ చేసినట్లే అనిపించదు. అందుకే ఇది పాపులర్ ట్రెండ్ అయింది. సెలెబ్రిటీలు ప్రాక్టీస్ చేసేది కూడా ఈ డైట్ ఎక్సర్ సైజ్ నే. మీరూ ఈ ఆప్షన్ నే పాటించాలనుకుంటున్నారా. అయితే వివరాలు చదవండి.. అసలేంటిది?.. ‘నామ మాత్రపు ఉపవాసం’ అనే ప్యాటర్న్ లో […].

By: jyothi

Updated On - Tue - 30 March 21

Fasting-Weight Loss : ఉపవాసాలు ఎన్ని రకాలు?.. బరువు తగ్గటానికి ఏది బెస్ట్?..

Fasting-Weight Loss : ఒళ్లు బరువు తగ్గించుకోవాలనుకుంటున్నవారు రకరకాల పద్ధతులను ఫాలో అవుతుంటారు. ఎక్కువ మంది అనుసరించేది మాత్రం ‘నామ మాత్రపు ఉపవాసం’. ఈ పద్ధతి.. పేరుకు తగ్గట్లే ఉంటుంది. అసలు ఫాస్టింగ్ చేసినట్లే అనిపించదు. అందుకే ఇది పాపులర్ ట్రెండ్ అయింది. సెలెబ్రిటీలు ప్రాక్టీస్ చేసేది కూడా ఈ డైట్ ఎక్సర్ సైజ్ నే. మీరూ ఈ ఆప్షన్ నే పాటించాలనుకుంటున్నారా. అయితే వివరాలు చదవండి..

అసలేంటిది?..

‘నామ మాత్రపు ఉపవాసం’ అనే ప్యాటర్న్ లో ఈటింగ్, ఫాస్టింగ్ రెండూ ఉంటాయి. ప్రత్యేకంగా డైట్ చార్ట్ అంటూ ఏమీ ఉండదు. ఒక టైమ్ సెట్ చేసుకొని ఆ వ్యవధిలో మాత్రమే ఫుడ్ తీసుకోవటం అన్నమాట. ఉదాహరణకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 6 గంటల మధ్యే తిండి తినాలని ఫిక్సయితే ఇక దాన్నే కంటిన్యూ చేయాలి. ఈ మధ్యలో మూడు సార్లు భోజనం చేయొచ్చు. ఉదయం 11 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి, సాయంత్రం 6 గంటలకు మూడోసారి మీల్స్ తీసుకోవచ్చు.

Fasting-Weight Loss : which fasting method is the best option for weight loss

Fasting-Weight Loss : which fasting method is the best option for weight loss

ఆ తర్వాత ముద్దయినా: Fasting-Weight Loss

సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి తర్వాతి రోజు ఉదయం 11 గంటల మధ్యలో ముద్ద కూడా ముట్టకూడదు. నీళ్లు, బ్లాక్ టీ, కాఫీ లాంటివి మాత్రం ఎన్ని సార్లయినా తాగొచ్చు. పాల పదార్థాలు గానీ షుగర్ గానీ తినొద్దు. ఇంత సేపు ఏమీ తినకుండా ఉండలేం అనుకుంటే ఈ పీరియడ్ ని పొడిగించుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పెంచుకోవచ్చు. మధ్యలో మూడు సార్లు తినొచ్చు. అలవాటైన తర్వాత దీన్ని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి తగ్గించుకోవచ్చు. ఇది కామన్ కాన్సెప్ట్.

మరిన్ని విండోలు..

శారీరక బరువు తగ్గించుకోవటానికి ‘నామ మాత్రపు ఉపవాసం’తోపాటు మరిన్ని ప్యాటర్న్స్(విండోస్) ఉన్నాయి. అందులో ఒకటోది.. 16/8. రెండోది.. 5:2. మూడోది.. ఈట్-స్టాప్-ఈట్. నాలుగోది.. ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. 16/8 పద్ధతిలో రోజులో 14-16 గంటల పాటు ఫాస్టింగ్ ఉండటం, ఈటింగ్ సైకిల్ ని 8-10 గంటల వ్యవధిలో పరిమితం చేసుకోవటం వంటివి ఉంటాయి. 5:2 పద్ధతి కాస్త కష్టంగా ఉంటుంది. ఇది కేలరీల వాడకం మీద ఆధారపడి ఉంటుంది. వారంలో రెండు సార్లు రోజు విడిచి రోజు 500-600 కేలరీల శక్తిని వినియోగించుకోవటం. మిగతా రోజుల్లో నార్మల్ డైటే. ఈట్-స్టాప్-ఈట్ పద్ధతిలో వారంలో ఒక సారి లేదా రెండు సార్లు 24 గంటల పాటు ఉపవాసం ఉంటారు. ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ పద్ధతిలో రోజు విడిచి రోజు ఫాస్టింగ్ చేయటం. ప్రొసీజర్ ఏదైనా ఎక్కువ కాలం స్థిరంగా ఫాలో కావటం ముఖ్యం. అప్పుడు మాత్రమే ఫలితాలు కనిపిస్తాయి.

Latest News

Related News