Marriage: ఆ సోదరి మనసుకు సెల్యూట్

Marriage: ఒక అమ్మాయి. ఆమెకు సంబంధం కుదిరింది. ఆ పెళ్లి.. పీటల దాకా వచ్చింది. మరికొద్దిసేపట్లో ఆమె మెడలో మూడు ముళ్లు పడటమే తరువాయి. సంతోషంగా తాళి కట్టించుకోవాల్సిన ఆ అమ్మాయి మనసు చాలా బాధగా ఉంది. కారణం.. తన చెల్లికి వివాహం అవుతుందో లేదో అనే ఆందోళన. ఎందుకంటే ఆ అమ్మాయి సోదరికి మాటలు రావు. చెవులు వినపడవు. ఆ దివ్యాంగురాలిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్న ఆ అమ్మాయిని వెంటాడింది. దీంతో పెళ్లి […].

By: jyothi

Updated On - Mon - 17 May 21

Marriage: ఆ సోదరి మనసుకు సెల్యూట్

Marriage: ఒక అమ్మాయి. ఆమెకు సంబంధం కుదిరింది. ఆ పెళ్లి.. పీటల దాకా వచ్చింది. మరికొద్దిసేపట్లో ఆమె మెడలో మూడు ముళ్లు పడటమే తరువాయి. సంతోషంగా తాళి కట్టించుకోవాల్సిన ఆ అమ్మాయి మనసు చాలా బాధగా ఉంది. కారణం.. తన చెల్లికి వివాహం అవుతుందో లేదో అనే ఆందోళన. ఎందుకంటే ఆ అమ్మాయి సోదరికి మాటలు రావు. చెవులు వినపడవు. ఆ దివ్యాంగురాలిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్న ఆ అమ్మాయిని వెంటాడింది. దీంతో పెళ్లి పీటల మీద కూర్చున్న ఆ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను నలుగురూ ఒప్పుకుంటారా లేదా అనేది ఆమెకు అనవసరం. తనను పెళ్లిచేసుకోబోయే వ్యక్తి అంగీకరిస్తే చాలు అనుకుంది. అనుకోవటమే ఆలస్యం ఆ విషయాన్ని అతని చెవిన వేసింది. కాబోయే భార్యను అర్థంచేసుకున్న ఆ వరుడు ఆమె చెప్పినదానికి సరే అన్నాడు. ఆమె గొప్పతనానికి మనసులోనే సెల్యూట్ కొట్టాడు. దీంతో అతని పక్కన రెండో వధువు కూడా వచ్చి కూర్చుంది. అతను ఆ ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు.

ఎక్కడ జరిగింది?..

కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని వేగమడుగు గ్రామంలో ఈ అనూహ్య సంఘటన జరిగింది. ఆ ఊరిలోని రాణెమ్మ, నాగరాజప్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒక అమ్మాయి పేరు సుప్రియ. ఆమె చెల్లెలి పేరు లలిత. పెద్దమ్మాయి సుప్రియకి బాగేపల్లి గ్రామానికి చెందిన ఉమాపతి అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 7న ముహూర్తం. పెళ్లిమండపంలో వరుడు ఉమాపతి తన మెడలో తాళి కట్టబోతుండగా సుప్రియ ఒక మెలిక పెట్టింది. తన చెల్లిని కూడా వివాహం చేసుకుంటానంటేనే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటానని మొండికేసింది. దీంతో అతను ఇద్దరికీ మాంగళ్యధారణ చేశాడు.

మరో ట్విస్టు..

ఇంతవరకూ బాగానే జరిగింది. కానీ ఇక్కడే కథ మరో ఊహించని మలుపు తిరిగింది. ఉమాపతి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరు అమ్మాయిల్లో చిన్నమ్మాయి లలితకు వివాహ మహోత్సవం నాటికి 18 ఏళ్లు నిండలేదని, మైనర్ అని తేలింది. దీంతో శిశు సంక్షేమ శాఖ వాళ్లు, పోలీసులు వచ్చి ఆ కొత్త పెళ్లికొడుకు సహా మొత్తం ఏడుగురిపై కేసు పెట్టినట్లు సమాచారం.

Read Today's Latest News News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News