karthika deepam Nov 11th episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ‘కార్తీకదీపం’ సీరియల్ గురువారం నవంబర్ 11న 1,194 ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని హైలెట్స్ ఇప్పుడు చూద్దాం.. పూజ అనంతరం కార్తీక్, సౌందర్య ఇంటికి వెళ్తుంటే మోనిత ఓవరాక్షన్ మాములుగా ఉండదు. తన కొడుకుతో మాట్లాడుకుంటూ.. మీ నాన్న వెళ్తున్నారు.. నన్ను కూడా ఇంటికి తీసుకెళ్లమని చెప్పు.. వెళ్లి అక్కలతో ఆడుకుంటానని చెప్పు అని అనేసరికి కార్తీక్‌కు కోపం వచ్చి మోనిత కొట్టడానికి వెళ్తుంటే సౌందర్య ఆపుతుంది.
కార్తీక్‌కు అసలు విషయం చెప్పిన వారణాసి..
కార్తీక్ ఇంట్లోకి వెళ్తున్న క్రమంలో ‘దీప’గుడికి వచ్చి అంతా చూసినట్టు నాకు అనిపిస్తుంది మమ్మీ అనడంతో సౌందర్య.. అలా జరిగి ఉండదురా.. భయపడకు అని సర్దిచెబుతుంది. ఇంతలో వారణాసి వచ్చి సౌందర్య దగ్గరకు దీపక్క మీతో వస్తానందిగా రాలేదా? అని అడుగుతాడు. మేము గుడి దగ్గర నుంచి వెళ్తుంటే మీ కారు కనిపించడంతో అక్క నన్ను కారు ఆపమంది. మీతో వస్తాను.. నువ్వు వెళ్లు అనడంతో నేను వెళ్లిపోయాను అని సౌందర్యతో అంటాడు వారణాసి. దీంతో ఒక్కసారిగా సౌందర్య, కార్తీక్ షాక్ అవుతారు. గుడిలో చూసిన సీన్ నిజమేనని గుర్తు చేసుకుంటూ మెట్లపై కులబడిపోతాడు కార్తీక్..
‘దీప ఎక్కడికి వెళ్లింది మమ్మీ.. ఇక తను నా దగ్గరకు వస్తుందా? దీపకు మొహం ఎలా చూపించాలంటూ కుమిలిపోతాడు. సౌందర్య బాధపడకు రా పెద్దోదా..? ‘నా కోడలిని ఎలాగైనా వెతికి తీసుకొస్తా… నిన్ను ఎలా నమ్మించాలి దీపా అంటూ సౌందర్య మదన పడుతుంటుంది.
Karthika Deepam 11 Nov Today Episode-1
తండ్రి మాటలకు తలపట్టుకున్న కార్తీక్..
దీప గుడికి వచ్చి పూజ చేస్తుండగా చూసిందని కార్తీక్, సౌందర్యలు ఆనందరావుతో చెప్పడంతో.. ఆవేశంతో అంతా అయిపోయింది.. ఇక దీపను మరిచిపోండని ఇద్దరిని తిట్టిపోస్తాడు. నా కోడలిని ఎలాగైనా తీసుకొస్తానని సౌందర్య అనడంతో ఎలా అని కోపంగా అంటాడు. ఈరోజు కాకపోయినా రేపు అయినా వాళ్లకి చెప్పాల్సిందే. ‘నా పెద్ద కొడుకు తప్పు చేశాడు. మొదటి భార్య ఉండగా.. వేరే ఆవిడతో కొడుకును కన్నాడని అనడంతో కార్తీక్ చెవులు మూసుకుని ‘డాడీ ప్లీజ్..’ఆపండి అంటూ గట్టిగా అరుస్తాడు. జరిగిందే కదా అన్నానని అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతాడు ఆనందరావు.
దీప ఆలోచించికుంటూ బస్తీలోనికి వెళ్దామని అనుకుంటుంది. కానీ ఎందుకో ఆగిపోతుంది. అయితే, అక్కడ నుంచి మోనిత ఇంటికి వెళ్లినట్టు మనం ప్రోమోలో చూడొచ్చు. రౌడీ రాణీ ఇస్ బ్యాక్ అంటూ దీప మోనితకు వార్నింగ్ ఇచ్చే సీన్ మనం చూడొచ్చు. ఏం జరిగిందో తెలియాంటే తరువాయి భాగం కోసం ఎదురుచూడాల్సిందే.