Hindu vs Muslim : నాన్ హిందూస్.. నాట్ అలౌడ్..

Hindu vs Muslim : హిందూ ముస్లిం భాయి భాయి అనే స్ఫూర్తి మన దేశంలో అప్పుడప్పుడూ కొన్ని చోట్ల కొరవడుతోంది. దీనికి తాజా ఉదాహరణ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోని 150కి పైగా గుళ్లల్లో రెండు రోజుల కిందట ‘‘నాన్ హిందూస్.. నాట్ అలౌడ్’’ అనే నినాదం రాసి ఉన్న బ్యానర్లు వెలిశాయి. ‘‘హిందూ యేతరులకు ఇందులోకి ప్రవేశం లేదు’’ అనేది దీనర్థం. హిందూ యువ వాహిణి అనే సంస్థ […].

By: jyothi

Updated On - Tue - 30 March 21

Hindu vs Muslim : నాన్ హిందూస్.. నాట్ అలౌడ్..

Hindu vs Muslim : హిందూ ముస్లిం భాయి భాయి అనే స్ఫూర్తి మన దేశంలో అప్పుడప్పుడూ కొన్ని చోట్ల కొరవడుతోంది. దీనికి తాజా ఉదాహరణ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోని 150కి పైగా గుళ్లల్లో రెండు రోజుల కిందట ‘‘నాన్ హిందూస్.. నాట్ అలౌడ్’’ అనే నినాదం రాసి ఉన్న బ్యానర్లు వెలిశాయి. ‘‘హిందూ యేతరులకు ఇందులోకి ప్రవేశం లేదు’’ అనేది దీనర్థం. హిందూ యువ వాహిణి అనే సంస్థ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధానిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో కూడా ఇలాంటి ప్రచారమే, నిషేధమే అమలుచేయబోతున్నామని వాళ్లు తేల్చిచెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్ర రాజధానిలోని చక్రతా రోడ్డు, సుద్ధోవాలా, ప్రేమ్ నగర్ తదితర ప్రాంతాల్లోని టెంపుల్స్ లో ఈ బ్యానర్లు ఏర్పాటు చేశారు.

ఎందుకిలా?..

ఉత్తరప్రదేశ్ లోని దస్నా అనే ప్రాంతంలో ఇటీవల ఒక ముస్లిం బాలుడు దస్నా దేవి ఆలయంలో ట్యాప్ వాటర్ తాగినందుకు అతనిపై దాడి జరిగింది. ముస్లింలు ఈ గుడిలోకి రావొద్దనే బోర్డు ఆ ఆలయంలో ఉన్నప్పటికీ అతను ప్రవేశించటం వల్లే కొంత మంది కోపంతో ఈ పని చేసి ఉంటారని అంటున్నారు. ఆ కోవెల ప్రధాన పూజారి యతి నరసింహానంద్ సరస్వతి ఆదేశాల మేరకే ఆ బోర్డు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో ఇలాంటివి మరిన్ని జరక్కుండా ఆపటానికే ఉత్తరాఖండ్ లో హిందూ యువ వాహిణి వాళ్లు గుళ్లల్లోకి ముస్లింలను రానీయం అని పేర్కొంటూ బ్యానర్లు కడుతున్నారని చెబుతున్నారు.

Hindu vs Muslim : latest hindhu-muslim clash

Hindu vs Muslim : latest hindhu-muslim clash

సరస్వతికి సపోర్ట్ గా: Hindu vs Muslim

పూజారి యతి నరసింహానంద్ సరస్వతికి మద్దతుగానే తాము ఈ బ్యానర్లు ఏర్పాటుచేస్తున్నామని హిందూ యువ వాహిణి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీతు రంధవ స్పష్టం చేశారు. కాగా.. దస్నా దేవి ఆలయాన్ని తమ పూర్వీకులు కట్టించారని, అందులోకి హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించటాన్ని తాను అస్సలు ఒప్పుకోనని ధౌలానా నియోజకవర్గ ఎమ్మెల్యే అస్లం చౌదరి(బీఎస్పీ) అన్నారు. నాన్ హిందూస్ ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్న ఆ పోస్టర్లను తొలగిస్తానని కూడా చెప్పారు. అయితే తాము అస్లాంకి కౌంటర్ గా ఉత్తరాఖండ్ లోని ప్రతి హిందూ ఆలయం వెలుపల ఈ బ్యానర్లు కడుతున్నామని జీతూ రంధవ అనటం గమనార్హం. తన వాదనను ఆయన మరింత సమర్థించుకున్నారు. గుడి అనేది సనాతన ధర్మాన్ని పాటించేవారికి మాత్రమేనని, ఆ మత విశ్వాసం కలిగినవాళ్లనే అందులోకి అనుమతిస్తామని తేల్చిచెప్పారు. ఏదిఏమైనప్పటికీ ఫలానా ప్రార్థనా మందిరంలోకి ఫలానా వాళ్లను మాత్రమే రానిస్తామనటం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రావటం, రాకపోవటం వాళ్లిష్టమని, ఎవరినీ అడ్డుకోకూడదని హిందూ భక్తులు హితవు పలుకుతున్నారు. ఉత్తరాఖండ్ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ లోని భాగమే. తర్వాత వివిధ రాజకీయ, సామాజిక కారణాల వల్ల ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయింది.

Latest News

Related News