Havells Company : హ్యావెల్స్ కంపెనీ.. ఇండియా మార్కెట్ లోకి కొత్త కొత్త ప్రొడక్టులను ప్రవేశపెడుతోంది. ఈ సంస్థ లేటెస్టుగా సీలింగ్ ఫ్యాన్ కమ్ ఎయిర్ ప్యూరిఫయర్ ని లాంఛ్ చేసింది. ఇది చూడటానికి ఒక్క పరికరమే కానీ రెండు పనులు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫ్యాన్ తో పాటు త్రి-స్టేజ్ ఎయిర్ ప్యూరిఫయర్ కూడా ఉంటుంది కాబట్టి. ఈ ‘టూ ఇన్ వన్’ ఎక్విప్మెంట్ మనం పీల్చే గాల్లోని పీఎం 2.5 మరియు పీఎం 10 కాలుష్యకాలను ఫిల్టర్ చేస్తుంది. గాల్లోని కాలుష్యం స్థాయిని పీఎం (పర్టిక్యులేట్ మ్యాటర్) అనే ప్రమాణాల్లో కొలుస్తారు.
Havells Company : newly designed two in one devise
‘స్టీల్త్ ప్యూరో ఎయిర్’గా పిలుచుకునే ఈ సరికొత్త ఉపకరణం ఖరీదు రూ.15,000. ఇందులో భాగంగా హెపా ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్, ప్రి-ఫిల్టర్ అనే మూడు వస్తువులు ఇస్తారు. ఈ ప్రి-ఫిల్టర్.. గాల్లోని విషపూరిత ధూళి కణాల్ని సైతం పీల్చేస్తుందని హ్యవెల్స్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీంతోపాటు రిమోట్ కంట్రోల్ ఆపరేషన్, అండర్ లైట్, ఎల్ఈడీ ఎయిర్ ప్యూరిఫై ఇండికేటర్ వంటి స్మార్ట్ ఫీచర్స్ కూడా పొందొచ్చు. నూతనంగా రూపొందించిన ఈ సీలింగ్ ఫ్యాన్.. గంటకు సుమారు 130 క్యూబిక్ మీటర్ల ‘‘క్లీన్ ఎయిర్ డెలివరీ రేట్’ (సీఏడీఆర్) కెపాసిటీని కలిగి ఉంది.
డబుల్ యాక్షన్ సీలింగ్ ఫ్యాన్ తో పాటు హ్యావెల్స్ కంపెనీ.. ఫ్యాన్ మేట్ అనే లైఫ్ స్టయిల్ ఫ్యాన్ ని కూడా ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కార్బన్ ఫిల్టర్స్, 3 గంటల వరకు బ్యాకప్ కలిగిన బ్యాటరీ, లెదర్ హ్యాండిల్, ప్రీమియం శాటిన్ మ్యాటే ఇస్తారు. ఈ డివైజ్.. గదిలోని కంపు వాసనను క్షణాల్లో తొలగిస్తుంది. ఈ ఫ్యాన్ లో ఎయిర్ వెంట్ ఉంటుంది. దీని సాయంతో గాలిని మనకి కావాల్సిన దిశలోకి తిప్పుకోవచ్చు. మొబైల్ చార్జింగ్ కోసం వాడే యూఎస్బీ కేబుల్ తో దీనికి ఛార్జింగ్ పెట్టొచ్చు.
స్టీల్త్ ప్యూరో ఎయిర్, ఫ్యాన్ మేట్ లతో పాటు హ్యావెల్స్ కంపెనీ.. ఫ్యాన్ కేటగిరీలో మరో 16 నూతన నిత్యావసర వస్తువులని మార్కెట్ లోకి తెచ్చింది. అవి.. 1. ట్రెండీ హెచ్ఎస్ 2. ఎన్ఎస్ పెడెస్టన్ ఫ్యాన్ 3. యాంటీ-స్టాన్ ఎగ్జాస్టివ్ ఫ్యాన్ 4. ప్రీమియం సీలింగ్ ఫ్యాన్ 5. మైలర్ సీలింగ్ ఫ్యాన్ 6. యాంటిలియా నియో ఫ్యాన్ 7. ఆస్టురా సీలింగ్ ఫ్యాన్ 8. ట్రినిటీ లాట్ సీలింగ్ ఫ్యాన్ 9. స్టీల్త్ ఎయిర్ బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్ 10. ఎంటిసెర్ బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్ 11. ఫ్లొరెన్స్ అండర్ లైట్ సీలింగ్ ఫ్యాన్ 12. ఎక్స్ పీ జెట్ 400 సీలింగ్ ఫ్యాన్ 13. గిరిక్ వాల్ ఫ్యాన్ 14. ఎఫిసియెన్సియా ప్రైమ్ 15. ప్రొ అండ్ నియో సీలింగ్ ఫ్యాన్ రేంజ్ 16. సీలింగ్ ఫ్యాన్.