Karthika Deepam 2 Nov Today Episode : బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం చాలా ఆసక్తిగా నడుస్తోంది. 2 నవంబర్ 2021 మంగళవారంతో ఈ సీరియల్ ఎపిసోడ్ 1.186లోకి అడుగుపెట్టింది. ఇపుడు ఇందులోని ఆసక్తి కరమైన సన్నివేశాలు ఏంటో చూసేద్దాం.. మోనితకు జన్మించిన చిన్నారి పేగులు మెడలో వేసుకుని పుట్టినట్టు డాక్టర్ చెప్పింది, దానివలన డాక్టర్ బాబుకు ప్రాణ గండమని ప్రియమణి తెలపడంతో సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. కార్తీక్‌కు ఏమైనా జరిగితే దీప పరిస్థితి ఎంటనీ ఆలోచిస్తూ వెంటనే పంతులు గారి దగ్గరకు వెళ్తుంది సౌందర్య.
పేగులు మెడలో వేసుకుని పుడితే ఖచ్చితంగా తండ్రికి ప్రాణగండం ఉంటుందని, శాంతి పూజ చేయాలని పూజారి చెబుతాడు. సౌందర్య మాట్లాడుతూ అయితే వెంటనే చేయండి అంటుంది. ఉదయాన్నే ఈ సామన్లు తీసుకుని ఆలయానికి రావాలని పంతులు సౌందర్యతో అంటాడు. అప్పుడు దోష నివారణ, శాంతి పూజ జరిపిస్తానని చెప్పి వెళ్తాడు. అయితే, ఈ పూజ కోసం బిడ్డ పేరెంట్స్ తప్పనిసరిగా ఉండాలని పంతులు చెప్పడంతో సౌందర్యకు నోట మాట రాదు.
సామన్ల చిటీ దీప చూసేసిందా..?
సీన్ కట్ చేస్తే.. మోనితను పూజకు ఎలా పిలవాలి, ఏమని పిలవాలని మనసులో ఆలోచించుకుంటూ కారులో వెళ్తుంటుంది సౌందర్య. దీప కూడా ఒంటరిగా రోడ్డుపై అదే దారిలో నడుచుకుంటూ వెళ్తుంది. సౌందర్య దీపను చూసి వెంటనే కారు ఆపి.. దీప ఎక్కడికెళ్లావు, అందరం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? అని అడుగుతుంది. ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు అత్తయ్య అని అంటుంది వంటలక్క..
Karthika Deepam 2 Nov Today Episode-1
మోనిత వరుస కాల్స్.. కట్ చేసిన కార్తీక్..
కార్తీక్‌కు మోనిత వరుసగా కాల్స్ చేస్తుండగా కార్తీక్ కట్ చేస్తుంటాడు. ఆ తర్వాత కార్తీక్ సౌందర్యకు ఫోన్ చేస్తాడు. ఆమె ఫోన్ పర్సులో ఉంటుంది. ఫోన్ బయటకు తీస్తే పంతులు రాసిచ్చిన చీటిని ఎక్కడ దీప చూస్తుందో అని సౌందర్య టెన్షన్ పడుతుంది. మళ్లీ కార్తీక్ కాల్ చేయగా, సౌందర్య దీపతో వద్దు ఫోన్ తీయకు అంటుంది. అయినా వినకుండా దీప ఫోన్ తీయడంతో సౌందర్య ఫోన్ తీసుకుని ఏం మాట్లాడదు. దీప ఎక్కడ వింటుందోనని భయపడుతుంది. వెంటనే కారు ఆపి కిందకు దిగిన సౌందర్య కార్తీక్ తో కాల్ మాట్లాడుతుంది. దీప నీ పక్కన ఉందా అని కార్తీక్ సౌందర్యను అడుగుతాడు. అంత తొందర ఏంటీ నీకు ఎందుకు పదేపదే కాల్ చేస్తున్నావు అని సౌందర్య అంటుంది కార్తీక్ తో..
ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి కారులో ఎక్కుతుండగా పంతులు రాసిచ్చిన చీటిని చూసేస్తుంది దీప. కార్తీక్ పేరుతో ఏదో పూజ సామను రాసి ఉంది. నాకు తెలియకుండా డాక్టర్ బాబు, అత్తయ్య ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తుంది. వెంటనే దానిని లోపల పెట్టేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే కార్తీక్ దీపం సీరియల్ తరువాయి భాగం కోసం ఎదరుచూడాల్సిందే.