Great History : జ్వరాలయాలు అంటే ఫివర్ హాస్పిటల్స్. అప్పట్లో అలాగే అనేవారు. అప్పట్లో అంటే ఏకంగా 1,700 ఏళ్ల కిందటి మాట. నేటి రెండు తెలుగు రాష్ట్రాలను (తెలంగాణ, ఏపీలను) ఆ రోజుల్లో ఆంధ్ర దేశం అని పిలిచేవారు. ఇక్ష్వాకులు పాలించేవాళ్లు. నాటి రాజులు ప్రజల కోసం ఎక్స్ క్లూజివ్ ఫివర్ హాస్పిటల్స్ నిర్మించారు. ఆ ఆసుపత్రుల్లో కొన్ని ప్రత్యేక రోగాలకు వైద్యం అందించేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండేవాళ్లు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫిమేల్ నర్సుల్ని నియమించాల్సిందే అనే రూలు అప్పట్లోనే అమల్లో ఉండేది. ఇప్పుడంటే నర్సులకు అరకొర వేతనాలిస్తున్నారు గానీ ఆ రోజుల్లో మంచి శాలరీలు ఇవ్వటం విశేషం.
క్రీస్తు పూర్వం 3-4వ శతాబ్దం నాటి మన ఆంధ్ర దేశ ఘన వైద్య చరిత్ర లేటెస్టుగా వెలుగు చూసింది. హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ సంస్థ (ఎన్సీఐఎంహెచ్) ఈ చారిత్రక విషయాల్ని లోతుగా పరిశోధించి, విశ్లేషించి వెల్లడించింది. ఫణిగిరి ప్రాంతంలో దొరికిన శాసనాలను అధ్యయనం చేయగా ఈ విలువైన అంశాలు లభించాయి. అప్పట్లో ఆంధ్ర రాజ్యంలో ప్రజలకు గొప్ప వైద్య సేవలందించిన ఒక గ్రేట్ చీఫ్ ఫిజీషియన్ గురించిన సంగతులూ తెలిశాయి. ఆ రోజుల్లో వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్లో ఎన్సీఐఎంహెచ్ ఇన్ఛార్జ్ డాక్టర్ జీపీ ప్రసాద్ వివరించారు.
Great-history-great-medical-history-of-telugu-states-1700-years-back
అప్పట్లో జ్వరం వచ్చిందంటే జనం గడగడలాడేవారు. ప్రాణాపాయం లాగా భయపడేవారు. దానికి సరైన చికిత్స, బలమైన ఆహారం, ఇతర జాగ్రత్తలు తీసుకునేందుకు నాగార్జునకొండ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఫివర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. దాన్ని ‘జ్వరాలయ’ అని పిలిచేవారు. విశాలంగా నిర్మించిన ఆ హాస్పిటల్ లో అన్ని సౌకర్యాలూ ఉండేవి. సెంటర్ లో పెద్ద హాల్, దాని చుట్టూ రూములు ఉండేవి. ఓపెన్ కోర్టు, వరండాలు, వాటిలోకి స్పెషల్ ఎంట్రీ మార్గాలు ఉండేవి. పరిశుభ్రత కోసం డ్రైనేజీ, యూరినల్స్, లేవటరీస్, సెప్టిక్ ట్యాంకులు.. ఇలా అన్నీ అందుబాటులో ఉండేవి. ఆ హాస్పిటల్ బిల్డింగ్ కు సంబంధించిన ఒక పాత ఫొటోను పైన చూడొచ్చు. ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యం అందించేవారు. శస్త్ర చికిత్సలు (ఆపరేషన్లు) కూడా చేసేవారు. వీటికోసం ఎక్స్ పర్ట్స్ సైతం ఉండేవారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 1,700 ఏళ్ల కిందటి వైద్య సదుపాయాల గురించి తెలుసుకోవటం ఎంతైనా ఆసక్తికరం.