Life Style : ఈ రోజుల్లో దాదాపు ప్రతిఒక్కరూ సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ తదితర సామాజిక వేదికల్లో ఏదో ఒక దాంట్లో అకౌంట్ కలిగి ఉంటున్నారు. బ్యాచిలర్స్ గానీ పెళ్లైనవాళ్లు గానీ దీనికి అతీతులు కాదు. అయితే నిజ జీవితంలో ఎప్పుడూ క్లోజ్ గా గడిపే హ్యాపీ కపుల్స్ తమ అకౌంట్లలో చాలా తక్కువ పోస్టులు పెడుతుంటారు. వంద పోస్టులు చూస్తే అందులో ఒకటో అరో ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఎందుకు?. ఎందుకంటే దీనికి ముఖ్యంగా ఐదు కారణాలున్నాయి.
నువ్వు గానీ నీ లైఫ్ పార్ట్నర్ గానీ అదే పనిగా మీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటే మీరు మీ ఫాలోవర్లను మీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గురించి కన్విన్స్ చేయటానికి ప్రయత్నిస్తున్నారనే అర్థం వస్తుంది. నిజం చెప్పాలంటే మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉన్నారని ఇతరుల ముందు రుజువు చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. నిజాయితీగా, సంతోషంగా ఉండే జంటలు తమ అన్యోన్యమైన అనుబంధం గురించి ఎదుటివాళ్ల నుంచి సర్టిఫికెట్లు పొందాల్సిన పనిలేదు.
దాంపత్య జీవితానికి సంబంధించిన ప్రతి సందర్భాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకునేవాళ్లు కోతలరాయుళ్లని, అల్ప సంతోషులని ప్రాక్టికల్ గా ప్రూవ్ అయింది. అలాంటోళ్లను ఆన్ లైన్ ప్రపంచం నుంచి కాంప్లిమెంట్లు, లైక్ లు, కామెంట్లు తదితర కృత్రిమ ప్రతిస్పందనల కోసం ఎదురుచూస్తున్నవాళ్ల లాగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు నిజ జీవితంలో సహజంగా మెచ్చుకునేవాళ్లు ఉండరు కాబట్టి. ఒకరితో ఒకరికి చక్కని ర్యాపో కలిగిన జంటలు అలా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఇమేజ్ లు పెట్టాలని కోరుకోరు.
ఎవరైనా ఒక హ్యాపీ కపుల్ ఎక్కడికైనా హాలిడే వెకేషన్ కి వెళితే వాళ్లు అక్కడ అనుభవించే ప్రతి ఆనందమైన క్షణాన్నీ అప్పటికప్పుడే తమ బంధుమిత్రులతో పంచుకోవాలని అనుకోరు. ట్రిప్ ముగిసి ఇంటికి వచ్చిన తర్వాత తీరిగ్గా షేర్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్లు తాము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో, ఏవిధంగా ఫన్ ఆస్వాదిస్తున్నామో దాన్ని వేరేవాళ్లు కూడా లైవ్ గా చూడాలని భావించరు. ప్రజెంట్ సిచ్యుయేషన్ ని ప్లజెంట్ గా, మనస్ఫూర్తిగా ఫీలవ్వాలనే ఆశిస్తారు.
సోషల్ మీడియా కూడా పోటీ ప్రపంచం లాంటిదని ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. ఈ సామాజిక వేదికల పైన రెగ్యులర్ గా దర్శనమిచ్చేవాళ్లు రోజురోజుకీ బెటర్ గా కనిపించాలనే ఒక రకమైన మెంటల్ కాంపిటీషన్ ని ఎదుర్కొంటూ ఉంటారు. అందువల్ల ఎల్లప్పుడూ సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించేవాళ్లు ఇలాంటి అభద్రతా భావానికి లోనుకారు. ఇతరులను చూసి నేర్చుకోవాలనో, వాళ్ల కన్నా హ్యాపీగా ఉన్నట్లు నటించాలనో తాపత్రయపడరు.
అడుగడుగునా నిజాయితీగా ఉండటమే హ్యాపీ కపుల్స్ సక్సెస్ ఫుల్ రిలేషన్ షిప్ సీక్రెట్. అంతేగానీ ఒకరి సంతోషం కోసం మరొకరి మీద ఆధారపడటం కాదు. అందుకని అలాంటి జంటలు ఎప్పుడూ సంతోషం కోసం తమ విలువైన సమయాన్ని ఇలాంటి టైమ్ వేస్ట్ కార్యక్రమాలకు కేటాయించరు. తమను చూసి ఇతరులు జెలసీగా ఫీల్ అవ్వాలని అస్సలనుకోరు.