Mahateja Bharani : తనికెళ్లభరణి కుమారుడు హీరోగా నటించాడని తెలుసా..?

Mahateja Bharani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 300కు పైగా సినిమాల్లో ఎన్నో మంచి పాత్రల్లో నటించి తనికెళ్ల భరణి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ పాత్ర అయినా.. తండ్రి పాత్ర అయినా ఆయన అవలీలగా చేసేస్తారు. అయితే ఆయన కుటుంబం గురించి బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియదు. తనికెళ్ల భరణికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడి పేరు మహాతేజ భరణి. […].

By: jyothi

Updated On - Wed - 25 May 22

Mahateja Bharani : తనికెళ్లభరణి కుమారుడు హీరోగా నటించాడని తెలుసా..?

Mahateja Bharani : క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనికెళ్ల భరణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 300కు పైగా సినిమాల్లో ఎన్నో మంచి పాత్రల్లో నటించి తనికెళ్ల భరణి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్ పాత్ర అయినా.. తండ్రి పాత్ర అయినా ఆయన అవలీలగా చేసేస్తారు. అయితే ఆయన కుటుంబం గురించి బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలియదు. తనికెళ్ల భరణికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడి పేరు మహాతేజ భరణి.

అయితే మహాతేజ భరణి అనుకోకుండా ఓ సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా పేరు ‘లవంగం’. ఈ సినిమా విడుదలైన సంగతి కూడా చాలా మంది తెలియదు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 2011లో విడుదలైన ఈ మూవీలో కృష్ణభగవాన్, బ్రహ్మానందం, సుమన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమా హిట్ అవ్వకపోవడంతో తనికెళ్ల భరణి చాలా బాధపడ్డారు. అంతేకాకుండా ఈ సినిమా ఫలితంతో మహాతేజ భరణి నటనకు పూర్తిగా దూరమయ్యాడు.

అయితే మహాతేజ భరణికి చిన్నప్పటి నుంచి సామాన్య శాస్త్రంలో చాలా ఆసక్తి ఉండేది. సినిమాల్లో బ్రేక్ రాకపోవడంతో చివరకు ఆయన తనకు ఆసక్తి ఉన్న రంగంలో గొప్పస్థాయికి ఎదిగాడు. తనికెళ్ల భరణి సినిమా రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగితే.. మహాతేజ భరణి సైంటిస్టుగా కీర్తి ప్రతిష్టలను అందుకుంటున్నాడు. అతడు రీసెంట్‌గా వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయాడు.

Mahateja Bharani Acted Movie Hero Lavangam

Mahateja Bharani Acted Movie Hero Lavangam

కాగా తనికెళ్ల భరణి నటుడిగానే కాదు రచయితగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారు. దివంగత బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ నటి లక్ష్మీ ప్రధాన పాత్రల్లో మిథునం లాంటి సినిమాకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన శివ సినిమాకు తనికెళ్ల భరణి డైలాగ్ రైటర్‌గా పని చేశారు. తనికెళ్ల టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించడం విశేషం అనే చెప్పాలి.

Related News