Intelligence : మీ తెలివి ఏవిధంగా తెల్లారుతోంది?..

Intelligence : తెలివి తక్కువ పని చేసినప్పుడు తిట్టడానికి పెద్దోళ్లు ఎక్కువగా ఈ మాట వాడతారు. వాళ్లతో అలా క్లాస్ పీకించుకోవద్దు అనుకుంటే మీలో నిజంగా ఏ తెలివి తేటలు ఉన్నాయో తెలుసుకోవటం ముఖ్యం. మనిషికి ముఖ్యంగా ఎనిమిది రకాల తెలివి తేటలు ఉంటాయట. కాబట్టి ఎవరు ఏ ఇంటలిజెన్స్ లో స్ట్రాంగో చూద్దాం.. విజువల్/స్పేసియల్: చుట్టుపక్కల జరిగే సంఘటనలను మల్టిపుల్ డైరెక్షన్ లో చూడగలగటం. ఈ సామర్థ్యం ఉన్నవాళ్లల్లో మ్యాప్, చార్ట్, పజిల్, ప్యాటర్న్, డ్రాయింగ్, […].

By: jyothi

Updated On - Tue - 30 March 21

Intelligence : మీ తెలివి ఏవిధంగా తెల్లారుతోంది?..

Intelligence : తెలివి తక్కువ పని చేసినప్పుడు తిట్టడానికి పెద్దోళ్లు ఎక్కువగా ఈ మాట వాడతారు. వాళ్లతో అలా క్లాస్ పీకించుకోవద్దు అనుకుంటే మీలో నిజంగా ఏ తెలివి తేటలు ఉన్నాయో తెలుసుకోవటం ముఖ్యం. మనిషికి ముఖ్యంగా ఎనిమిది రకాల తెలివి తేటలు ఉంటాయట. కాబట్టి ఎవరు ఏ ఇంటలిజెన్స్ లో స్ట్రాంగో చూద్దాం..

విజువల్/స్పేసియల్:

చుట్టుపక్కల జరిగే సంఘటనలను మల్టిపుల్ డైరెక్షన్ లో చూడగలగటం. ఈ సామర్థ్యం ఉన్నవాళ్లల్లో మ్యాప్, చార్ట్, పజిల్, ప్యాటర్న్, డ్రాయింగ్, పెయింటింగ్, విజువల్ ఆర్ట్స్ వంటి స్కిల్స్ ఉన్నట్లు లెక్క. వీళ్లు పైలట్, ఫ్యాషన్ డిజైనర్, ఆర్కిటెక్ట్, సర్జన్, ఆర్టిస్ట్ లేదా ఇంజనీర్ కెరీర్లను ఎంచుకోవచ్చు.

Intelligence-different-types-of-intelligence

Intelligence-different-types-of-intelligence

బాడీ-కినెస్తెటిక్:

బాడీ మూమెంట్స్, యాక్షన్స్ బాగుండటం. వీళ్లలో ఫిజికల్ కంట్రోల్, హ్యాండ్-ఐ కోఆర్డినేషన్, బ్యాలెన్స్ ఎక్స్ లెంట్ గా ఉంటాయి. ఇలాంటి వాళ్లకు డ్యాన్స్, స్పోర్ట్స్ లో ట్యాలెంట్ ఉన్నట్లు భావించాలి. డ్యాన్సర్, ఫిజికల్ థెరపిస్ట్, స్కల్ప్టర్, అథ్లెట్, మెకానిక్, బిల్డర్, యాక్టర్ వంటి కెరీర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు.

లింగ్విస్టిక్-వెర్బల్:

చదివేటప్పుడు, రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు మంచి పదాలు వాడతారు. పదాల అర్థాలు, వాక్య నిర్మాణం, పలకాల్సిన తీరు, అందులోని హెచ్చుతగ్గులు వంటివి వీళ్లకు ఇట్టే అబ్బుతాయి. కాబట్టి పోయెట్, నావలిస్ట్, జర్నలిస్ట్, ఎడిటర్, లాయర్, టీచర్ వంటి ప్రొఫెషన్లకు సూటవుతారు.

ఇంట్రాపర్సనల్:

భావాల్ని, ఉద్వేగాల్ని అంచనా వేస్తారు. లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎదుటివాళ్ల ఫీలింగ్స్ కి అద్దం పడతారు. వాళ్లని విశ్లేషిస్తారు. వాళ్ల బలాలను, బలహీనతలను చెప్పేస్తారు. కాబట్టి వీళ్లు థెరపిస్ట్, కౌన్సెలర్, సైకాలజిస్ట్, ఎంట్రప్రెన్యూర్, ఫిలాసఫర్, థియొరిస్ట్ వంటి కెరీర్లు ఎంచుకోవాలి.

లాజికల్-మ్యాథమెటికల్:

సమస్యల్ని రీజనబుల్ గా, లాజికల్ గా అనలైజ్ చేస్తారు. చక్కని పరిష్కార మార్గాలు చూపుతారు. సైంటిఫిక్ ప్రయోగాలు చేస్తారు. కఠినమైన లెక్కల్ని కూడా ఈజీగా చేస్తారు. అందువల్ల కంప్యూటర్ ప్రోగ్రామర్, మ్యాథమెటీషియన్, ఎకనమిస్ట్, అకౌంటెంట్, సైంటిస్ట్, ఇంజనీర్ గా సెటిలవుతారు.

మ్యూజికల్:

రాగం, తాళం, పల్లవి, స్వరం, లయ, శ్రుతిని అర్థంచేసుకుంటారు. సంగీతం నేర్చుకుంటారు. సంగీత పరికరాలను సమర్థవంతంగా ప్లే చేస్తారు. మ్యూజిక్ అంటే చెవికోసుకుంటారు. ఇలాంటివాళ్లు సింగర్, మ్యూజికల్ కండక్టర్, డీజే, మ్యూజిక్ టీచర్, సాంగ్ రైటర్, కంపోజర్ వంటి కెరీర్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

ఇంటర్ పర్సనల్:

ఇతరులతో ఇట్టే కలిసిపోతారు. వాళ్ల మూడ్, ఎమోషన్స్, ఫీలింగ్స్, టెంపర్మెంట్ అన్నీ చదివేస్తారు. తమ భావాల్ని మాటల్లో, చేతల్లో ఎదుటివారికి తేలిగ్గా, ఆకట్టుకునేలా చెబుతారు. పాజిటివ్ రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తారు. ఇలాంటివాళ్లు టీమ్ మేనేజర్, నెగోషియేటర్, పొలిటీషియన్, పబ్లిసిస్ట్, సేల్స్ పర్సన్, సైకాలజిస్ట్ వంటి వృత్తులను ఎంచుకోవచ్చు.

న్యాచురలిస్టిక్:

పర్యావరణం, మొక్కల పెంపకం, ఇతర జీవుల గురించి శ్రద్ధ తీసుకోవటం వంటి అంశాల్లో ఆసక్తి చూపుతారు. బోటనీ, జువాలజీ సబ్జెక్టులను ఇష్టపడతారు. వీళ్లు జియాలజిస్ట్, ఫార్మర్, బోటనిస్ట్, కన్జర్వేషనిస్ట్, ఫ్లోరిస్ట్ వంటి కెరీర్ లలో రాణిస్తారు.

Latest News

Related News