Love Affair : గత కొన్నేండ్లుగా డేటింగ్ లోఉన్న స్టార్ జంట నయనతార-విఘ్నేశ్ శివన్ లు ఎట్టకేలకు పెండ్లి చేసుకున్నారు అయితే వీరిద్దరిలో తో తేడా ఉంది. అదేంటంటే.. నయనతార తన ప్రియుడు విఘ్నేశ్ కంటే 11నెలలు పెద్దది. కానీ ప్రేమ వారిద్దరినీ ఒక్కటి చేసింది. వీరిద్దరి లాగే వయసులో తమకంటే చిన్న వారిలో లవ్ ఎఫైర్లు పెట్టుకుని పెండ్లి చేసుకున్న స్టార్ కపుల్స్ గురించి తెలుసుకుందాం.
ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి. కుర్రాళ్ల కలల రాణిగా ఉన్న ఆమె.. తనకంటే రెండేండ్లు చిన్న వాడైన అభిషేక్ బచ్చన్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది.
ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మమేశ్ బాబు కూడా తన కంటే రెండున్నరేండ్లు పెద్దదైన నమ్రతను పెండ్లి చేసుకున్నాడు. నమ్రత తనకంటే చిన్నోడైన మహేశ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకుని సీక్రెట్ గాపెండ్లి చేసుకుంది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Heroines Love Affair with People Younger Age
ఇక గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా విషయానికి వస్తే ఏకంగా తనకంటే వయసులో 11ఏళ్లు చిన్నోడైన నిక్ జోనస్ తో లవ్ ఎఫైర్ పెట్టుకుని చివరకు పెండ్లి కూడా చేసుకుంది. వీరిద్దరికీ రీసెంట్ గా సరోగసి ద్వారా ఓ బిడ్డ కూడా పుట్టింది.
ఇక నేషనల్ స్టార్ కపుల్ అయిన అనుష్క శర్మ – విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకంటే 6నెలలు చిన్నవాడైన విరాట్ కోహ్లీని అనుష్క ప్రేమించి కొన్నేండ్లు డేటింగ్ చేసింది. చివరకు ఈ ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక పాప ఉంది. ఇలా స్టార్లు తమకంటే చిన్నవాడితో లవ్ ఎఫైర్లు పెట్టుకుని పెండ్లి చేసుకున్నారు.