health tips to weight gain :మనిషి జన్మ చాలా చిత్రమైనది. మన చుట్టు ఉన్న వారిలో రకరకాల వారు ఉన్నారు. చిత్ర విచిత్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వారు మన చుట్టు ఉన్నారు. కొందరు అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటే.. మరొకరు ఎంత తిన్నా బరువు పెరగకుండా స్కెలటన్ లా ఉన్నాను అంటూ బాధపడుతూ ఉంటారు. వయసుకు తగ్గట్లుగా బరువు లేకపోతే అంద వికారంగా ఉంటారు. తగ్గట్లుగా బరువు ఉన్న వారు మాత్రమే ఆరోగ్యవంతులు గా భావించవచ్చు. బరువు తక్కువ ఉంటే వారిలో ఏదో అనారోగ్య సమస్య ఉందనే భావన అందరిలో ఉంటుంది. కొందరు బరువు పెరిగేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేని అలవాట్లను చేసుకోవడం మొదలుకుని కడుపు పగిలి పోయేంతగా తింటూ ఉంటారు. అలాంటి వారు ఎంత చేసినా కూడా బరువు మాత్రం పెరగరు. వారి కోసం నిపుణులు కొన్ని సలహా లు ఇస్తున్నారు. ఆ సలహాలను పాటిస్తూ ఆహారపు అలవాట్లను చేసుకుంటే ఖచ్చితంగా మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు. బరువు పెరగడం కోసం చేసే ప్రయత్నాల్లో కాస్త నిపుణుల సూచనలు పాటిస్తే పెరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంది.
health tips to weight gain
బరువు తక్కువ ఉన్నారు అంటే వారు సరిగా తినడం లేదని అర్థం. సమయానికి ఆకలి కాని వారు వేల కాని వేలలో తినడం లేదా అసలు తినక పోవడం చేస్తారు. అలా చేయడం వల్ల బరువు పెరగక పోగా మరింతగా తగ్గే అవకాశం ఉంది. అందుకే సమయానికి ఆకలి అయ్యేలా.. శరీరంలో జీర్ణ వ్యవస్థ పనితనం మెరుగు పడేలా అల్లం మరియు శొంఠి వంటి పదార్థాలను ఉపయోగించాలి. వీటిని రోజు ఆహారంలోకి తీసుకోవడం వల్ల వెంటనే జీర్ణం అవ్వడంతో పాటు ఆ తర్వాత మళ్లీ ఆకలి వేస్తుంది. అల్లం రసం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. అలాగే మెటబాలిజం అద్బుతంగా పని చేస్తుంది.
రాత్రి సమయంలో అన్నంలో వేడి చేసిన పాలను గోరు వెచ్చగా చేసి పోయాలి. అందులో కొద్దిగా పెరుగు తోడుగా వేయాలి. ఉదయానికి ఆ అన్నం కాస్త పెరుగన్నంగా మారుతుంది. అందులో అల్లం రసం మరియు శొంఠి లైట్ గా వేయడం ద్వారా ఈజీగా జీర్ణం అవుతుంది. ప్రతి రోజు ఉదయం ఈ పెరుగన్నం తినడం వల్ల 30 నుండి 45 రోజుల్లో బరువులో తేడా కనిపిస్తుంది. ఈజీగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలు తినడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. పెరుగన్నం చాలా సులభంగా జీర్ణం అవుతుంది.
health tips to weight gain
బరువు పెరిగేందుకు డ్రై ఫ్రూట్స్ ను కూడా అధికంగా తీసుకోవాలి. రెగ్యులర్ గా వాటిని తినడం ఇబ్బంది అనిపిస్తే మనకు మార్కెట్ లో బాదం.. పిస్తా, జీడిపప్పు, దూలగొండి విత్తనాలు, జాపత్రి, అశ్వగంథ, నేలగుమ్మడి, పిల్లిపీచర వేళ్లు, సుగంధిపాలు సమ పాళ్లలో కలిపి మిక్సీ చేయాలి. మెత్తటి పొడిగా చేసి ఒక పొడి డబ్బాలో భద్రపర్చుకుని ప్రతి రోజు కనీసం 200 నుండి 300 ఎంఎల్ పాలల్లో వేసుకుని తాగడం వల్ల నెల రోజుల్లోనే బరువులో మార్పు కనిపిస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా సూచిస్తున్నారు.
ప్రతి రోజు కోడి గుడ్డును ఆహారంలోకి తీసుకోవడంతో పాటు పలు రకాల పండ్లు మరియు మాంసం ను కూడా తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుండటంతో పాటు బరువు పెరుగుతారు. ప్రతి రోజు కూడా నాలుగు లేదా అయిదు సార్లు తింటూ ఉండాలి. జీర్ణ వ్యవస్థ లో ఎలాంటి మార్పులు రాకుండా ఎప్పుడు కూడా ఆరోగ్యవంతమైన పదార్థాలను తింటూ బరువు పెరగవచ్చు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పద్దతులను పాటిస్తారని ఆశిస్తున్నాం.